జీ జింగ్ పింగ్ కి గుండె పోటు? చైనా నిరంకుశ అద్యక్షుడు జీ జింగ్ పింగ్ (Xi Xingping) కి గుండె పోటు వచ్చింది. CCP మీటింగ్ లో ఉన్న జీ జింగ్ పింగ్ టీ తాగుతుండగా గుండె పోటు వచ్చినట్లు చైనీస్ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతున్నది! కానీ అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వార్త బయటికి రాలేదు!
అయితే జీ జింగ్ పింగ్ గత రెండు ఏళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అన్నది నిజమే! చైనా లో CCP (China Communist Party) సెంట్రల్ కమిటీ అనేది అద్యక్షుడు కంటే శక్తిమంతమైనది! సెంట్రల్ కమిటీ ఆదేశాలని అద్యక్షుడు కూడా శిరసావహించాల్సిందే! కోవిడ్, అమెరికా, యూరోపు, భారత్ లతో సంబంధాల విషయంలో జీ జింగ్ పింగ్ అనుసరించిన విధానాలు చైనాకి వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా ఉండడం మీద సెంట్రల్ కమిటీ తరచూ హెచ్చరిస్తూ వస్తున్నది!
యూరోపియన్ యూనియన్!
Ads
గత వారం రోజులుగా అంతర్జాతీయoగా ఒక సంచలన వార్త ప్రచారంలో ఉంది….. యూరోపులో చైనాకి చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించినట్లు అనేది ఆ వార్త సారాంశం!
దానిలో భాగంగా గ్యాస్ టర్భైన్ ఇంజిన్లను, వాటి విడి భాగాలను చైనాకు ఎగుమతి చేయడం మీద నిషేధం విధించింది జర్మనీ!
అయితే చైనా ఇప్పటికే జర్మనీ కి చెందిన గ్యాస్ టార్బెయిన్ ఇంజిన్లను రివర్స్ ఇంజినీరింగ్ తో స్వంతంగా తయారు చేయడం మొదలు పెట్టింది అంటూ చైనీస్ సోషల్ మీడియాలో ఫోటోతో సహా వివరంగా వార్త వైరల్ అవుతున్నది!
ఇక యూరోపులో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం 7.9 బిలియన్ యూరోలకి మించదు! ఇది చైనాకు పప్పు బెల్లాలతో సమానం అనుకోండి! కానీ పరిశ్రమలు,యంత్రాలు, భూములు రూపంలో ఎంత ఉన్నదీ తెలియరాలేదు! కానీ నిజంగా యూరోపియన్ యూనియన్ కనుక చైనా ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయిస్తే దాని ప్రభావం ఎంతో కొంత చైనా ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపిస్తుంది!
మరో వైపు చైనాలోని భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయి. PwC (Price water house Coopers LLP) చైనాలోని బీజింగ్, షాంఘై తో పాటు ఇతర చైనా నగరాలలో తమ ఆఫీసులని మూసివేస్తున్నది. ఇప్పటికే దాదాపుగా 100 మంది ఆడిటర్లతో పాటు ఇతర స్టాఫ్ ను ఉద్యోగాల నుండీ తొలగించింది!
అయితే EVARGRANDE రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడిటింగ్ విషయంలో PwC ఆడిటింగ్ సరిగా లేదని చైనా దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయి కానీ చైనా సంస్థలు తమకి తప్పుడు లెక్కలు ఇవ్వడంవల్ల తమ ఆడిటింగ్ సరిగా లేదని దానికి తమని బాధ్యులుగా చూపడం సరి కాదు అని PwC వాదిస్తున్నది! అఫ్కోర్స్! చైనాలో పరిస్థితులు మునపటి లాగా లేవు కానీ చైనా నిజాలు చెప్పదు!
మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో ఇప్పటికీ చైనాదే పైచేయి! కానీ మెల్లగా భారత్ నుండి పోటీ ఎదుర్కోక తప్పదు ఈ విషయంలో! మరో వైపు భారత్ తో సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నది చైనా! ఈ నేపథ్యంలోనే CCP నుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు జింగ్ పింగ్!
అందుకే వారం క్రితం చైనా విదేశాంగ మంత్రి అయిన వాంగ్ యీ మన EAM జై శంకర్‌కి ఫోన్ చేసి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ చైనా రావాల్సిందిగా ఆహ్వానం పలికారు! ఇది మామూలుగా తీసుకోవాల్సిన విషయం కాదు చైనా విషయంలో!
అంటే యూరోపియన్ యూనియన్, అమెరికాలని పక్కన పెట్టీ, ముందు భారత్ తో సత్సంబంధాలను మెరుగు పరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని CCP సూచించింది. అందుకే వాంగ్ యీ ఫోన్ చేసి EAM జై శంకర్ కి ఆహ్వానం పలికారు! So! జింగ్ పింగ్ మీద ఒత్తిడి ఉంది!
జింగ్ పింగ్ నోరు జారాడు! నెల క్రితం జింగ్ పింగ్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత ఒత్తిడికి ప్రధాన కారణం! జింగ్ పింగ్ చేసిన ప్రకటన ఏమిటంటే… రష్యా ఒంటరి కాదు. యూరోపు , అమెరికాలు కలిసి రష్యా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే చైనా చూస్తూ ఊరుకోదు…
ఈ ప్రకటన మీద అమెరికా, యూరోపు తీవ్రంగా ప్రతిస్పందించలేదు కానీ తమ యాక్షన్ ద్వారా స్పందిస్తున్నాయి! సాంప్రదాయానికి భిన్నంగా యుద్ధం విషయంలో చైనా ఎవరి పక్షమో వహిస్తూ ప్రకటన చేయదు కానీ జింగ్ పింగ్ నోరు జారాడు!
బహుశా CCP దీని మీద మండి పడి ఉండవచ్చు!
CCP తమ వ్యాపార అవకాశాలు పదిలంగా ఉంచుకోవాలి అని చూస్తుంది తప్పితే రష్యా ఏమై పోయినా పట్టించుకోదు! ఏది ఏమైనా భారత్ విషయానికి వస్తే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు! చైనా అధ్యక్షుడి మార్పు వల్ల భారత్ కి మంచి జరుగుతుందా? అలాంటిది ఏదీ జరగదు! అక్కడ CCP సెంట్రల్ కమిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది!… ( By పార్థసారథి పోట్లూరి )
Share this Article