Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగ బాబుగారొచ్చారు కదా… శ్రీముఖి ఎగిరిపోయింది… దీపిక పిల్లిలా వచ్చి చేరింది…

January 17, 2022 by M S R

1.67 …. ఏదైనా టీవీలో రియాలిటీ షోకు, అదీ భారీగా ఖర్చుపెడుతున్న షోకు ఈ రేటింగ్ వచ్చిందంటే… మూసుకోవోయ్, ఇక చాలు అని ప్రేక్షకుడు స్పష్టంగా తిరస్కరించినట్టు లెక్క… ఆ షోలో నాణ్యత లేదని తేల్చేసినట్టు లెక్క… బ్రహ్మాండమైన రీచ్, సాధనసంపత్తి ఉన్న చానెల్‌లో ఓ షోకు ఆ రేటింగ్ వస్తే ప్రేక్షకుడు అభిశంసించినట్టు లెక్క… ఈటీవీ వాడి జబర్దస్త్‌కు పోటీగా స్టార్‌మాటీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే షో దుర్గతి అది… హైదరాబాద్ బార్క్ రేటింగులు జస్ట్ 1.67 టీఆర్పీలు మాత్రమే… ఎవడూ చూడని జెమిని టీవీలో ఏదో పాత దిక్కుమాలిన సీరియల్‌కు కూడా ఈ రేటింగ్ వస్తుంది… మరి..?

ఒకవైపు జబర్దస్త్ షో ఏకంగా ఈటీవీకి ఆక్సిజెన్‌లాగా ఆదుకుంటుంటే… ఆ జబర్దస్త్‌తో పోలిస్తే బొచ్చెడు ఖర్చు పెడుతున్న కామెడీ స్టార్స్ ఎందుకు క్లిక్ కావడం లేదు..? స్కిట్స్ ఎందుకు నాసిరకంగా ఉండి, బోర్ కొడుతున్నయ్..? అది తెలిస్తే అది మాటీవీ క్రియేటివ్ టీం ఎందుకు అవుతుంది..? అంతా గుడ్డెద్దు చేలో పడ్డ యవ్వారమేగా..? అసలు విషయానికి వద్దాం… మొదట్లో ఫాఫం, ఈ షోలో వర్షిణి కనిపించేది యాంకరిణిగా… కానీ హఠాత్తుగా ఏమైందో ఏమో… యాంకర్లు, జడ్జిలను బట్టి షోకు పాపులారిటీ అనే పిచ్చి భ్రమల్లో బతికే క్రియేటివ్ బ్యాచ్ కదా… షో రేటింగ్‌పరంగా లేవడం లేదని వర్షిణిని తరిమేశారు…

తరువాత ఈటీవీ ఢీ షో నుంచి శేఖర్ మాస్టర్‌ను పట్టుకొచ్చి, ఇక్కడ జడ్జిగా చేశారు… ప్చ్, ఫలితం లేదు… దాంతో శ్రీముఖిని పట్టుకొచ్చారు… నువ్వే సోల్ యాంకరిణివి అన్నారు… (అంతకుముందు జీతెలుగులో అదిరింది షోలో కూడా ఇలాగే సమీరను తీసిపారేసి, శ్రీముఖిని తెచ్చిపెట్టారు… తరువాత నాగబాబు చేసిన ప్రయోగాలతో మొత్తానికి ఆ షో రద్దయిపోయింది… సో, శ్రీముఖికి ఈ తీసేయడాలు, చేర్చడాలు కథలన్నీ తెలుసు…) ఐనా రేటింగ్స్ లేవు… ఈసారి ఖాళీగా ఉన్న నాగబాబును తీసుకొచ్చారు… మరి తను జడ్జి కాగానే ఒకరు ఎగిరిపోవాలి కదా… ఫాఫం, శ్రీదేవి అనే ఓ పాత హీరోయిన్ జడ్జి కుర్చీ నుంచి ఎగిరిపోయింది…

Ads

అసలు నాగబాబు వచ్చాడు అంటేనే… యాంకర్లకు లేదా జడ్జిలకు మూడింది అని అర్థం… వాడు జీవాడైనా సరే, మాటీవీ వాడైనా సరే, నాగబాబుకు వంగి అలా సలామ్స్ కొట్టేస్తాయి… అదంతే… సో, రేటింగ్స్ పెరగడానికి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించి, ఇప్పుడు ఈ షో పేరును కామెడీ స్టార్స్ ధమాకా అని మార్చారు… ఇది మరో దరిద్రం… యాంకర్లు, జడ్జిలను మారిస్తే రేటింగ్స్ పెరుగుతాయనేది ఎంతటి పిచ్చి భ్రమో, షో పేరు మారిస్తే పాపులారిటీ వస్తుందనేదీ అంతే పిచ్చి భ్రమ….

అక్కడ ఢీ నుంచి వెళ్లగొట్టబడిన దీపిక పిల్లి అనే కేరక్టర్ ఉంది కదా… ఆమెను ఈ కామెడీ స్టార్స్ ధమాకాకు తీసుకొచ్చారు… ఆమె యాంకరో లేక కమెడియనో తెలియదు… కానీ అన్నింటికన్నా విశేషం ఏమిటంటే…? శ్రీముఖి ఎగిరిపోయింది తాజాగా… షో ప్రోమోలో ఆమె మొహమే కనిపించడం లేదు… తెలిసిందే కదా… నాగబాబు వచ్చాడంటే యాంకర్లకు మూడుతుంది అని…!! ఫాఫం, నాగబాబు వచ్చినప్పుడు ఆహా ఓహో లాఫింగ్ స్టార్ అంటూ బోలెడు కథలుపడింది శ్రీముఖి, ఫస్ట్ దెబ్బ తన మీదే పడింది… ఈటీవీ నుంచి అదిరె అభిని తెచ్చారు… మాటీవీ వాడి ఆస్థాన కమెడియన్లు ఉండనే ఉన్నారు… ఇక ధమాకా అంటున్నారు… వచ్చే ఆదివారం నుంచి ధూంధాం తడాఖా అంటున్నారు… కానీ బేసిక్‌గా స్కిట్లు బాగుండకపోతే… ఇలా యాంకర్లను తీసేయడం, జడ్జిలను ఎగురగొట్టడం, షో పేరు మార్చడంతో రేటింగ్స్ పెరగవురా తమ్మీ… శ్రీముఖి పోతే, దీపిక పిల్లి వస్తే… షోను జనం చూస్తారా..? ఎక్కడి నుంచి వస్తార్రా బాబూ..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions