‘‘ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి విమర్శ ఎదుర్కొంటున్నారు. రామోజీరావుకు అర్హత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఆయన సంస్మరణ సభ ఏర్పాటు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్ను మూసినప్పుడు ఆయన వల్ల ప్రయోజనం పొందినవాళ్లు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవాళ్లు బాధపడతారు. గతించిన వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం కోసం సంస్మరణ సభలు పెట్టుకుంటారు.
నాయకుడైతే ఆయనను అభిమానించే ప్రజలు స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో రామోజీరావు సంస్మరణ సభను ప్రభుత్వపరంగా కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారితో కమిటీ ఏర్పాటు చేసి నిర్వహింపజేసి ఉంటే విమర్శలకు అవకాశం ఉండేది కాదు…..’’
Ads
… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆ క్యాంపు మౌత్ పీసే అయినా సరే, రామోజీరావుకు అధికారిక సంస్మరణ షోల మీద తన అభిప్రాయాన్ని కాస్త సుతిమెత్తగానైనా వ్యతిరేకించాడు… అంతకుమించి వెళ్లడానికి తన సామాజికవర్గం, తన శిబిరం అంగీకరించవు… ఐనా సరే, ఓ పాత్రికేయడి పాత్ర పోషించాడు… గుడ్…
నిజమే కదా… రామోజీరావు ఎవరు.? పద్మవిభూషణుడా..? సో వాట్… చరిత్రలో చాలామందికి ఇచ్చారు… తెలుగువాడనా..? తెలుగువాళ్లలో కూడా బోలెడుమందికి ఇచ్చారు… ఐనా అదేం అర్హత..? మీడియా మొఘల్ అనా..? తెలుగు గర్వపతాక అనా..? అవేవీ ప్రభుత్వ ధనం నుంచి ఖర్చు పెట్టి సంస్మరణలు స్వాహాలు, కోట్ల యాడ్స్ తగలేతలు చేయగల అర్హతలు కావు కదా… అవన్నీ ఆ క్యాంపు పెట్టుకున్న పేర్లు…
ఓ ముఖ్యమంత్రిగా గాకుండా రామోజీరావు క్యాంపు కార్యకర్తగా బిహేవ్ చేస్తే ఎలాగోయ్ చంద్రబాబూ అని గట్టిగా అనలేక, తమలపాకుతో కొట్టాడు రాధాకృష్ణ… సరే, సాక్షి అయితే తన ఎడిటోరియల్ ఫీచర్‌లో రామోజీరావును మళ్లీ ఏకిపారేసింది… మార్గదర్శి అక్రమాలు, ఫిలిమ్ సిటీ అక్రమాలు గట్రా ఏకరువు పెట్టింది… అది సహజమే… అవకాశం దొరికితే రామోజీని లిఫ్ట్ చేసి జైల్లో పారేయాలనుకున్న జగన్ అలాగే రాస్తాడు కదా…
ఇక్కడ ఒకే అభ్యంతరం… రామోజీరావు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు ట్రిప్లెట్స్… ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమను ప్రదర్శించాలీ అనుకుంటే తన హెరిటేజ్ డబ్బులతో, ఇంకా మరేమైనా ఆదాయ ధనంతో ఖర్చు పెట్టి సంస్మరణలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు… కానీ ఎటొచ్చీ ఖజానా నుంచి డబ్బు తగలేయడమే అభ్యంతరకరం… చివరికి అదే క్యాంపుకి చెందిన ఆ రాధాకృష్ణకు కూడా..!!
Share this Article