కొందరిని చూస్తే జాలేస్తుంది… హీరో సిద్ధార్థ్‌ను చూసినా అంతే… ఒకప్పుడు తెలుగులో పాపులర్ హీరో… మంచి లవ్ బాయ్ ఇమేజీతో కుమ్మేశాడు… తరువాత గ్రహణం పట్టింది… అప్పుడప్పుడూ తన స్థాయికి మించిన ఏవో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ నెటిజనంతో తిట్లు కూడా తింటుంటాడు… తమిళానికే పరిమితమయ్యాడు… అసలు తెలుగులో ఓ హిట్ లేక ఎన్నేళ్లయింది..? మొహంలో కూడా ఆ కళ లోపించింది… ఆమధ్య శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేశాడు… సిద్ధార్థ్ దురదృష్టం శర్వాకు కూడా పట్టినట్టుంది… సినిమా ఫ్లాప్…
అదితిరావు హైదరీ, అనూ ఇమాన్యుయేల్, శర్వానంద్, సిద్ధార్థ్… తారాగణం పర్లేదు… ఓ ఐటమ్ సాంగ్‌లో పాయల్ రాజ్‌పుత్‌ను కూడా తీసుకొచ్చి పెట్టారు… కానీ జనం తిరస్కరించారు… అప్పట్లో ‘ముచ్చట’ రాసిన రివ్యూ ఇదీ…
సిద్ధార్థ్ రీఎంట్రీ తుస్సు..! హైప్ ఎక్కువ- హోప్ తక్కువ..! మహాసముద్రమేమీ కాదు..!!
Ads
నిజానికి థియేటర్ల దాకా వెళ్లాలా ఈ సినిమా కోసం అనుకుంటారు ప్రేక్షకులు కొన్ని సినిమాల విషయంలో…. కానీ అవే సినిమాలు టీవీల్లో వస్తే, ఓటీటీల్లో వస్తే చూస్తారు… కానీ ఈ మహాసముద్రం జస్ట్, ఓ పిల్ల కాలువ అయిపోయింది మరీ… టీవీల్లో కూడా ఎవరూ పట్టించుకోలేదు… మరీ ఎంత దారుణం అంటే… 3.98 రేటింగ్ (హైదరాబాద్ బార్క్) వచ్చింది… సినిమాలకు సంబంధించి ఇది మరీ దయనీయమైన రేటింగ్… నేలకరుచుకున్న సిద్ధార్థ్ ఇప్పట్లో ఇక లేచే పరిస్థితి కనిపించడం లేదు… జతకూడిన శర్వాకూ ఈ తలవంపులు తప్పలేదు…
అసలు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగిన అంశం మరొకటి ఉంది… జెమిని టీవీకి సినిమాలు అమ్మితే డబ్బులొస్తాయేమో గానీ జనం చూడరు… దాని రీచ్ తక్కువ… జనం ఆ చానెల్ ట్యూన్ చేయడం మానేశారు… సినిమాలే కాదు, ప్రిస్టేజియస్ షోలు కూడా అంతే… ఫాఫం, జూనియర్ ఎన్టీయార్ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో ఎలా అట్టర్ ఫ్లాప్ అయ్యిందో చూశాం కదా… అదే షో మాటీవీలో వచ్చి ఉంటే కథ వేరే ఉండేదేమో కాస్త… సేమ్, తమన్నా హొయలుపోయిన మాస్టర్ చెఫ్ కూడా అంతే… (ఈ ఫ్లాప్ షోకు మళ్లీ అనసూయను తీసుకురావడం, ఆమె వచ్చాక మరింత రేటింగ్ పాతాళంలోకి పోవడం, యాంకర్లతో షోలు నడవవు అనే సోయి జెమిని వాడికి అప్పటికీ అర్థం కాకపోవడం… అదంతా వేరే కథ…) ఇతర భాషల్లో కాస్తోకూస్తో ఆదరణ పొందిన షోలు తెలుగులో ఎందుకు ఫట్‌మని పేలిపోతున్నయ్… జెమిని వాడు ఇకనైనా ఆలోచించుకోవాలి… అబ్బే, ఆలా ఆలోచిస్తే దాన్ని జెమిని టీవీ అనలేం కదా అంటారా..? అంతేలెండి…!!
చెప్పనేలేదు కదూ… ఈటీవీలో తలైవి సినిమా వేశారు… అది మరీ ఘోరం… మరీ రెండున్నర రేటింగ్స్… ఆ రైట్స్ కొని ప్రసారం చేసినందుకు ఈటీవీవాడు సిగ్గుపడుతున్నాడు… ఇక కంగనా గురించి చెప్పడానికి ఏమీ లేదు… మరీ తలవంపులు… నిజానికి ఆమె బాగా నటించింది, వంక పెట్టేదేమీ లేదు… కానీ ఆ సినిమాను పూర్తిగా ‘తమిళ ప్రేక్షకుల’ను దృష్టిలో పెట్టుకునే నిర్మించారు… ఆ కథ, మన్నూమశానం అన్నీ అంతే… నిజానికి జయలలిత అనే కేరక్టర్ పాన్ ఇండియా రేంజ్… కథ అలా రాసుకోవడంలో గానీ, అలా చిత్రీకరించడంలో గానీ దర్శకుడు ఫ్లాప్… ఫ్లాపున్నర… ఫాఫం ఈటీవీ… అది కొత్త సినిమాలు కొనేదే చాలా అరుదు… ఒకవేళ కొంటే… ఇదుగో ఇదీ రిజల్ట్…!!
Share this Article