.
నాగ చైతన్య, సాయిపల్లవి నటిస్తున్న తండేల్ నుంచి ఓ పాట రిలీజ్ చేశారు నిర్మాతలు… దీనికీ శేఖర్ మాస్టరే కొరియోగ్రఫీ అని చదివి కాస్త ఆసక్తి కలిగింది…
పాట పేరు నమో నమ శివాయ… టైటిల్స్ చూస్తుంటే నవ్వొచ్చింది… నాగ చైతన్య అట ఇప్పుడు కొత్తగా యువసామ్రాట్… సాయిపల్లవికి ఏ బిరుదూ లేదు కదా… సింపుల్‌గా మన సాయిపల్లవి అని వేశారు… దేవిశ్రీ ప్రసాద్ సంగీతం…
Ads
ఓ సాదాసీదా ట్యూన్… ఏమో, డీఎస్పీ పని అయిపోయినట్టు అనిపిస్తోంది… తబలా దంచితే తాండవం అయిపోదు రాజా… జొన్నవిత్తుల సాహిత్యం అత్యంత సాదాసీదా… నిప్పుల కన్నుతో తప్పులు కాల్చెయ్ అనే ఒకటీ అరా మెరుపులు తప్ప…
ట్యూన్, కంటెంటే అలా ఉంటే… ఫాఫం సింగర్స్ అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఏం చేయగలరు..? ఏదో పాడేశారు… హరిప్రియ అంటే ఈమధ్య మ్యూజిక్ షోలలో కంటెస్టెంటుగా పాల్గొంటున్న ఆమేనా..? తెలియదు…
చెప్పాల్సింది శేఖర్ మాస్టర్ గురించి… గతంలో రాకేష్ అనే డాన్స్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడట… ఆ రాకేష్ మాస్టరే పిచ్చికూతలతో ప్రసిద్ధుడు… శేఖర్ కూడా ఈటీవీ రెగ్యులర్ ఆర్టిస్టు కమ్ జడ్జి… కులమో, ప్రాంతమో ఏం పనిచేసిందో గానీ అనతికాలంలోనే స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యాడు…
గుర్తున్నంతవరకూ అమ్మడూ కుమ్ముడూ టైపు వల్గర్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేస్తూ… ఇప్పుడు నంబర్ వన్ అట… ఆమధ్య రవితేజ సినిమాలో హీరోయిన్ పిరుదుల మీద మృదంగవాద్యం స్టెప్స్ వేయించాడు… వల్డర్…
తరువాత పీలింగ్స్ అంటూ పుష్పలో స్టెప్పులు… వల్గర్… ఇప్పుడు డాకూ మహారాజ్ సినిమాలో ఇంకా నీచం… బాలయ్యతో కూడా సేమ్ రవితేజ స్టెప్పుల్లాగే బొడ్డు కింద చేయిపెట్టి డ్రెస్సును పట్టుకుని తనవైపు లాక్కునే స్టెప్పులు, ఆమె పిరుదుల మీద చేతులతో బాదే స్టెప్పులు… వల్గర్ శేఖర్…
నిజానికి తనకు సిగ్గూశరం లేదు అనలేం… ఆ స్టెప్పులకు ఈ సోకాల్డ్ హీరోలు ఎందుకు అంగీకరిస్తున్నారు..? రవితేజ, బన్నీలను వదిలేయండి… జస్ట్, యాక్టర్స్… కానీ బాలయ్యకు ఏమైంది..? తన స్టేటస్ ఏమిటి..? ఈ పిచ్చి స్టెప్పులేమిటి..? ఇదీ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో…
సరే, ఈ తండేల్ దగ్గరికొద్దాం… తనకు వల్గర్ స్టెప్పులు కంపోజ్ చేయడం తప్ప కాస్త మెరుగైన, పద్ధతైన స్టెప్పులు చేతకావు అని తేలిపోయింది ఈ పాటతో… తాండవం స్టెప్పులు అంటే మాటలు కాదు, దానికి కాస్త మెరిట్ కావాలోయ్ శేఖరూ…
అసలే సాయిపల్లవి, ఎంత సాధన చేసైనా రక్తికట్టించగలదు… కానీ పక్కన చైతూ… తనకు డాన్సులో అంత ఈజ్ ఉండదు… వారిద్దరికీ జత, శృతి ఎలా..? అందుకే లైట్ స్టెప్పులు కంపోజ్ చేశాడు శేఖర్… ఫాఫం చైతూ కష్టపడ్డాడు గానీ సాయిపల్లవి పక్కన కష్టం…
నిజానికి తాండవం అనే పేరే గానీ… ఆ జోష్ లేదు పాటలో… ట్యూన్‌లో, కంటెంటులో… దానికి తోడు శేఖర్ పేలవమైన కొరియోగ్రఫీ… పైగా నాగచైతన్య… ఫాఫం సాయిపల్లవి…!! తను కూడా ఏదో చేసిందంటే చేసింది… అంతే…!! జనమంతా మెచ్చే కొరియోగ్రఫీ అంటే ఈటీవీ ఢీలో బూతు జోకులకు హైపర్ ఆదితో కలిసి పగలబడి నవ్వడం కాదోయ్ శేఖరూ..!!
Share this Article