Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం సుమ… పాపులారిటీలో మరీ అంతగా జారిపోయిందా..?

February 20, 2024 by M S R

మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్… అంటే..? టీవీ షోలు,  సినీ ఫంక్షన్ల హోస్టులు, యాంకర్లు, యూట్యూబర్లు ఎట్సెట్రా… లేదా హఠాత్తుగా సెలబ్రిటీలు అయిపోయిన బర్రెలక్క, కుమారి ఆంటీ, మడత కుర్చీ పెద్దాయన, పల్లవి ప్రశాంత్ ఎట్సెట్రా… వీళ్లలో మిగతావాళ్లు వచ్చీపోయే కేటగిరీ.., కానీ టీవీ యాంకర్లు, హోస్టుల పాపులారిటీ కాస్త స్థిరంగానే కొనసాగుతూ ఉంటుంది…

విషయానికొస్తే… ఆర్మాక్స్ అనే సంస్థ ఎప్పటికప్పుడు ఈ విభాగంలో కూడా పాపులారిటీ సర్వే నిర్వహిస్తుంది… అదేలెండి, ఆన్‌లైన్ వోటింగ్… ఎందరు వోట్లేశారు, సర్వే పద్ధతేమిటీ వంటి వివరాలు ఏమీ చెప్పదు… కొన్నిసార్లు ఆ సర్వే  ఫలితాలు విచిత్రంగా అబ్బురపరుస్తాయి… ఇవి కూడా స్కోచ్ అవార్డుల్లాగా అమ్మకాల బాపతేనా అని కూడా అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది… పాపం శమించుగాక…

సాధారణంగా ఈ కేటగిరీలో మనకు ముందుగా స్ఫురించేది లేడీ యాంకర్ సుమ, మేల్ యాంకర్ ప్రదీప్.,. ఆ ఇద్దరికీ తిరుగు లేదు… నిజానికి సుమ కొన్నాళ్లుగా డైవర్సిఫై అవుతోంది… తన షోల పట్ల ప్రేక్షకుల్లో మొనాటనీ వచ్చేసరికి యూట్యూబ్ వీడియోలు, స్టార్ ఇంటర్వ్యూలు గట్రా చేస్తూ, ప్రధానంగా కొడుుకును హీరోగా సెటిల్ చేసే పనిలో నిమగ్నం అవుతోంది… అందుకే టీవీ షోలు తగ్గిపోయాయి… సినిమా ఫంక్షన్లకూ ఇతరత్రా హోస్టులు వస్తున్నారు… ఐనాసరే, ఈరోజుకూ నాన్  ఫిక్షన్ కేటగిరీలో ఆమే నెంబర్ వన్… డౌట్ లేదు… కానీ..?

Ads

suma

ఆర్మాక్స్ రీసెంటు సర్వేలో సుమ ఏకంగా నాలుగో ప్లేసులోకి వెళ్లిపోయినట్టు చూపించారు… ఉత్తదే… రాంగ్ రిజల్ట్… ఎందుకంటే..? నంబర్ వన్ ప్లేసులో ప్రదీప్  ఉన్నాడు… నిజానికి తన చేతుల్లో కూడా పెద్దగా షోలు ఏమీ లేవు… ఏదో ఈటీవీ ఢీ వంటి ఒకటీరెండు తప్ప..! పైగా సుమను దాటేసేంత పాపులారిటీ ఏమీ కాదు… కాకపోతే మేల్ కేటగిరీలో నంబర్ వన్… డౌట్ లేదు…

రెండో ప్లేసులో సుడిగాలి సుధీర్… ఒక కోణంలో కరెక్టే… కానీ ఒకప్పుడు… ఇప్పుడు తను టీవీ షోలు ఏమీ చేయడం లేదు… వెండితెర, అంటే ఫిక్షన్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు… రీసెంటుగా కాలింగ్ సహస్ర ఘోరంగా దెబ్బతిన్నా సరే అంతకుముందు గాలోడు మంచి వసూళ్లు చేసి, సుధీర్‌ను నిలదొక్కుకునే దిశలో తోడ్పడింది… బొమ్మలో చూపించిన ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు తనేమీ చేయడం లేదు… అసలు తను ఇప్పుడు టీవీ పర్సనాలిటీ కానేకాదు…

మూడో ప్లేసు హైపర్ ఆది… సుడిగాలి సుధీర్, గెటప్ సీను వంటి వాళ్లు పూర్తిగా సినిమాల్లోకి వెళ్లిపోయాక టీవీ షోలలో ఇప్పుడు హైపర్ ఆదిదే హవా… శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ ఎట్సెట్రా షోలలో బిజీ… జబర్దస్త్ మాత్రం చేయడం లేదు… అడపాదడపా  సినిమాల్లో చేస్తున్నాడు… మూడో ప్లేసు అనేది తప్పేమీ కాదు… కానీ చమ్మక్ చంద్ర అయిదో ప్లేసు… నిజానికి తను చాన్నాళ్లుగా బుల్లి తెర మీద లేడు… పైగా తను యాంకర్ కాదు, పక్కా ఫిక్షన్ కేటగిరీ, అంటే షోలలో పార్టిసిపేట్ చేస్తాడు… యాక్టర్… సో, ఇన్ని  సమీకరణాల నడుమ ఆర్మాక్స్ మరోసారి తన సర్వేల క్రెడిబులిటీ పోగొట్టుుకుంది..! ఊకో ఊకో సుమాంటీ… తూచ్, అంతా ఉత్తదే…!!

నిజానికి హైపిచ్‌లో అరుపులే యాంకర్, హోస్ట్ ప్రథమ లక్షణం అని బలంగా నమ్మే శ్రీముఖి మిగతా వాళ్లందరికన్నా బిజీగా ఉంది, ఆమె చేతిలో ముఖ్యమైన టీవీ షోలున్నయ్… ఆహా ఓటీటీలో కూడా మొన్నటిదాకా కామెడీ ఎక్స్‌చేంజ్ షో చేసింది… ఈటీవీ రెగ్యులర్ టీవీ షోలకు పెద్దగా రాదు… స్పెషల్ ఈవెంట్లలోనూ ఆమె బిజీ… తనకు పరిమితమైన రెండు షోలతో రష్మి కూడా పాపులరే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జర్నలిస్టుంటే తోపులు, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions