.
ఏశనాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల, మనం ఊగుదమే బాలా… ఈ పాట ప్రస్తుతం బంపర్ హిట్… ఎక్కడ చూసినా అదే పాట… ఊగిపోతోంది, ఊపేస్తోంది… వీడియోలు, రీల్స్, షార్ట్స్, మీమ్స్ జోరుగా కనిపిస్తున్నాయి…
అఫ్‌కోర్స్, ఆమధ్య చిన్న వివాదం కూడా తలెత్తినా సరే, ఆ పాట ట్యూన్ అందరినీ కట్టిపడేస్తోంది… తెలుగులో అనిరుధ్‌కు బాగా పాపులారిటీ వచ్చేసింది ఈ దెబ్బకు… దొరలు ఇప్పసారా ఎందుకు తాగుతారనే చిన్న చిన్న సందేహాలూ నాకూ ఉన్నా, మొత్తానికి పాట జోష్‌లో ఇవన్నీ కొట్టుకుపోయే సందేహాలే…
Ads
ఈ ఉపోద్ఘాతం దేనికీ అంటే… చివరకు జబర్దస్త్ వంటి కామెడీ షోలో స్కిట్లకూ ఈ పాట ప్రేరణ అవుతోంది… మరీ ప్రేరణ కాదు గానీ ఓ పేరడీ… తాజా జబర్దస్త్ ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… నిజానికి సద్దాం కామెడీ మంచి టైమింగుతో ఉంటుంది…

నాగబాబు జడ్జిగా- సహనిర్మాతగా వచ్చాక సద్దాం కూడా జెమిని మాస్‌జాతర వదిలేసి ఇటు వచ్చినట్టున్నాడు… (ఏమాటకామాట జబర్దస్త్ రొటీన్ ఫార్ములాకన్నా మాస్‌జాతర షో భిన్నంగా బాగుంటోంది)… ఈ ప్రోమోలో సద్దాం, మరికొన్ని దెయ్యాలు కలిసి, చెట్టుకు వేలాడుతున్న ఓ అస్థిపంజరం దగ్గర ఈ ఏశనాగుల కట్ట మీద పాట పాడుతుంటారు…
యథాతథంగా అదే స్పీడ్ ట్యూన్ కాదు, పక్కా స్లో పేరడీ టోన్… అందులో నుంచి కామెడీని క్రియేట్ చేసే ప్రయత్నం… (ఇంద్రజ ఆ పాటను కూడా చంపేశారు కదరా అంటోంది నవ్వుతూ)… పర్లేదు, భిన్నంగా ఉంది, ఎప్పుడూ జబర్దస్త్‌లో కనిపించే అగ్లీ, డర్టీ కంటెంటుకు భిన్నంగా… ఐతే ఇంకా ఆ సినిమా విడుదల కూడా కాలేదు… దానికి పేరడీ స్కిట్‌కు సదరు నిర్మాతలు బాగానే అంగీకరించారు సుమీ…
ఏమో, ఇలా ఇంకాస్త పాపులారిటీ, ప్రచారం వస్తుందని వోకే చెప్పారేమో.., (నిజానికి ఈ పాటకు అసలు ప్రచారమే అక్కర్లేదు ఇప్పుడు…) కాకపోతే ఈ స్కిట్ పాటను కించపరిచేలా ఏమీ లేదు… సద్దాం జాగ్రత్తపడ్డాడు… మొత్తానికి ఈ పాట ఎంతగా చొచ్చుకుపోయిందో అర్థమవుతూనే ఉంది… ఇంట్రస్టింగు..!! ఇవి గాకుండా మిగతా స్కిట్లు సో సో, ఎప్పటిలాగే..!!
ఈటీవీ రియాలిటీ షోలలో కొంత మార్పు కనిపిస్తోంది… ఢీ జడ్జిలు మారారు… జానీ మాస్టర్ వచ్చాడు… అనుపమ పరమేశ్వరన్ వచ్చింది డబుల్ ఇంపాక్ట్ అంటూ, ఢీ షోతో పాపులరై, సినిమా కొరియోగ్రాఫర్లయిన పలువురు మాస్టర్లూ వచ్చారు… బాగుంది…!!
Share this Article