‘డర్టీ కేరక్టర్’… నటుడు సిద్ధార్థ్‌ను ఉద్దేశించి ఈ మాట అనడానికి పెద్దగా సందేహించనక్కర్లేదేమో… తను సైనా నెహ్వాల్ మీద వాడిన నీచమైన పదాలు చదివితే వచ్చే కోపం ఇది… నిజానికి ఇది మొదటిసారేమీ కాదు, తనకు ఈ ప్రేలాపనలు, బూతులు, కూతలు బాగా అలవాటైపోయాయి… సైనా ఒక దశలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్… పద్మభూషణ్… 30 ఏళ్ల వయస్సులోపే సాధించిన విజయాలు బోలెడు… మరి సిద్ధార్థ్..? ఆమెను ఉద్దేశించి ‘‘సటల్ కాక్’’ ఛాంపియన్ అని ట్వీట్టాడు… అదీ తన సంస్కారం స్థాయి… తన రేంజ్… (కాక్ అని దేన్ని సంబోధించడానికి వాడుతుంటారో ఇంగ్లిష్ తెలిసిన మిత్రులకు ఎరుకే…)
మరి ఇలాంటి థర్డ్ గ్రేడ్ భాషలో ట్వీట్లు చేయడానికి సిగ్గూశరం ఏమీ లేవా అని మీరడక్కండి… తన డిక్షనరీలో అలాంటి పదాలేమీ లేవు… ఉండవు… నిజానికి సమంత తనను సకాలంలో వదిలించుకుని మంచి పని చేసింది… (ఆమె ఫస్ట్ లవర్)… లేకపోతే ఈ సంస్కారి భాషకు, ప్రవర్తనకు, మానసిక వైకల్యానికి పిచ్చి లేచి పోయేదేమో… 2003లో మేఘన అని మరో అమ్మాయిని చేసుకున్నాడు, ఆమె కొన్నాళ్లకే భరించలేక, చెప్పాపెట్టకుండా జంపో జంపు… అదీ సిద్ధార్థ్ జీవితం… నిజానికి ఈ వెకిలి, చిల్లర ట్వీట్లు, పోస్టులు తనకు కొత్తేమీ కాదు… అంతెందుకు, నాగచైతన్య, సమంత విడిపోయినప్పుడు కూడా సమంతను పరోక్షంగా తిట్టిపోస్తూ ‘‘మోసగాళ్లు ఎప్పుడూ బాగుపడరని చిన్నప్పుడే మా టీచర్ చెప్పింది’’ అని కూశాడు…
ఇంతకీ సైనా నెహ్వాల్‌ను ఎందుకు ఈ వెగటు భాషలో ట్విట్టాడంటే… ఆమె పంజాబ్‌లో మోడీ సెక్యూరిటీ బ్రీచ్ గురించి ఏదో ట్వీట్ చేస్తూ, ఒక ప్రధానికి అలా జరగడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొంది… సిద్ధార్థ్ మోడీ వీరవ్యతిరేకి… సైనా ట్వీట్‌తో ఎక్కడో కాలింది… దాంతో ఈ డిగ్రేడ్ భాష వాడాడు… పైగా జాతీయ మహిళ కమిషన్ తన మీద కేసు పెట్టాలని నిర్ణయించింది… అసలు ఇలాంటి పిచ్చోడి ఖాతాను ఎందుకు బ్లాక్ చేయడం లేదని ట్విట్టర్‌ను ఆక్షేపించింది ఆ కమిషన్ చైర్ పర్సన్… నెటిజనం కూడా థూ అని ఛీత్కరించారు… పైగా దాన్ని సమర్థించుకుంటూ ‘కాక్ అండ్ బుల్’ పదాలకు అర్థాలు తెలియనివాళ్లే నన్ను తప్పుపడుతున్నారు అని దిక్కుమాలిన సమర్థనకు దిగాడు…
Ads
అంతకుముందు టైమ్స్ నవ్ యాంకర్ నవీకా కుమార్ ఏదో ట్వీట్ చేస్తే… ఆమెను స్టూల్ కిట్, దుర్వాసనను పెంచుతోంది అని తిట్టిపోశాడు… (తెలుగులో అర్థాలు చెప్పడానికి కూడా ఏవగింపుగా ఉంది)… అదీ సిద్ధార్థ్ భాష తీరు… అంతేకాదు, అదే మోడీ సెక్యూరిటీ బ్రీచ్ మీద తను ఓ ట్వీట్ చేస్తూ… పంజాబ్ సీఎం చన్నీ పేరును కూడా లాగి… చాయ్ వడబోతకు చన్నీ (జాలీ) ఉంది, కానీ చాయ్‌వాలాను (మోడీ) వడగట్టేందుకు ఎవరు అని ఇంకేదో రాశాడు, కూశాడు… (మోడీని వ్యతిరేకించవద్దని ఎవరూ అనరు, తన రాజకీయ అభిప్రాయాల్ని వ్యక్తీకరించకూడదు అనడం లేదు… కానీ వాడే భాష, విమర్శను వ్యక్తీకరించే తీరు ప్రధానం… ప్రత్యేకించి స్త్రీలను ఉద్దేశించి ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లను ఏమనాలి..? పైగా ఇలాంటోళ్లు తమ సినిమాల్లో బొచ్చెడు నీతులు చెబుతారు…)
అదే సెక్యూరిటీ బ్రీచ్ మీద వ్యాఖ్యలు చేస్తూ పెయిడ్ యాక్టర్స్‌తో మోడీని ఆడిన డ్రామా అన్నట్టుగా ట్విట్టాడు… సరే, వోకే… అరెరె, రంగనా (కంగనా) తన జెడ్ సెక్యూరిటీ కవర్‌తో వెంటనే మోడీని రక్షించడానికి రాలేదేమిటో అని వెక్కిరిస్తూ మరో ట్వీట్ పెట్టాడు… కంగనా బీజేపీ మనిషి అని సిద్ధార్థ్ మంట… ఒక ప్రధాని సెక్యూరిటీ బ్రీచ్ విమర్శల్లోకి కంగనాను లాగడం ఏమిటి..? సో, ఎప్పుడూ స్త్రీల మీద ఏవో వెకిలికూతలు అలవాటయ్యాయి… తనను మాత్రం ఎవరూ ఏమీ అనవద్దండోయ్… పొరపాటున కూడా… ఆమధ్య సిద్ధార్థ్ శుక్లా చనిపోయాడు, ఎవరో ఒకాయన ఈ డర్టీ కేరక్టర్ ఫోటో పెట్టేసి, ఆర్ఐపీ అని రాశాడు… దాంతో ఆ ట్విట్టరుడి మీద విరుచుకుపడ్డాడు… ఏం మనిషివిరా బాబూ…!! సటల్ క్రాక్ ఛాంపియన్…!!!
Share this Article