.
సిద్దిపేటలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అనే వ్యాఖ్య వెనుక రేవంత్ రెడ్డిది మైండ్ గేమ్… ఈసారి బీఆర్ఎస్ పెద్ద తలల సీట్లను కూడా కొట్టేస్తాం అనే సవాల్ విసరడం… అది కాంగ్రెస్ కేడర్‌లో బూస్టప్… బీఆర్ఎస్‌ను ‘గోకి’ ఇంకేదో ప్రతి సవాల్ దిశగా లాగడం… హరీష్ రావు పడిపోయాడు…
వాళ్లో వీళ్లో ఎందుకు, నువ్వే పోటీ చెయ్ దమ్ముంటే అన్నాడు… ‘ నా రేంజ్‌కు నీతో పోటీ దేనికిలే, జాతిపిత అని మోస్తున్నారు కదా, కమాన్, కేసీయార్‌ను ఈసారి కొడంగల్‌లో పోటీచేయమనండి’ అని రేవంత్ రెడ్డి బదులిస్తే… హరీష్ రావు, కేసీయార్, కేటీయార్ ఏమంటారో… అక్కడిదాకా దేనికి..? రేపు కొత్త పార్టీ ప్రకటించాక కవిత స్ట్రెయిట్‌గా తన పోటీ హరీష్ రావుపైనే, సిద్దిపేటలోనే అని ప్రకటిస్తే..? సర్ సపోజ్, రాష్ట్ర స్థూల రాజకీయ ప్రయోజనాల కోణంతో కవితకు కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తే… కథ రసకందాయంలో పడుతుంది..!!
Ads
కొడంగల్‌లో కేసీయార్ పోటీ, సిద్దిపేటలో కవిత పోటీ… ఈ అంశాల మీద మళ్లీ హరీష్ రావు మాట్లాడడు, స్పందించడు… అది మాత్రం పక్కా… నిజానికి సిద్దిపేట నా బంగారుకోట, దుర్భేద్యం అనే భరోసా, నమ్మకంతో రేవంత్ రెడ్డినే పోటీకి సవాల్ చేసి ఉండొచ్చు హరీష్ రావు, నిజంగా తనకు, కేసీయార్‌కు చాలాకాలంగా సిద్దిపేట బలమైన కోట… సందేహం లేదు… కానీ..?

రాజకీయాల్లో దుర్భేద్యమైన కోటలు అంటూ ఏమీ ఉండవు… నేను స్టేట్ ఫిగర్‌ను నాకెదురు లేదు అనే భ్రమలూ రాజకీయాల్లో నడవవు… అంతెందుకు..? కరీంనగర్‌లో బండి సంజయ్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, అంబర్‌పేటలో కిషన్ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి… ఏమయ్యారు..? కామారెడ్డిలో కేసీయార్, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారుగా… గజ్వెల్‌లో కేసీయార్‌ను సవాల్ చేసిన ఈటల ఓడిపోలేదా..?
రేవంత్ రెడ్డి అంటే కామారెడ్డికి కొత్త అనుకుందాం, మరి తెలంగాణ సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న ‘బాపు’ కేసీయార్ ఎందుకు ఓడిపోయినట్టు..? పర్‌ఫెక్ట్ ప్లానింగ్ చేయాలే గానీ, సిరిసిల్ల, గజ్వెల్ కూడా దుర్భేద్యాలు ఏమీ కావు… అప్పట్లో అంతటి ఎన్టీయార్ ఓడిపోలేదా కల్వకుర్తిలో..?!

రాజకీయాల్లో “పెట్టని కోట” అనేది ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ మాత్రమే… ప్రత్యర్థి పార్టీ పక్కాగా ప్లాన్ చేసి, ప్రజల్లోకి వెళ్తే గజ్వేల్ అయినా, సిద్దిపేట అయినా బద్ధలు కావడం పెద్ద కష్టమేమీ కాదు… రేవంత్ రెడ్డి ఇప్పుడు హరీష్ రావును ఆ ‘అతి విశ్వాసం’ (Complacency) నుంచి బయటకు లాగుతున్నాడు…
సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట అన్ బ్రేకబుల్ ఏమీ కావు… సిద్దిపేటనే తీసుకుంటే కాంగ్రెస్, బీజేపీలు పకడ్బందీగా కేడర్ నిర్మాణం చేయలేకపోయాయి… ఓ ప్రత్నామ్నాయ నేతను బలంగా నిలబెట్టలేకపోయాయి… ఊళ్లల్లో బీసీలు, రెడ్లు రాజకీయంగా పుంజుకున్నా… నియోజకవర్గ స్థాయి లీడర్లను ఆర్గనైజ్ చేయలేకపోయాయి… అలా హరీష్ రావుకు అది ‘దుర్గం’ అయ్యింది తప్ప, తనేమీ ‘అజేయుడు’ కాదు, ఆ దుర్గం అభేద్యమూ కాదు…
రాజకీయాల్లో ‘శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు’ ఉండరు అన్నట్టే… ‘శాశ్వత నియోజకవర్గాలు’ ‘ఛేదించలేని కోటలు’ కూడా ఉండవు… రేవంత్ రెడ్డి ఊరికే సిద్దిపేట ప్రస్తావన తీసుకురాలేదు… మనసులో ఏదో ఉంది… అక్కడ నిశ్శబ్దంగా ఏదో యాక్షన్ రెడీ అవుతోంది… అదేమిటో కాలం చెబుతుంది..!! అవునూ, మరి సిరిసిల్ల, గజ్వెల్ మాటేమిటి నాయకా..?!

1. సిద్దిపేట (హరీష్ రావు) … సిద్దిపేటలో హరీష్ రావు గెలిచినప్పటికీ, గతంతో పోలిస్తే ఆయన మెజారిటీ తగ్గింది. 2018 మెజారిటీ: దాదాపు 1,18,699 ఓట్లు. 2023 మెజారిటీ: దాదాపు 82,308 ఓట్లు… మెజారిటీ తగ్గడం అనేది అక్కడ కూడా వ్యతిరేకత లేదా మార్పు కోరుకునే ఓటర్లు ఉన్నారని, బలమైన ప్రత్యర్థి (కవిత?) బరిలో ఉంటే ప్రమాదమేననీ సూచిస్తోంది…
2. సిరిసిల్ల (కేటీఆర్) … కేటీఆర్ విషయంలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపించింది… కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురైంది… 2018 మెజారిటీ: దాదాపు 89,009 ఓట్లు… 2023 మెజారిటీ: దాదాపు 29,687 ఓట్లు… అంటే దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీ తగ్గడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది…
3. గజ్వేల్ (కేసీఆర్) … కేసీఆర్ గజ్వేల్‌లో గెలిచినప్పటికీ, అదే సమయంలో పోటీ చేసిన కామారెడ్డిలో ఓడిపోవడం ఒక పెద్ద కుదుపు. గజ్వేల్‌లో కూడా ఈటల రాజేందర్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురైంది. 2018 మెజారిటీ: 58,290 ఓట్లు. 2023 మెజారిటీ: 45,031 ఓట్లు… (statistics are subject to correction)
Share this Article