గతం వేరు… పెద్దగా చదువూసంధ్య ఉండేది కాదు తారలకు..! ఇప్పుడు సినిమాల్లోకి, టీవీల్లోకి… రంగుల ప్రపంచంలోకి బాగా చదువుకున్న మహిళలు కూడా ప్రవేశిస్తున్నారు… సాయిపల్లవి వంటి ఒరిజినల్ డాక్టర్లు కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు అంటే పెద్దగా ఆశ్చర్యపోయే రోజులేమీ కావు ఇది… కళ్యాణం కమనీయం సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రియ భవానీశంకర్ బీటెక్ చేసింది, తరువాత మీడియా ఫీల్డులో పనిచేస్తూనే (న్యూస్ రీడర్) ఎంబీఏ పూర్తి చేసింది…
ఈ చెన్నై తార న్యూస్ రీడింగ్ నుంచి తమిళ సీరియళ్లలోకి ఎంట్రీ ఇచ్చి… 2017లో నేరుగా ఓ తమిళ సినిమా మెయదా మాన్‌లో లీడ్ రోల్ సంపాదించింది… మొదట్లో కాస్త కిందామీద పడినా తరువాత నిలదొక్కుకుంది… 2020 నుంచి 2022… కరోనా పీరియడ్‌లో సైతం ఆమె 9 సినిమాలు చేయడం విశేషం… ఒక్కొక్క సినిమాయే చాలామంది తారలకు కష్టంగా ఉన్న స్థితిలో ఈమెకు ఇన్ని చాన్సులు రావడం గొప్పే…
Ads
అసలు అది కాదు… ఇప్పుడు ఆమె చేతిలో ఏడు సినిమాలున్నయ్… అందులో ఒకటి సత్యదేవ్ నటించిన తెలుగు సినిమా… కళ్యాణం కమనీయం సినిమాలో కూడా ఏదో స్కిన్ షో చేసి, నాలుగు పిచ్చి గెంతులు వేసి వెళ్లిపోయే కేరక్టరేమీ కాదు… హీరోకు దీటైన పాత్ర… గొప్పగా కాదు గానీ, వంక పెట్టేలా నాసిరకం నటన ఏమీ కాదు… చేతిలో ఇన్ని అవకాశాలు ఉండటం కూడా తక్కువ విశేషమేమీ కాదు… ఇక వాటితో ఎలా నిలబడుతుంది అనేది చూడాలి…
నాగచైతన్య సినిమా ధూతలో కూడా ఉన్నాననీ, సత్యదేవ్ సినిమా చేస్తున్నాననీ, మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నాయనీ, ఫీల్ గుడ్ మూవీలు చేయడానికి ఇష్టపడతాననీ అంటున్నదామె… గుడ్… ఏమేరకు తెలుగు సినిమా ఆమెను ఎంకరేజ్ చేస్తుందో చూడాలి… అయితే ఆమెకు తమిళంలో ఇప్ప్పటికీ గుక్కతిప్పుకోనివ్వనన్ని చాన్సులు ముంచెత్తుతున్నాయి… కన్నడం, మలయాళం పేరెత్తితే ఇక్కడే ఊపిరాడనంత వర్క్ ఉంది అని నవ్వేస్తున్నదామె… అన్నీ లీడ్ రోల్స్ మాత్రమే కావాలా..? నో, ప్రాధాన్యముంటే చాలు అంటోంది… గుడ్… గో ఎహెడ్ ప్రియా..!!
Share this Article