Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక రష్మిక, ఒక పీవీ సింధు – ఈ మట్టికి కొత్త కోడళ్లు – అవమానించకండి

October 19, 2026 by M S R

.

పీవీ సింధు… హైదరాబాదీ సంస్కృతిని గౌరవిస్తుంది… ఆమె బోనం ఎత్తుతుంది… బతుకమ్మ ఆడుతుంది… వెక్కిరించకండి… దాండియాలు, గార్బాలు మనపై రుద్దబడుతున్న ఈ రోజుల్లో ఆమె తన అత్తింటి సంస్కృతిని అభిమానంతో, పద్ధతిగా తలకెత్తుకుంది… గౌరవించండి…
.
ఆమె తన ఇన్‌స్టాలో పెట్టుకున్న ఫోటోల్లో ఒక దాంట్లో వెండి బతుకమ్మ ఉంది… అంతే, ఎవడో ట్రోలర్ మీ పైత్యాన్ని మామీద రుద్దకండి అని కూశాడు… ఆమె ఎంత హుందాగా, ఎంత సంస్కారంతో జవాబు ఇచ్చిందో తెలుసా..?
.

  • మా కుటుంబంలో మేం సంప్రదాయబద్ధంగా బతుకమ్మను జరుపుకోం, కాబట్టి ఇదే నాకు మొట్టమొదటిది! నేను తెలంగాణ నడిబొడ్డున ఉన్న కరీంనగర్ కుటుంబంలోకి పెళ్లి ద్వారా అడుగుపెట్టాను… ఫోటోలో కనిపిస్తున్న ఆ పెద్ద పూల బతుకమ్మను చూశారా? దాన్ని అలంకరించడానికే నేను దాదాపు రోజంతా గడిపాను … దానితోనే మేము వేడుక చేసుకున్నాం! తన హృదయానికి ఎంతో దగ్గరైన ఈ సంప్రదాయంలోకి నన్ను సాదరంగా ఆహ్వానించడానికి మా అత్తగారు ఇచ్చిన మార్గమే ఆ వెండి బతుకమ్మ… ❤️

pvsindhu
.
వెండి వస్తువులు, కళాకృతుల తయారీకి కరీంనగర్ ఫేమస్… పైగా తొలి బతుకమ్మకు కొత్తగా పెళ్లయిన కూతురికి వెండి బతుకమ్మ వాయినం ఇవ్వడం తెలంగాణ సంస్కృతిలో భాగమే…

Ads

https://x.com/Pvsindhu1/status/2111836292212563980

సద్దుల బతుకమ్మ రోజున రష్మిక మందన్నా పెద్ద బతుకమ్మను ఎత్తుకుని వచ్చింది… నలుగురితో కలిసి అదే రిథమ్‌తో పదం కలిపింది, పాదం కలిపింది… తెలంగాణ యువత నన్ను వదినా అని పిలుస్తోంది, పిల్లలు అత్తా అంటున్నారు… ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటోంది… హంబుల్…

rashmika

తెలంగాణ సంస్కృతిలోకి సంబరంగా వచ్చే ఒక రష్మిక, ఒక పీవీ సింధులను వెక్కిరిస్తే… మనల్ని మనం, మన కోడళ్లను మనం అవమానించుకున్నట్టే…!! తెలంగాణ రెడ్డి కుటుంబంలో అడుగుపెట్టిన ఓ తెలంగాణేతరురాలు బతుకమ్మ ముందు ఏక్‌దోతీన్ అనే ఓ పాత హిందీ వెకిలి సినిమా పాట పాడుతున్న సీన్ చూసి… ఒక రష్మికను, ఒక పీవీసింధును పోల్చుకొండి..!!

https://www.facebook.com/reel/1128368139717538

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక రష్మిక, ఒక పీవీ సింధు – ఈ మట్టికి కొత్త కోడళ్లు – అవమానించకండి
  • ఆ ముళ్ళదారి తెలియకుండా- ఆమె పాదాల మచ్చలపై తీర్పులొద్దు!
  • నాడు అల్లు అర్జున్ అరెస్టు – మరి ఎంవీఎస్‌ఆర్ దుర్ఘటనపై ..?!
  • ఫ్రాన్స్ బొద్దింకలు తగులబెట్టేస్తున్నాయి… ఇండియా బహుపరాక్…
  • జియో ఐపీఓ పూర్తవగానే… మస్క్ ‘స్టార్‌లింక్’కు గ్రీన్ సిగ్నల్?
  • రిచ్ – రిచర్ – రిచెస్ట్ ! బీఆర్ఎస్ ఖజానాకు అడ్డగోలు ధనకళ !!
  • తప్పుడు కేసుతో నష్టం విలువ ఎంత..? మరి న్యాయం మాటేమిటి..?
  • జగన్ బొద్దింకల్ని ముద్దాడటం వెనుక ఇంత పే-ద్ద కథుందా..?!
  • ఇడిసిపెట్టలేదు- ఒడిసిపట్టలేదు… హరీష్- కేటీయార్ క్షుద్ర రాజకీయం !
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions