Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తాయారమ్మ బంగారయ్య సినిమా మళ్లీ తీస్తే పార్వతీపరమేశ్వరులు

January 28, 2025 by M S R

 

Subramanyam Dogiparthi ….. పెళ్ళాం గారు ముదురు రంగు చీరెలు కట్టుకోవాలని అనుకుంటుంది . మొగుడు గారు తన భార్యామణికి ముదురు రంగులు బాగుండవు కాబట్టి లైట్ కలర్సే కట్టుకోవాలి అంటాడు .

పెళ్ళాం గారికి స్లీవ్ లెస్ బ్లౌజులు వేసుకోవటం ఇష్టం ఉండదు . మొగుడు గారికి పది మందిలోకి వెళ్ళినప్పుడు అల్ట్రా మోడర్నుగా ఉండాలని పిచ్చ కోరిక .

Ads

పెళ్ళాం గారికి మూడ్ బాగున్నా బాగుండకపోయినా మొగుడి గారి కోరికలు తీర్చాలి . ఇలాంటి బేచ్ మనలో చాలామంది ఉంటారు . అందులో ఒక జంట చిరంజీవి , ప్రభ . మరో జంట చంద్రమోహన్ , స్వప్న .

మొగుడు గారు మట్టసం . పెళ్ళాం గారికి మదం , అహం , డాంబికం , ఆభిజాత్యం పుష్కలం . రెండు జంటలూ పంతాలకు పోయి బ్రేకప్ అనేసుకొని పేకప్ చేసేసుకుంటారు . ఆ రెండు జంటల్నీ మళ్ళా టింకరింగ్ చేసే పని పార్వతీపరమేశ్వరులది .

ఇది మరో తాయారమ్మ బంగారయ్య సినిమా అన్న మాట . అన్న మాటేం కాదు ఉన్న మాటే . పార్వతీపరమేశ్వరులుగా మళ్లీ అదే సత్యనారాయణ , అదే షావుకారు జానకి… నటన చాలా బాగుంటుంది .

ఇందులో కూడా చంద్రమోహన్, చిరంజీవి… ఇందులో ముఖ్యంగా సత్యనారాయణ పాత్ర హైలైట్ . ముసలి తనంలో కుర్ర జంటల్లాగా హుషారుగా నటిస్తారు . సినిమాలో హడావుడి అంతా సత్యనారాయణదే . చిరంజీవి , స్వప్న వాళ్ళ సంతానం .

చిరంజీవి , ప్రభ , చంద్రమోహన్ల నటన చాలా బాగుంటుంది . ఉక్రోశం , పొగరు , overpossessiveness , తన మాటే నెగ్గాలనే పట్టుదల వంటి నెగటివ్ లక్షణాలతో ఉంటుంది అతని పాత్ర . అలవోకగా చేసేసాడు .

అతనికి జోడీగా ప్రభ చాలా బాగా నటించింది . గాయనిగా ఆమెకు రెండు పాటలు ఉంటాయి . అద్భుతంగా ఉంటాయి . చంద్రమోహన్ ఇలాంటి పాత్రల్ని వెడమ చేత్తో చేసేస్తాడు . అలాగే చేసాడు .

ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య , హేమసుందర్ , ప్రభాకరరెడ్డి , నరసింహ రాజు , అత్తిలి లక్ష్మి ప్రభృతులు నటించారు .

ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేందుకు కారణం సత్యం సంగీత దర్శకత్వం . సదా సుధామయ అనే శాస్త్రీయ గీతం చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . నాద నిలయుడే శివుడు ఆది మధ్యాంత లయుడు అనే మరో శాస్త్రీయ కచేరీలో కూడా ప్రభ నటన చాలా బాగుంటుంది . ఈ పాటలో చిరంజీవి శివుడిగా దర్శనమిస్తాడు .

ప్రభ నృత్యం చాలా బాగుంటుంది . ఈ రెండు పాటలు సినిమాకు లైఫ్ . పాటలను అన్నీ వేటూరే వ్రాసారు . ముఖ్యంగా ఈ రెండు పాటల్ని చాలా గొప్పగా వ్రాసారు . నృత్య దర్శకులు హీరాలాల్ బృందాన్ని అభినందించాలి .

భరత మాత పుత్రులం గరిటె తిప్పు వీరులం అంటూ సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , చిరంజీవిల మీద పాట గోలగోలగా బాగుంటుంది . అలాగే సత్యనారాయణ , షావుకారు జానకిల తళుకు చూసినా నీ బెళుకు చూసినా అంటూ ముసలోళ్ళ అల్లరి గోల పాట హుషారు హుషారుగా ఉంటుంది .

హలం కూడా ఈ పాటలో కాసేపు ముసలోడితో డాన్సిస్తుంది . చంద్రమోహన్ , స్వప్నల మీద పాట తొలి మోజులో చలి రోజులో బాగానే ఉంటుంది . యస్ వెంకటరత్నం నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు యం యస్ కోటారెడ్డి .

యస్ భావనారాయణ చిత్రానువాదం బాగానే చేసారని మెచ్చుకోవలసి ఉంటుంది . అలాగే అక్కినేని సంజీవి ఎడిటింగ్ . సినిమాలో గొల్లపూడి మారుతీరావు సంభాషణలను కూడా ప్రత్యేకంగా అభినందించాలి . వెరశి మంచి కుటుంబ , వినోదభరిత సినిమా .

చిరంజీవి , ప్రభ , సత్యనారాయణ అభిమానులు తప్పక చూడవలసిన సినిమాయే . A watchable entertaining , musical , feel good movie . యూట్యూబులో ఉంది . ప్రభ ఆ రెండు పాటల్ని మాత్రం పొరపాటున కూడా మిస్ కాకండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
  • బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండొద్దు…
  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
  • ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions