Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పుడు హీరో క్రీజులోకి దిగి… హాకీ స్టిక్‌తో విలన్లను కబడ్డీ ఆడేసుకుంటాడు…

March 7, 2021 by M S R

ఏ1 ఎక్స్‌ప్రెస్ నాతో కూడా చూడబడింది… సగటు సౌతిండియన్ సినిమాలకుండే కొన్ని విశిష్ట అవలక్షణాలు ఏమీ మిస్ కాలేదు… పైగా తమిళ డైరెక్టర్.., తమిళ కథ, తమిళ ఒరిజినల్ సినిమా, అవే తమిళ ట్యూన్లతో అక్కడక్కడా తమిళ వాసన కొట్టినా సరే… ఏదో హాకీ మీద ఇన్‌స్పిరేషనల్ స్టోరీ కావచ్చులే అనుకుంటే మొత్తం ఇర్రేషనల్ కథతో చావగొట్టాడు… హాకీ స్టిక్‌తో కొట్టినట్టే… అయోధ్య సుందరి లావణ్య త్రిపాఠీ ప్లస్ సందీప్ కిషన్ ఇద్దరూ హాకీ స్టిక్స్ పట్టుకున్న పోస్టర్లు చూసి… ఇదేదో ఆమెను ప్లస్ ఇండియన్ హాకీని ఉద్దరించిన ఏదో కథే అయి ఉంటుందని భ్రమపడితే… అసలు కథ ఎక్కెడక్కడికో వెళ్లిపోయి, ఆమెను కూడా తెరమరుగైపోయి… ఓ స్టేడియం రక్షణ ఎపిసోడ్‌లోకి వెళ్లిపోయింది… బాషా టైపులో అన్నీ వదిలేసుకుని… వీలు చూసుకుని యానాం ద్వారా ఫ్రాన్స్ వెళ్లి సెటిల్ కావాలని ప్రయత్నించే హీరో… సినిమా కదా… మళ్లీ హాకీ స్టిక్ పట్టుకుని, కథతో సెకండాఫ్ కబడ్డీ ఆడేసి, స్టేడియాన్ని రక్షిస్తాడు… అవునూ, యానాం వెళ్తే మంచి ప్రాన్స్ దొరుకుతాయని తెలుసు గానీ, ఫ్రాన్స్‌కు రూట్ కూడా దొరుకుతుందా..?

Ads

ఒక స్టేడియాన్ని మింగేయాలనే రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉండవచ్చు గాక… దేశం నిండా అలాంటోళ్లే తగలడ్డారు… కానీ స్టేడియాన్ని తెగనమ్మే సర్కారు, ఓ ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ ఉన్న టీం ఓ ఆట గెలిస్తే చాలు ఇక దాని జోలికి పోదా..? దానికి ప్రొటెక్షన్ లభిస్తుందా..? ఎలాగబ్బా..? సినిమా కథలకు పెద్దగా లాజిక్కులు ఉండవు సరే గానీ, మరీ ఇలాగా..?! ప్రేక్షకులంటే మరీ అంత తేలికభావం మంచిది కాదోయ్ సందీపూ… నువ్వు కూడా దీనికి నిర్మాతవు కాబట్టి నీకే చెప్పాలి ఇది… మధ్యమధ్యలో కథకు అడ్డుతగిలి తెగ విసిగించిన ఆ పాటలకన్నా ఈ స్టేడియం రక్షణ పర్వమే నవ్వు తెప్పించింది… మిత్రుడు Bharadwaja Rangavajhala….  వాల్ మీద కనిపించిన ఓ సెటైర్ ఈ కథపై, ఈ స్పోర్ట్స్ కథల ట్రెండుపై పర్‌ఫెక్ట్ గోల్ షాట్…

Ads

a1 expresss
‘‘ఈ మధ్య తెలుగులో వస్తున్న స్పోర్డ్స్ సినిమాలు చూత్తంటే…
ఇట్టా కూడా తీసేత్తారా అని భయం వేస్తా ఉంది…
అదేంటంటే…
కథ పందొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో మొదలవుద్ది…
ప్రైవేటీకరణ గ్లోబలీకరణ యవ్వారాలు మొదలు పెట్టేత్తా ఉంటాడు పీవీ నరసింహారావు…
డంకెల్ మీద సంతకం పెట్టేత్తా, లేకపోతే మనకి మనుగడ లేదు… అని సంతకం పెట్టవద్దంటున్న కమ్యునిస్టులందరినీ, ఇరత పార్టీలోళ్లనీ పిల్చి బావురుమంటాడు…
అప్పుడు నానా గోత్ర కమ్యునిస్టు పార్టీలూ, డంకెల్ గోబ్యాక్ అని గోడల మీద రాతలు రాసేవోళ్లంతా వెళ్లి, నీకేం బయ్యిం లేదు పీవీ గారూ… డంకెల్ టీమ్ అని అంతర్జాతీయ కబడీ టీమ్ పెట్టుకుని, మా ఇండియా టీమ్ తో గెలవమనండి… ఒకేళ గెలిత్తే … అప్పుడు మా దేశంలో అన్నీ ప్రైవేటేసుకోండి… లిబరల్ చేసేయండి… అని ఛాలెంజ్ చేసి రండి… అంటారు… పీవీ గారు కూడా ధైర్నంగా ఎల్లి చాలెంజ్ చేసి వత్తారు…
ఆళ్లు టీమ్ కట్టుకుని వత్తారు…
కబడీ ఆడేత్తారు. అన్ని రౌండ్లలోనూ డంకెల్ టీమే గెలుచుద్ది…
ఎట్టారా అని అందరూ టెన్షన్ పడిపోతా ఉంటారు… ప్రభుత్వ సంస్ధల్లో పన్జేసేవాళ్ల ఇళ్లాళ్లంతా కనకదుర్గ తదితర గుళ్లల్లో పెద్ద ఎత్తున ఇండియా టీమ్ గెలవాలని పూజలు అవీ చేసేత్తా ఉంటారు…
ఆకరి రౌండ్ లో అందరినీ ముట్టేసుకుని టీమును గెలిపించేత్తాడు హీరో…
అప్పడు పీవీ నరసింహారావు బావురుమని ఏడ్చి, ఆడ్ని కావలించుకుని నువ్వే ఇక ఈ దేశానికి పెదానివి అనేత్తాడన్నమాట…
దేశం మొత్తం ప్రైవేట్లు లేకుండా విముక్తయిపోద్దన్నమాట… అప్పటి దాకా హీరోగాడ్ని ఉత్త జడ్డి వెధవలా చూసిన వీరోయిన్ను కూడా సారీ బాసూ అని మీరు నన్ను పెళ్లాడరూ ప్లీజ్ అండీ అంటుంది… అప్పడు శుభం అని పడేస్తాం అన్నమాట…’’

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions