.
రాను రాను రాహుల్ గాంధీ వ్యవహార ధోరణి కాంగ్రెస్ పార్టీకి, ఇండి కూటమికి కౌంటర్ ప్రొడక్ట్ అవుతూ… కొన్నిసార్లు పరువు తీసుకునే విధంగా తయారవుతోంది… నిన్న ఇండికూటమి ఎంపీలు పోలోమంటూ రాష్ట్రపతి దగ్గరకు బయల్దేరారు… తప్పులేదు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద ఓ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి, అన్ని మార్గాల్లోనూ ప్రచారం కోరుకుంటున్నారు…
కొందరు ఎంపీలను కలవడానికి అనుమతి ఇచ్చారు… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలిసింది, వాళ్లు చెప్పింది విన్నది… నేను పరిశీలిస్తాను, వివరాలు తెప్పించుకుంటాను అని చెప్పింది… చాలా సహజమైన స్పందన అది… నో, నో, మీరు చెప్పేదంతా ట్రాష్, నేను ఖండిస్తున్నాను, డోంటాక్ నాన్సెన్స్, రబ్బిష్ అనలేదు కదా…
Ads
ఆమె బీజేపీ నాయకురాలు కాదు ఇక్కడ… రాష్ట్రపతి… ఎంపీలు తనను కలిసి ఏదైనా ఫిర్యాదు చేసినా, ఏదైనా విన్నవించినా… సరే, నేను పరిశీలిస్తాను అనే చెబుతారు… ఆమె ప్లేసులో ఎవరున్నా, అంతే… అది మర్యాద, అది విజ్ఞత, అది పద్ధతి…
కానీ రాహుల్ గాంధీ బయటికి వచ్చి ఏం చెప్పాడు..? ‘‘వోట్ల చోరీని రాష్ట్రపతి అంగీకరించారు, మేం చెప్పినవి ఖండించలేదు, ప్రశ్నించలేదు, అంటే అంగీకరించినట్టే, ఆమె స్పందన మాకు షాక్ కలిగించింది… అన్ని అంశాలనూ పరిశీలించి, విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చింది… రాష్ట్రపతి అధికారాల్ని ఉపయోగించి వెంటనే జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని అడిగాం… సర్ ప్రక్రియ ఆపేయాలన్నాం… రెండేళ్లుగా జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్ని రద్దు చేయమన్నాం… పేపర్ బ్యాలెట్లు పెట్టేయాలని చెప్పాం, ఎన్నికల కమిషనర్లకు ఇమ్యూనిటీ ఇచ్చే చట్టం రద్దు చేయాలని కోరాం… ఆమె పరిశీలిస్తానని చెప్పింది’’
ఆమె ఎందుకు ఖండిస్తుంది, ఎందుకు ప్రశ్నిస్తుంది, సింపుల్‌గా నేను చూస్తాను అని చెబుతుంది… దానికి ఆమె వీళ్లు చెప్పినవన్నీ అంగీకరించినట్టేనా..? పాపం, ఇండి కూటమి..!! loosing common sense also… పైగా వీళ్లకు షాక్ కలిగించిందట… అసలు రాష్ట్రపతికి స్వయంగా సీఈసీని తొలగించే అధికారముందా..? లేదు… పార్లమెంటు ఈమేరకు తీర్మానించి పంపితే తప్ప ఆమె స్వయంగా జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించలేదు…
ఈమాత్రం తెలియదా ఇండి కూటమి నేతలకు..? సర్ ప్రక్రియను కూడా వెంటనే ఆపేయాలని కూడా ఆమె ఆదేశించలేదు… రెండేళ్ల అసెంబ్లీ ఎన్నికల్ని రద్దు చేయడం అసాధ్యం… పేపర్ బ్యాలెట్లు ఆమె అధికార పరిధి కాదు… ఇమ్యూనిటీ ఇచ్చే చట్టాన్ని కూడా ఆమె స్వయంగా రద్దు చేయలేదు… కనీసం ఇవన్నీ తెలియకుండానే మీడియా ముందు ఏదేదో మాట్లాడి పరువు తీసుకోవడం తప్ప మరొకటి కాదు ఇదంతా…! పాపం, ఇండి కూటమి..!!
Share this Article