ప్చ్.., ఆంధ్రజ్యోతి స్పై కెమెరాలు, సీక్రెట్ ఇయర్ బగ్స్ కూడా పనిచేస్తున్నట్టు లేవు… ప్రధాని మోడీ కార్యాలయం (బహుశా ఆమ్రపాలి..?) జగన్ వస్తున్నాడనగానే ఆంధ్రజ్యోతి గూఢచారదళం యాక్టివేట్ అయిపోతుందని తెలిసి, మొత్తం కొత్త జామర్లను ఫిక్స్ చేసినట్టుంది… అందుకే మోడీ జగన్‌తో ఏం మాట్లాడాడు, మడమ బెణుకు సాకుతో చాలారోజులుగా రానందుకు సారీ చెప్పాడా, ఈసారికి మీరే రక్షించండి మహాప్రభో అని వేడుకున్నాడా, సరే, ఇది నీకు చివరి చాన్స్, రక్షిస్తానుపో అని మోడీ అత్యంత ఔదార్యంతో క్షమించేశాడా…. ఇవేవీ ఏబీఎన్‌లో రాలేదు, ఆంధ్రజ్యోతిలో రాలేదు… సో, అక్కడి రిపోర్టర్ల వల్ల కాదు ఇక… వచ్చే కొత్తపలుకు నాటికి బాసే బరిలోకి దిగుతాడు… రిపోర్ట్ చేస్తాడు…
ప్రస్తుతానికి ఆమ్రపాలిని నిందించడంతో సరిపుచ్చారు… అసలు ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రెటరీ ఆమ్రపాలి జగన్‌ను కలవడం ఏమిటంటూ ఓ వార్తలో కస్సుమన్నది ఆంధ్రజ్యోతి… ఆ వార్త సారం ఎలా ఉందంటే..? ‘‘అసలు ఆమెది ఆంధ్రా కేడర్ కాదు, తెలంగాణకు మార్చుకుంది, తరువాత ఢిల్లీ పీఎంఓలో చేరింది… ఇక ఏపీ ఐఏఎస్ అధికారులతో టచ్‌లో ఉండటం ఏమిటసలు..? అంతా తానై జగన్ సర్కారును నడిపే ప్రవీణ్ ప్రకాష్ ఆమెతో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏమిటి..? ఆమె సహకారం తీసుకోవడం ఏమిటి..? తప్పు కదా… పైగా సీఎం జగన్‌తో భేటీ వేయడం ఏమిటి..? ఇలా బయటికి వచ్చిన నాయకులు, జర్నలిస్టులతో భేటీలు వేయడాన్ని మోడీ ఇష్టపడడనే సంగతి ఆమెకు తెలియదా..? ఆయ్ఁ… ఇలా సాగిపోయింది…
Ads
ఒక సీఎం ప్రధానిని కలవడానికి వస్తున్నప్పుడు… చాలా అంశాలు (వ్యక్తిగత, రాజకీయ, ఇతరత్రా యవ్వారాలు సహా) ప్రస్తావనకు వస్తాయి… వాటి ప్రజెంట్ స్టేటస్ ఏమిటో పీఎంఓ మాత్రమే కదా మోడీకి చెప్పాల్సింది… వాళ్లు చేసే పనే అది కదా… బయటికి వెళ్లి సీఎంలు, లీడర్లు, జర్నలిస్టులను కలవడాన్ని మోడీ ఇష్టపడడని తెలిసీ… ఆమె జగన్‌తో భేటీ వేసిందంటే… అధికారికమైన పని మీదే అని అర్థమవుతోంది కదా… మరిక తప్పుపట్టే పనేముంది ఇందులో..? ఏదో ఒకటి దుమ్ముపోయడం తప్ప… పాలసేకరణ ధర మీద పూనం ఏదో మాట్లాడింది అంటూ ఆమెను తిట్టిపోశారు నిన్న… జగన్‌తో భేటీ అయ్యాడని ఆమ్రపాలిని నిందిస్తున్నారు… అంతకుముందు శ్రీలక్ష్మి మీద కూడా…! ఇంకా నయం… జగన్ రెడ్డి ప్రభుత్వం మీద కులస్పృహతోనే ఆమె ప్రేమ కనబరుస్తోంది… అందుకే సీఎం ఢిల్లీ రాగానే వెళ్లి కలిసినట్టుంది అని రాయలేదు..!! ముస్సోరీలో సివిల్ సర్వీసు అధికారుల శిక్షణలో కొత్త సిలబస్ కూడా చేర్చాలి నిజానికి… ‘‘How to escape from home state media”… లేకపోతే ఇదుగో, ఇలాగే దొరికిపోతారు..!!
Share this Article