.
ముందుగా ఓ తాజా వార్త చదవండి… వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించిందే… శీర్షిక ‘‘శభాష్ ఖాకీ… ఇది కదా డ్యూటీ అంటే…’’
చుట్టూ చీకటి…
అర్థరాత్రి 11.21 గంటలు…
ఉన్నదేమో అతి తక్కువ సమయం…
రెండు జిల్లాల దూరం…
కాపాడాల్సిన ఒక నిండు ప్రాణం…
మూడు ఖాకీలు ఒక్కటైన తరుణం…
ఆపై విజయం…
Ads
” 6 నిమిషాల్లో అయినవిల్లి నుంచి అన్నవరం “…
సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వ్యక్తిని 6 నిమిషాల్లో కాపాడిన పోలీసులు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయేందుకు సిద్ధమైన వైనం…
వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు…
ఆ తర్వాత తనకు కావలసిన బంధువులకి సెల్ఫీ వీడియో పెట్టి, ఇక ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకున్నాడు… ఆ సమయంలో పి.గన్నవరం సీ.ఐ భీమరాజుకు వచ్చింది ఈ సమాచారం… వెంటనే అతను ఫోన్ నెంబర్ ని ట్రేస్ చేయడం కోసం ఐటీ కోర్ లో పనిచేస్తున్న జాఫర్ కు పంపించడం జరిగింది…
వెంటనే స్విచాఫ్‌లో ఉన్నా ఆ మొబైల్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి, సెల్ ఐడితో లాస్ట్ లొకేషన్ కనుగొన్నాడు ఆ జాఫర్…
ఆ లొకేషన్‌ను సీ.ఐ భీమరాజుకు షేర్ చేయడం జరిగింది… సీ.ఐ భీమరాజు ఆ లాస్ట్ లొకేషన్ కాకినాడ జిల్లా అన్నవరం కావడంతో వెంటనే అన్నవరం ఎస్సై శ్రీహరిని లైన్‌లోకి తీసుకోవడం జరిగింది…
అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లొకేషన్‌కి పంపించాడు… అంతేకాదు, ఆ వీడియో వెనకాల ఉన్న రూమ్ లాడ్జి రూమ్‌లాగా అనిపించడంతో అన్నవరంలో ఉన్న లాడ్జి ఓనర్స్ గ్రూపులో దాన్ని షేర్ చేసి వాళ్లందర్నీ అలెర్ట్ చేయడం జరిగింది…
వెంటనే ఒక లాడ్జ్ యజమాని అతడిని గుర్తించి సరిగ్గా ఉరివేసుకొనే సమయంలో తలుపు బద్దలు కొట్టి అతన్ని కాపాడడం జరిగింది… ఈ మొత్తం వ్యవహారం అంతా రాత్రి 11:21 నుంచి 11:27 మధ్యలో కేవలం ఆరు (6) నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది…
గుడ్, ఖచ్చితంగా సదరు పోలీసు సిబ్బంది అభినందనీయులే… అంత రాత్రి అంత వేగంగా పోలీసులు స్పందించడం అరుదు కాబట్టి ప్రశంసిద్దాం… అంతేకాదు, టెక్నాలజీని వాళ్లు ఉపయోగించుకున్న తీరు మెచ్చుకోదగింది…
ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నా సరే, ఆ సెల్ ఐడీ, క్రెడెన్షియల్స్ బట్టి… దాని లాస్ట్ లొకేషన్ కూడా పోలీసులు కనిపెట్టగలరు… ట్రేస్ చేయగలరు… (ఆ ఫోన్ నంబర్, IMEI నంబర్ పోలీసులకు ఎలా తెలిశాయి..?) సరే, ఆ అత్యాధునిక టెక్నాలజీ పోలీసుల వద్ద ఉంది అని పాఠకులు, ప్రజలు తెలుసుకోవల్సిన ఇన్సిడెంట్ ఇది… అదీ ఇక్కడ చెప్పాలనుకున్నది..!! దీన్ని ఇతర కేసుల్లో ఇంత సమర్థంగా వాడుతున్నారా అనేది ఓ ప్రశ్న..!!
Share this Article