Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Poonam Pandey … ఆమె మరణం నిజం కాదా..? ఓ వికృత నాటకమా..?

February 3, 2024 by M S R

Aranya Krishna ……….   ఆమె నిజంగా మరణించిందా? పూనం పాండే చనిపోయినట్లు ఇవాళ సాయంత్రం నెట్లో వార్త చూశాను. ఆమె మహా నటి కాదు. ఒక శృంగార తార. వీళ్లు వికృత వ్యవస్థకి పుట్టిన సాంస్కృతిక శిశువులే. ఎదుగుదల సమయంలో వ్యవస్థ తమకి ఆఫర్ చేసిన సంస్కృతిని స్వీకరించిన వారే. వ్యక్తిగతంగా తప్పు పట్టడానికి వాళ్లేం దోపిడీదారులు కారు. అందుకే 32 ఏళ్ల వయసులో గర్భాశయ కేన్సర్ తో ఒక బ్లూ స్టార్ చనిపోయినా అది బాధాకరమే.

2011 క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా భారత్ కప్ గెలిస్తే న్యూడ్ షో చేస్తానని ప్రకటించడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఆమెలో కెరీర్లో పైకి రావడానికి అవసరమైన సెన్సేషనలిజం, దూకుడూ పుష్కలంగా వున్నాయి. తన భర్త శాం షూట్ చేస్తుండగా అశ్లీల వీడియోస్ చేసింది. ఐతే అతను తనని హింసిస్తున్నాడని కేసు పెట్టి, అతన్ని దూరంగా వుంచి, తన స్వంత టీం ఏర్పాటు చేసుకొని వీడియోస్ చేసేది.

ఆమె నిన్న ఉదయం సెర్వికల్ కేన్సర్ తో మరణించిందన్న వార్త ఎప్పుడో మధ్యాహ్నం వచ్చింది. ఈ వార్త ఆమె ఇన్స్టాగ్రాం ఖాతాలో ఆమె టీం వారు ప్రకటించారట. నిజానికి సెర్వికల్ కేన్సర్ చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ వున్న ప్రమాదకర ప్రాణాంతక వ్యాధి. ఆమె నాలుగు రోజుల క్రితం వరకు కూడా హుషారుగానే కనిపించిందట. ఆమె ఏ హాస్పిటల్లో మరణించిందీ ఇప్పటివరకు తెలియదు. ఆమె బాడీని ఎవరూ చూడలేదు. ఒక్క ఇన్‌స్టాగ్రాం ప్రకటన తప్ప వేరే ఆధారం లేదు. ఆమె కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. ఆ ఒక్క ప్రకటన మొత్తం దేశాన్ని నమ్మించగలిగింది. ఆమె చావు కబురు వినగానే కంగనా రనౌత్ నుండి ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియచేశారు.
ప్రముఖుల మరణాల గురించి ఒక్కోసారి తప్పుడు వార్తలు వస్తుంటాయి. చాలాసార్లు అవి పొరపాటుగా వచ్చేవే అయుంటాయి. ఇవాళ కాకుంటే కొద్ది రోజుల తరువాతైనా అవి నిజమవుతుంటాయి. ఆమె మరణించి వుండకపోతే, కేవలం సెన్సేషన్ చేయడానికే నాటకం ఆడి వుంటే అది చాలా ఘోరమైన నేరంగా పరిగణించాల్సి వుంటుంది. సెన్సేషనలిజం ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటుంది. అంతేకాదు ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఒక సున్నితమైన విషయంతో పరాచికలాడటమే. ఈ వార్త ఎంతోమంది సెర్వికల్ కేన్సర్ బాధితులైన మహిళల్ని కలవరపెట్టే వుంటుంది.
పూనం పాండే మరణించి వుండకూడదని, ఆమె నాటకం ఆడే వుండాలని, అందుకు తగ్గ చర్య ఆమె మీద తీసుకోవాలని కోరుకుంటున్నా. లేదా ఆమె ఏదైనా దాడికి గురైందా లేదా అనే విషయాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం విచారించాలనుకుంటున్నా. ఒకవేళ ఆమె నిజంగా మరణించే వుంటే ఆమెకి, ఆమె కుటుంబానికి ముందుగానే క్షమాపణ చెబుతున్నా…
Poonam
అప్ డేట్ :: అనుమానించినట్టుగానే… పూనం బతికే ఉంది… ఇదంతా తూచ్ అట… సర్వికల్ కేన్సర్ మీద అవగాహన కోసం, అటెన్షన్ కోసం ఈ పనిచేసిందట… ఉత్త మెంటల్ కేసు…

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions