.
కాశిష్ వోహ్రా… అలియాస్ ఆర్ణ వోహ్రా… పేరు ఎప్పుడూ వినలేదా..? ఫాఫం… తెలుగులో హీరోయిన్‌గా కూడా చేసింది… మా నాన్న సూపర్ హీరో అని ఆమధ్య వచ్చింది… పోసాని నాగ సుధీర్ బాబు హీరో…
కాస్త పేరున్నోడే కదా… ఓ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోడే కదా… హీరో మహేశ్ బాబు బావ… కాస్త వైవిధ్యం ఉన్న సినిమాలు చేస్తుంటాడని కూడా పేరుంది కదా… ఐనా తన పక్కన హీరోయిన్‌గా చేస్తే తెలుగు ప్రేక్షకులకు కనీసం కొన్నాళ్లయినా గుర్తుండాలి కదా…
Ads
లేదు… గుర్తు లేదు, గుర్తుండే పాత్ర కూడా కాదు… ఏదో తెలుగు సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఓ పాత్ర క్రియేట్ చేసి, ఉండీ లేనట్టుండే ఓ లవ్ ట్రాక్… అంతే… నెట్‌లో కూడా ఆ అమ్మాయి వివరాలు పెద్దగా దొరకవు… నవ్వొచ్చేది ఏమిటంటే… సినిమా రివ్యూల్లో ఆమె పేరు కూడా రాయలేదు చాలామంది… అంత అన్ నోటీస్‌డ్‌గా వెళ్లిపోయింది… మళ్లీ ఎక్కడా కనిపించలేదు…
నిజానికి ఆ సినిమా తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్స్ మీదే ఆధారపడిన కథ… మంచి కథ… ఇంట్రస్టింగు స్టోరీ లైన్… ఒక తండ్రి తన కొడుకును తాత్కాలికంగా అనాథాలయంలో ఉంచితే, తను కొన్నాళ్లపాటు తిరిగి రాలేకపోతే… ఆ కొడుకును మరో తండ్రి దత్తత తీసుకుంటాడు… కానీ ఆ వెంటనే తనకు అన్నీ నష్టాలే… కొడుకే అరిష్టమని ద్వేషం పెంచుకుంటాడు… పెంచిన తండ్రి మీద కొడుక్కి ప్రేమ, ఆ పెంపుడు తండ్రి కష్టాలు తీర్చడానికి తిప్పలు… ఆ తిప్పల్లోనే కన్నతండ్రి డబ్బే కాజేసే ప్రయత్నం… తన తండ్రే అని తెలియక…
మధ్యలో రాజుసుందరం పాత్ర క్రియేట్ చేసి, దర్శకుడు కాస్త దారితప్పించాడు కథను కాసేపు… కానీ సాయిచంద్, సాయాజీ షిండే, సుధీర్ బాబు కథకు తగినట్టు నటించారు… రివ్యూలు కూడా బాగానే వచ్చాయి… థియేటర్లలో పెద్దగా ఆడలేదు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… 16న జీతెలుగులో ప్రసారం చేశారు…
అసలు సినిమాయే ఎవరికీ గుర్తులేదు… మౌత్ టాక్ లేదు… అసలు పెద్ద పెద్ద హీరోల సినిమాలే టీవీల్లో ఎవరూ చూడటం లేదు, దారుణంగా టీఆర్పీలు నమోదవుతున్నాయి… ఇక ఇదెవరు చూడాలి..? అవును, అదే జరిగింది… ఎంత ఘోరమైన రేటింగ్స్ అంటే… 1.09 మాత్రమే… ఒక్క ముక్కలో చెప్పాలంటే పొరపాటున ఆ సమయంలో ఎవరో కొంతమంది ట్యూన్ చేసి ఉంటారు, అలా నమోదైనట్టు లెక్క…
గతం కాదు ఇప్పుడు… ఆ సినిమా వస్తున్న సమయంలోనే టీవీల ముందు కూర్చుని, అన్ని యాడ్స్ భరిస్తూ… వీక్షించే రోజులు పోయాయి… వీలున్నప్పుడు ఓటీటీలో చూస్తూ, ఆపుతూ, రీవైండ్ చేస్తూ, స్పీడ్‌గా లాగించేస్తూ ‘ఇష్టమొచ్చినట్టు’ చూసే రోజులు ఇవి… కుటుంబసభ్యులు కూడా ఎవరి ట్యాబుల్లో వాళ్లు, ఎవరి మొబైల్స్‌లో వాళ్లు… ఎవరికి టైమ్ దొరిెకినప్పుడు వాళ్లు…
అందుకే ఈ దారుణమైన రేటింగులు… సీరియళ్లకు ఎటూ టీవలో వీక్షణం తప్పదు కాబట్టి వాటి రేటింగులు ఓమోస్తరుగా నమోదవుతున్నాయి.,.అవీ రీచ్ ఎక్కువగా ఉండే స్టార్ మా, జీతెలుగు… జెమిని వదిలేయండి, ఈటీవీ రేటింగ్స్ మరీ దారుణంగా ఉంటున్నయ్… సో, రాబోయే రోజుల్లో ఈమాత్రం కూడా సినిమాల్ని టీవీల్లో ఎవరూ చూడకపోవచ్చు… శాటిలైట్ హక్కులు అడ్డగోలు రేట్లకు కొంటే చేతులు కాల్చుకోకా తప్పదు..!!
Share this Article