Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింహబలుడు Vs సింహగర్జన… రెండూ యావరేజీయే… కృష్ణ సినిమా కాస్త హిట్…

November 14, 2023 by M S R

Bharadwaja Rangavajhala………..   1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది. అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడుకు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు.

ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన డి.వి.ఎస్ రాజు గారి పిల్లలు తీసిన సింహబలుడుకు భారీ బడ్జట్ పెట్టారు. భారీ సెట్టింగులు వేశారు.

ఈ సినిమాకు పోటీగా కృష్ణ నటించిన సింహగర్జన కూడా రిలీజయ్యింది. గిరిబాబు తీసిన సింహగర్జనకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు. ఈ రెండు సినిమాలూ యావరేజ్ గానే నడిచాయి.

Ads

సింహబలుడుకైతే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అంతిమంగా గర్జనకే ఎక్కువ డబ్బులొచ్చాయి. విచిత్రంగా అదే సమయంలో జాపపద బ్రహ్మ విఠలాచార్య తీసిన గంధర్వకన్య కూడా రిలీజయ్యింది. జానపదాల నిర్మాణం ఆగిపోయిన ఎనిమిదేళ్లకు జరిగిన ఈ ప్రయత్నంలో విఠలాచార్యే విజయం సాధించారు.

సింహబలుడు చిత్రం విజయం కోసం రాఘవేంద్రరావుతో పాటు ఆయన తండ్రి కె.ఎస్. ప్రకాశరావు, అన్న కె.బాపయ్య కూడా శ్రమించారు. సింహబలుడు చిత్రం కోసం వేసిన ఎరీనా సెట్ లో కెమేరామెన్ కె.ఎస్ ప్రకాశ్ ఫొటోని ఈ జ్ఞాపకాల సందర్భంలో జతపరుస్తున్నాను.

సింహబలుడు

ఈ సినిమాకు కెమేరా దర్శకత్వం వహించింది సీనియర్ కెమేరామెన్ కన్నప్ప. సెకండ్ యూనిట్ కెమేరామెన్ గా ప్రమోషన్ అందుకున్నారు కె.ఎస్. ప్రకాశ్. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం డ్రైవరు రాముడు. ఆ సినిమా మళ్లీ విజయభేరి మోగించింది.

ఈ సినిమాకు పోటీగా కూడా కృష్ణ తో లారీ డ్రైవర్ సినిమా రావాల్సింది. అన్నగారితో అడవిరాముడు తీసిన సత్యచిత్ర నిర్మాతలే పి.సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ జయప్రదలు హీరో హీరోయిన్లుగా లారీ డ్రైవర్ అనే సినిమా ప్రారంభించారు. కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏ కారణం చేతో ఆపివేశారు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆల్ పార్టీ మీటింగు… నవ్వు పుట్టించే తెలంగాణ ప్రభుత్వ లేఖ…
  • Annamalai Breaks Free of His Shackles… Trouble Ahead for Palaniswami
  • నందూస్ వరల్డ్..! ఈ ట్యూబర్ చీటరా..? అసలేం జరుగుతోంది..?!
  • బంధనాలు తెంచుకున్న అన్నామలై… పళనిస్వామికి చుక్కలే…
  • రాత్రికిరాత్రి వైరల్ స్టార్… ఒక్క రాత్రికి నీ రేటెంత అనడిగేదాకా…
  • yudhvir ahlavath … హఠాత్తుగా సోషల్ మీడియాలో వైరల్… ఎందుకంటే…
  • రహేఁ నా రహేఁ హమ్…! ‘సుమనో’హర మధుర స్మృతి, ఒక మూగ వేదన..!
  • Rahen na rahen hum… remembering great singer suman kalyanpur…
  • ఆక్రమణ దురుద్దేశాలు లేకపోతే… చెరువులో ఈ కంచె ఏమిటయ్యా…!?
  • దుష్ట శిక్షకుడు పబ్లిక్ రౌడీ… చెడ్డ పనుల దుష్ట రౌడీ… బోత్ ఆర్ నాట్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions