Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్షయ్‌ కుమార్‌పై అగ్గిమండుతున్న స్వామి… అరెస్టు కూడా చేయిస్తాడట…

July 30, 2022 by M S R

అసలే అది మహా దేశముదురు పిండం… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద పెద్దోళ్లే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి జోలికి వెళ్లడానికి సందేహిస్తారు… స్వామి అనగానే చాలు, ఏడెనిమిదేళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమాలో పరుచూరి తనే స్వయంగా పలికిన ఓ డైలాగ్ గుర్తొస్తూ ఉంటుంది…  ‘‘చెప్పుతో కొడితే చెమ్డాలే ఊడతాయిరా… సెక్షన్లతో పెట్టుకుంటే చెడ్డీలు ఊడదీసేసి చెడుగుడు ఆడుకుంటాం’’… ఇదీ ఆ డైలాగ్…

సరిగ్గా ఓ పాయింట్ పట్టుకుని స్వామి కోర్టుకు ఎక్కాడంటే అదొక రచ్చే… సరే, విషయానికొస్తే… స్వామికి ఇప్పుడు ఓ బాలీవుడ్ పాపులర్ హీరో మీద మస్తు కోపమొచ్చేసింది… ఎవరో కాదు… అక్షయ్ కుమార్… తనను అరెస్టు చేయించి, నష్టపరిహారం వసూలు చేసి, కెనడాకు పంపించేస్తాను అంటున్నాడు స్వామి… ఆయన కోపానికి కారణమేంటయ్యా అంటే… అక్షయ్‌కుమార్ తీసిన రామసేతు అనే సినిమా…

ఫాఫం, దర్శకుడు అభిషేక్ శర్మ 2007 నుంచీ ఈ కథపై, ఈ సినిమాపై కుస్తీలు పడుతున్నాడు… మొత్తానికి ఎలాగోలా కరోనాకు ముందే స్టార్ట్ చేశారు… అక్షయ్ కుమారే డబ్బులు పెడుతున్నాడు ఈ సినిమాకు… ఈమధ్య ఈ ట్రెండ్ కూడా నడుస్తోంది కదా… పైగా అక్షయ్ కాస్త రైటిస్టు… రామసేతు కథకు బాగా కనెక్టయినట్టున్నాడు… ఇదీ ఈ సినిమా పూర్వరంగం… షూటింగ్ పూర్తి కావడానికి టీం పలుచోట్లకు టూర్లు వేస్తూ నానా ప్రయాసపడింది…

Ads

ramsetu

ఇప్పుడు ఆ సినిమా మీద స్వామి కన్ను పడింది… కస్సుమంటున్నాడు… అసలు రామసేతు కథలో ఈ స్వామి పాత్ర ఏమిటనేది దిగువన ఉన్న లింకు చదివితే కొంతవరకూ అర్థమవుతుంది…



స్వామి మహా ఘటికుడు… రామసేతు రక్షణకు భలే పాయింట్ పట్టేశాడు…



అక్షయ్ కుమార్ ఏం చేశాడంటే..? ఆమధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు… అందులో స్వామి తాలూకు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ ఆర్డర్ కాపీని యథాతథంగా పెట్టేశాడు… దాంతో మండింది స్వామికి… అసలే కేసు కోర్టులో ఉంది… దానిపై ఏం మాట్లాడినా, బహిరంగంగా ఏం చర్చించినా సబ్ జుడీస్ అవుతుంది… ఈ అక్షయ్ ఏకంగా సినిమాలోనే వాడేసుకుంటున్నాడు అనేది తన కోపం…

పైగా సినిమా కథ గురించో, వివాదం గురించో తననేమీ ఎవరూ అడగలేదు… దాంతో అసలు ఆ రామసేతు సినిమా కథ మొత్తం నిజాల నుంచి జనాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని తెలుస్తోందనే ఆరోపణలో కేసు వేయబోతున్నాడు… ఈ కేసు వాదించేందుకు సత్య సభర్వాల్ అనే అడ్వొకేటుకు బాధ్యతలు అప్పగించేశాడు…

సత్య సభర్వాల్ ఓ ట్వీట్ చేస్తూ, ఆ పోస్టర్‌ను కూడా యాడ్ చేసింది…

 

స్వామి ఏమంటాడంటే… అసలు అక్షయ్ కుమార్ ఇండియనే కాదు, ఫారిన్ సిటిజెన్… ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాల్ని సహించకూడదు కాబట్టి తనను అరెస్టు చేసి, ఇక్కడి నుంచి పంపించేయాలట… (అక్షయ్ కుమార్‌కు కెనడా సిటిజెన్‌షిప్ ఉంది…)
ramsetu

 

ramsetu

నిజానికి ఇది సున్నితమైన సబ్జెక్టు… ఈ వారధి మానవనిర్మితమా..? ప్రకృతిసహజమా..? భ్రమా..? సత్యమా..? అనే ప్రశ్నలపై కొన్ని దశాబ్దాలుగా బోలెడంత చర్చ, అధ్యయనం సాగుతూనే ఉంది… అదెప్పుడూ తేలదు… ఓ కంక్లూజన్ రాదు… ఈ స్థితిలో అక్షయ్‌కుమార్ సినిమాలో అంతిమంగా ఏం చెబుతాడు..? ఇది ఇంట్రస్టింగ్ ప్రశ్నే…

అయితే అక్షయ్ కోర్టులో ఉన్న ప్రతిపాదిత ‘‘రామసేతు ప్రాజెక్టు’’ జోలికి వెళ్లకపోయినా సరే… కమర్షియల్ విలువలకు మాత్రమే కట్టుబడి వ్యవహరించే బాలీవుడ్ కల్చర్ ఈ సబ్జెక్టును కూడా భ్రష్టుపట్టిస్తుందేమో అనే సందేహం చాలామందిలో ఉంది… ఈ పోస్టర్ రిలీజ్ సమయంలోనే నెటిజనం ఇలాగే రియాక్టయ్యారు… అసలే ఆర్ఆర్ఆర్‌లో క్రియేటివ్ ఫ్రీడం పేరిట చరిత్రను ఎంత దారుణంగా వక్రీకరించారో చూశాం కదా… ఇదేమో కోట్లాది మందికి స్పిరిట్యుయల్‌గా లింకైన అంశం… ఎలా తీశాడో, ఏం తీశాడో తెరపై చూడాల్సిందే… కానీ అప్పటిదాకా స్వామి ఆగేట్టు లేడు… అలా ఆగితే తనను స్వామి అని ఎందుకంటారు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions