మహారాష్ట్ర అయిపోయింది… ప్రస్తుతం జార్ఖండ్ ఆపరేషన్ నడుస్తోంది… జార్ఖండ్‌లో అధికారం బీజేపీ చేతికి వస్తుందా రాదానేది కాదు ప్రశ్న… ఆర్జేడీ, కాంగ్రెస్, జేఎంఎం కూటమిని కుదుపులపాలు చేయడం టార్గెట్… కూటమి విచ్చుకుపోతుందా..? జేఎంఎం చీలిపోతుందా..? లేక సీఎం హేమంత్ సోరెన్ తను పదే పదే బెదిరిస్తున్నట్టుగా మధ్యంతర ఎన్నికలకు నిజంగానే వెళ్తాడా..? దానికి కూటమి అంగీకరిస్తుందా..? టెంపరరీగా భార్య కల్పనను సీఎం కుర్చీ ఎక్కిస్తాడా..? ఇవన్నీ శేషప్రశ్నలు…
వాట్ నెక్స్ట్..? పొలిటికల్ మార్గంలో తెలంగాణ… (చెప్పలేం, ఈడీలు, సీబీఐలు కూడా రంగప్రవేశం చేయవచ్చు)… నాన్-పొలిటికల్ మార్గంలో బీహార్… అవును, బీహారే… నితిశ్ తమ నుంచి విడిపోయి, ఆర్జేడీతో కలిసి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం మోడీషాలకు మంటపుట్టిస్తోంది… ఆల్రెడీ గత ఎన్నికల నుంచే నితిశ్ డౌన్‌ఫాల్ స్టార్టయింది, జేడీయూ గురించి పెద్ద ఆలోచన అక్కర్లేదు ఇక… కానీ ఆర్జేడీ ఎదుగుతోంది… తేజస్వి యాదవ్ లీడర్‌గా బలంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు… ఇప్పుడు అధికారంలో భాగస్వామి అయ్యాడు…
కాంగ్రెస్ పార్టీనైనా సహించవచ్చుగానీ… ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలను బీజేపీ అస్సలు ఉపేక్షించదు… రౌడీ పార్టీలుగా పరిగణిస్తుంది… అందుకే బీహార్‌లో ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది… ఈసారి టార్గెట్ తేజస్వియే… ఓ కేసును తవ్వింది… లాలూ కుటుంబంలోకి కీలకసభ్యులంతా బుక్కయ్యే ఆధారాలు దొరికాయి… తేజస్వినే తీసుకెళ్లి జైలులో పారేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది… దాంతో లాలూ కుటుంబాన్ని మరింత బదనాం చేయవచ్చు (అదసలే నొటోరియస్ హిస్టరీ), పార్టీ నెట్‌వర్క్‌ను డిస్టర్బ్ చేయవచ్చు, నీతిమాటలు చెప్పే నితిశ్‌ను చూసి పకపకా నవ్వవచ్చు…
Ads
తేజస్విని బుక్ చేయబోయే కేసు ‘‘ల్యాండ్స్ ఫర్ జాబ్స్’’… ఇందులో మరీ సంక్లిష్టమైన అంశాలేమీ లేవు… అప్పట్లో లాలూ రైల్వే మంత్రిగా ఉద్దరించాడు కదా… ముంబై, జబల్‌పూర్, కోల్‌కత్తా, జైపూర్, హాజీపూర్ ఎట్సెట్రా రైల్వే జోన్లలో గ్రూప్-డి కొలువుల్ని అమ్మకానికి పెట్టేశాడు… నగదు తీసుకునేది లేదు, కొలువు కావాల్సినవాళ్లు కొంత ల్యాండ్‌ను లాలూ కుటుంబసభ్యుల పేర్లతో గిఫ్ట్ డీడ్ల ద్వారా రాసి ఇచ్చేయాలి… ఇదోతరహా అవినీతి మార్గం…
ఆల్‌రెడీ 16 మందివి ఆధారాలు దొరికాయి… మొత్తం జాబితా 1458… అన్నీ తవ్వాలి… వందల కోట్ల కుంభకోణం… సీబీఐ గనుక నిజాయితీగా వ్యవహరిస్తే లాలూకు మళ్లీ జైలు తప్పదు… ఈసారి మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్య రబ్రీదేవి, చిన్న కొడుకు తేజస్వి యాదవ్, బిడ్డ మీసా భారతి, ఇంకో బిడ్డ హేమాయాదవ్ అడ్డగోలుగా బుక్ కావడం ఖాయం… మరి తేజస్వికి ఈమధ్య ఏం సూచనలు కనిపించాయో ఏమోగానీ… త్వరలో నా భార్య రాజశ్రీ యాదవ్ రాజకీయాల్లో వస్తుందని వెల్లడించాడు…
తాము జైలుకు వెళ్తే, భార్యను డిప్యూటీ సీఎం పోస్టులో కూర్చోబెడతాడా..? సీఎం కుర్చీ అంటేనేమో దాని విలువ వేరు… మరీ డిప్యూటీ సీఎం పోస్టులో ఆపద్ధర్మంగా భార్యను కూర్చోబెట్టడం అవసరమా..? ఇవన్నీ జవాబుల్లేని ప్రశ్నలే… ఇక్కడ ఇంకొన్ని అంశాలూ ఉన్నయ్… బీజేపీ ఎప్పుడూ ఈడీ, సీబీఐ ఎట్సెట్రా కేసుల్ని ఝలిపించడం, అదిలించడం, బెదిరించడం, డిస్టర్బ్ చేయడమే తప్ప, దేన్నీ మళ్లీ సీరియస్ ఫాలోఅప్ చేయదు… ఎప్పటికప్పుడు పొలిటికల్ అవసరాన్ని బట్టి యాక్ట్ చేయడం…
పైగా కీలక వ్యక్తుల జోలికి వెళ్లి, జైలుపాలు చేసి, ప్రజల్లో సానుభూతి పెరిగేలా అవకాశం ఇవ్వదు బీజేపీ… కీలక వ్యక్తుల చుట్టూ ఉన్న ఆర్థికస్థంభాల్ని టార్గెట్ చేస్తుంది… సో, ఈ మోడస్ ఆపరెండిలో తేజస్వి యాదవ్ అరెస్టు అనేది సందేహాస్పదమే… రాజకీయాలు అంటేనే డైనమిక్… ఇప్పటికైతే సిట్యుయేషన్ ఇది… రేపు చెప్పలేం… రాజశ్రీ యాదవ్ డిప్యూటీ సీఎం అవుతుందో లేదో కూడా చెప్పలేం… ఆహా… జార్ఖండ్ సీఎం పీఠంపై కల్పన సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం పీఠంపై రాజశ్రీ యాదవ్… వావ్… డెస్టినీ అంటే ఇదేనా..?!
Share this Article