Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మాట జారిన రానా… బేషరతు క్షమాపణ… స్వీకరించని సోనమ్…

August 16, 2023 by M S R

నోరు జారాక… సోషల్ మీడియా భాషలో అయితే ట్వీట్ పోస్టాక… ఎంతగా వెనక్కి తీసుకుందామని ప్రయత్నించినా డ్యామేజీ పెద్దగా కంట్రోల్ కాదు… అందుకే నోటి దూల మంచిది కాదు అంటారు పెద్దలు… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో అస్సలు పనికిరాదు… ఇండస్ట్రీలో సీనియర్ దగ్గుబాటి రానా, పైగా పెద్ద సినిమా కుటుంబం తనది… తనకు కూడా ఈ విషయం తెలుసు… ఐనా మాట తూలాడు… నెటిజన్లతో పిచ్చ తిట్లు, అనగా ట్రోలింగ్ తిన్నాడు…

అదేదో హిందీ సినిమా మీద కామెంట్ చేస్తూ ‘ఆమె అనవసరంగా హీరో దుల్కర్ సల్మాన్ టైమ్ వేస్ట్ చేసింది… బొత్తిగా డిసిప్లిన్ లేదు’ అన్నట్టుగా ఏదో తూలాడు… ఆ విమర్శ కాస్తా బాలీవుడ్‌లో ఓ డిబేట్ పాయింటైంది… బాహుబలి సినిమాతో రానా హిందీలో కూడా పరిచయం అయ్యాడు కదా… ఈమధ్య సోనం కపూర్ దుల్కర్‌తో ఏదో సినిమాలో యాక్ట్ చేసింది లెండి… సో, రానా వ్యాఖ్య ఆమెను ఉద్దేశించే అనేది అందరికీ అర్థమైంది… ఇక బాలీవుడ్ ఫ్యాన్స్ రానాతో ఆడుకోవడం మొదలెట్టారు…

sonam

Ads

ఒక్కసారిగా తల దిమ్మెక్కిన రానా ఆ కపూర్ ఫ్యామిలీతో గొడవలు ఎందుకులే అనుకుని, కళ్లు తెరుచుకుని వెంటనే ఓ డ్యామేజ్ కంట్రోల్ ట్వీట్ కొట్టాడు… అబ్బెబ్బే, నా ఉద్దేశం అదికాదు, ఐనా సరే సారీ చెబుతున్నాను, అండర్‌స్టాండ్ చేసుకుని మిస్- అండర్ స్టాండ్‌కు తెరవేయగలరు అని ఆ ట్వీట్ సారాంశం… కానీ సోనమ్ అంత తేలికగా క్షమించే రకం కాదు కదా.,.

తనను రానా ఏదో అన్నట్టు, దానికి తను చింతిస్తున్నట్టుగా ఏమీ ప్రస్తావించకుండా… ఆమె US ప్రథమ మహిళ ఎలియనోర్ రూజ్‌వెల్ట్ రాసిన కోట్‌ను పోస్ట్ చేసింది. ‘‘నేను కొంతమంది గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను… ముఖ్యంగా ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారి గురించి… సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు వ్యక్తుల గురించే చర్చిస్తారు. సగటు మనస్తత్వం ఉన్న వ్యక్తులు సంఘటనల గురించి మాట్లాడతారు… గొప్ప మనస్సులు ఆలోచనలను చర్చిస్తాయి…” అని రఫ్‌గా ఆ కోట్ సారాంశం… ఈ కొటేషన్ ఎవరిని ఉద్దేశించే చెప్పకపోయినా సరే, టాలీవుడ్ హీరో రానాను ఉద్దేశించిన కౌంటర్‌లాగే ఉంది… రానాకు పగిలిపోయింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions