Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భూమి, నీరు, ఆకాశం… నూరేళ్ల ఈ జవానుది ఓ డిఫరెంట్ స్టోరీ…

December 12, 2020 by M S R

సాధారణంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఇతరత్రా ముఖ్య హోదాల్లో ఉన్నవాళ్లు… ప్రొటోకాల్ ప్రకారం, మర్యాద కోసం కొందరికి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు… అవి పెద్దగా ఆసక్తికరం ఏమీ కావు… పత్రికలు కూడా మర్యాదకు ప్రచురించడమే తప్ప వాటికేమీ రీడబులిటీ ఉండదు…

కానీ పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఓ వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా చెప్పిన శుభాకాంక్షలు మాత్రం ఇంట్రస్టింగు… ఇట్టే కనెక్టయ్యేలా ఉన్నాయి ఆ గ్రీటింగ్స్… ఆయన శుభాకాంక్షలు తెలపబడిన వ్యక్తి పేరు ప్రీతిపాల్ సింగ్ గిల్… కల్నల్… ఆయన వయస్సు 100 ఏళ్లు… వందేళ్లు బతకడం కాదు… టైగర్… విశేషం ఏమిటంటే..? ఆయన మన త్రివిధ దళాల్లోనూ పనిచేశాడు… బహుశా ఆ అవకాశం పొందిన ఏకైక జవాన్ కావచ్చు…

సాధారణంగా ఎవరైనా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీలలో ఎందులో చేరినా ఇక దానికే పరిమితం… కానీ ఈయన గారు మూడు దళాల్లోనూ పనిచేశాడు… అదీ విశేషం… అప్పుడెప్పుడో 1970లోనే రిటైర్ అయ్యాడు… చూశారుగా… వందేళ్లు నిండాయి… ఎప్పుడూ గెలుపు మనదే అన్నట్టుగా ఎలా బొటనవేలు చూపిస్తున్నాడో… గ్రేట్…


Congratulate Col. Prithipal Singh Gill who turns 100 today. He bears the unique distinction of having served in all the three Armed Forces. Sir, wish you many more years of good health and may you continue to always inspire all of us. @adgpi pic.twitter.com/jmIqeXdLB7

— Capt.Amarinder Singh (@capt_amarinder) December 11, 2020


1942… రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌తో ఈయన తన సైనిక జీవితానికి శ్రీకారం చుట్టాడు… మిలిటరీ (ఆర్మీ) చేరడం ఏమిట్రా అంటూ ఆయన ఫ్యామిలీ మొదట అంగీకరించలేదు… దాంతో వాయుసేన వైపు మొగ్గాడు… కరాచీలో పైలట్ ఆఫీసర్ తను… హోవర్డ్ యుద్ధవిమానాల్ని కూడా నడిపాడు… ఈ ఫీట్లు గట్రా చూసి ఆయన తండ్రికి భయమేసింది… కొడుకును కోల్పోతానేమో అనే భయం పట్టుకుంది… వెళ్లి బలవంతంగా ఎయిర్ ఫోర్స్ నుంచి వాపస్ తీసుకొచ్చాడు… జస్ట్, ఒక ఏడాది మాత్రమే తను అందులో పనిచేసింది…

ఏదో ఒక డిఫెన్స్ సర్వీసులో పనిచేయాలి… అంతే… అదే పట్టుదల… ఈసారి వెళ్లి నేవీలో చేరాడు తను… అప్పటికే 23 ఏళ్లు… 1943 నుంచి 1948 దాకా చేశాడు… అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది… ఐఎన్ఎస్ తీర్ మీద డ్యూటీ చేశాడు… ఒకవైపు నేవీలో పనిచేస్తూనే ఆర్టిలరీ స్కూల్‌లో లాంగ్ గన్నరీ స్టాఫ్ కోర్స్‌కు అర్హత సాధించాడు… కోర్సు పూర్తిచేశాడు…

ఇంకేముంది..? 1951లో గన్నర్‌గా ఆర్మీలో చేరాడు… మొదట తన ఫ్యామిలీ ఏ ఆర్మీలో పనిచేయవద్దంటూ పోరిందో, అదే ఆర్మీలో చేరాడు… 1965 పాకిస్థాన్ వార్‌లో పాల్గొన్నాడు… తరువాత మణిపూర్ అసోం రైఫిల్స్ కమాండర్‌గా ఉన్నప్పుడు పదవీ విరమణ… 1970లో… డిఫరెంటు స్టోరీ… ‘ఒక గన్నర్‌కు తుపాకీ ఎంతో పవిత్రం… ప్రాణాలు పోతే తప్ప గన్ను వదిలేది లేదనేది సూత్రం, స్ఫూర్తి…’ అంటాడు ఏదో ఇంటర్వ్యూలో తను… ఈరోజుకూ ఆరోగ్యంగా ఉన్నాడు… అవసరమైతే యుద్ధానికి వస్తావా తాతా అంటే… మీసం తిప్పుతూ, పదవోయ్, ఆలస్యం దేనికి అంటాడు నవ్వుతూ… మరింత ఆయుష్షు పోసుకుని ఇలాగే బతుకు తాతా… నువ్వు ఇండియన్ ఆర్మీ గన్నుతో సమానం… దాని గర్వం, దాని పొగరు నీ మీసానికీ ఉన్నయ్…

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions