.
అవును, ఓ మిత్రుడు చెప్పినట్టు… ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా రేట్ల పెంపుకు గనుక రేవంత్ రెడ్డి వోకే అంటే… తను వ్యక్తిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా భ్రష్టుపడతాడు… నిజం…
అప్పుడిక కేటీఆర్‌కూ తనకూ తేడా ఏమున్నట్టు..? పైగా బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించిన అల్లు అర్జున్ మీద కొరడా ఝలిపించిన రేవంత్ రెడ్డి… చెరువులో ఫంక్షన్ హాల్ కట్టిన నాగార్జున కోట్ల ఫంక్షన్ హాల్ కూల్చేసిన రేవంత్ రెడ్డి… మోహన్‌బాబు మీద కాస్త ప్రేమ చూపిస్తున్నా సరే కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి… తనకూ ఏపీ సర్కారుకూ తేడా ఏమున్నట్టు ఇక..?
Ads
బన్నీ దిక్కుమాలిన ప్రవర్తనతో వారం పది రోజులు పెద్ద సంచలనం… అక్కడికి ఆ పుష్ప2 అనబడే ఊరమాస్, నీచాభిరుచి కలిగిన సినిమా ఏదో దేశాన్ని ఉద్దరించినట్టు… బన్నీ ఓ అద్భుతమైన నటుడు అన్నట్టు…. అరెస్టు కాగానే మొత్తం ఇండస్ట్రీ వరుసలు కట్టి మరీ పరామర్శించాయి… నిందితుడినే బాధితుడిని చేసి…
ఆ కుటిల ఇండస్ట్రీ పెద్దల మెంటాలిటీలను బ్రేక్ చేస్తూ… నో బెనిఫిట్ షోస్, నో టికెట్ రేట్ హైక్స్, నో అడిషనల్ షోస్, నో నాన్సెన్స్ ప్రిరిలీజ్ గ్యాదరింగ్స్ అన్నారు… సరే, ఏం బేరం కుదిరిందో గానీ బన్నీ వివాదం చల్లబడింది… రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీలో సహజమే కదా… మనీ మేక్ ఎనీ థింగ్…
కానీ ఇప్పుడు సాక్షాత్తూ ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కల్యాణ్ అన్న కొడుకు హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజు… సినిమా బంధుత్వమే ప్రబలంగా ఉన్న చంద్రబాబు సీఎం… ఏం ఆగుతుంది..?
ప్రిరిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే.,.. అదేదో జాతిని ఉద్దరించే కార్యక్రమంలాగా ఓ మంత్రి వెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించాడు… షేమ్ విత్ చంద్రబాబు గవర్నమెంట్… ఇన్నేళ్ల తన రాజకీయ జీవితానికి ఓ మకిలి, చిన్నదే కావచ్చుగాక మరక మరకే…
అదీ ట్రెయిలర్ చూస్తే ఓ దిక్కుమాలిన మాస్ కమర్షియల్ సినిమా… ఇప్పుడు అడ్డగోలుగా షోలను పెంచడానికి, టికెట్ రేట్లను పెంచడానికి పర్మిషన్ ఇచ్చేశారు ఏపీలో… సో, ఇప్పుడు అందరి దృష్టీ రేవంత్ రెడ్డిపై పడింది…
ఎస్, ఖచ్చితంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, అడ్డగోలు షోల సంఖ్య పెంపుకై ఆ నిర్మాత ఎవరో గానీ అడుగుతాడు… అలవాటైనట్టుగానే ఆఫర్లు ఇస్తాడు… కానీ రేవంత్ ఒప్పుకుంటాడా..? ఒప్పుకుంటే రేవంత్ ఇమేజ్ దారుణంగా భ్రష్టుపట్టిపోతుంది ఖాయం…
అసలే ఇది దిల్ రాజు అలియాస్ వెంకటరమణా‘రెడ్డి’ సాబ్ సినిమా… తనేమో తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్… రేవంత్ ‘రెడ్డి’కి సన్నిహితుడు… సో, ఏం జరగబోతోంది..?
నీకొక పాలసీ లేదు, స్థిరత్వం లేదు… పదే పదే ఆ సంధ్య తొక్కిసలాట బాపతు రేవతుల శవాల మీద పేలాల ఏరుకుంటారా అనే విమర్శలు వస్తాయి… ఆల్రెడీ సెటిల్మెంట్ బాపతు ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి కూడా… అఫ్‌కోర్స్, సినిమా వాళ్లతో సాన్నిహిత్యం ఎట్సెట్రా ఉన్న కేటీఆర్ ఏమీ మాట్లాడకపోవచ్చుగాక… కానీ జనం చూస్తుంటారు కదా…
స్థిరంగా నిలబడితే రేవంత్ రెడ్డి స్వయంగా ఓ స్టార్ హీరో… తనే ఓ గేమ్ చేంజర్… కాకపోతే ఏ చంద్రబాబు చెప్పాడనో, పవన్ కల్యాణ్ అడిగాడనో గేమ్ చేంజర్ ఎదుట మోకరిల్లితే, సాగిలబడితే…. పెద్ద జీరో..!!
Share this Article