. ఇప్పుడున్న కామనర్లు, సెలబ్రిటీలతో బిగ్‌బాస్ షో అస్సలు క్లిక్ కాదు… గత సీజన్లకన్నా ఇది ఫ్లాప్ అయ్యేట్టు కనిపిస్తోంది… అగ్నిపరీక్ష అని నానా పైత్యపు చేష్టలు చేయించి కూడా కామనర్ల పూర్ సెలక్షన్స్… వాళ్లే కాదు, ఒకరిద్దరు మినహా సెలబ్రిటీల సెలక్షన్లు కూడా పూర్… ఏడెనిమిది రోజులు గడిచాయి కదా… ప్రేక్షకుల్లో ఈ షో పట్ల ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు… మధ్యలో ప్రవేశపెట్టాలనుకునే కంటెస్టెంట్లను ఇంకాస్త ముందే ప్రవేశపెడితే ఏమైనా ఛేంజ్ ఉంటుందేమో బహుశా… […]
రైతు అంటేనే మోసపోయేవాడని కదా… ఈ కేరక్టర్ చేసిందీ అదేగా…!!
. మరీ సీపీఐ నారాయణ అన్నట్టుగా… బిగ్‌బాస్ హౌజ్ ఓ వ్యభిచార కొంప అనే స్వీపింగ్ కామెంట్లు చేయలేను గానీ… డెఫినిట్‌గా అవాంఛనీయ కేరక్టర్లను … ఒరేయ్, నువ్వు తోపు, నువ్వు తురుమ్ అనే ముద్రవేసి సమాజం మీదకు వదులుతున్నది మాత్రం నిజం… అందులో ఫస్ట్ పర్సన్… పల్లవి ప్రశాంత్… గత సీజన్ విజేత… తనేమైనా ఎంటర్‌టెయినరా కాదు, మంచి గేమరా, అస్సలు కాదు, పోనీ, ఏమైనా ఓ రీతి కలిగిన కంటెస్టెంటా… కానేకాదు… ఆ శివాజీ […]
నువ్వు ఒక్కడివే ఏడవడం లేదు షన్నూ… నీలా బోలెడు మంది…
. ఓ వార్త… షణ్ముఖ్ జస్వంత్ అనే ఓ కేరక్టర్… యూట్యూబ్ వీడియోస్, వెబ్ సీరీస్‌తో ఫాఫం బాగానే ఉండేవాడు… బిగ్‌బాస్ (బహుశా 5 సీజన్,..?) లోకి ఎంటరయ్యాక తన జీవితం దుర్భరమైపోయింది… ఆ టీం ఏదో శాసిస్తుంది… దాంతో సిరి హన్మంతు అనే మరో కేరక్టర్‌తో లవ్వు, రొమాన్స్ హౌజులో… ఆమెకు బయట ఒకడున్నాడు… ఇతనికీ బయట ఒకామె ఉంది… కానీ టీఆర్పీల కోసం వాళ్ల నడుమ లవ్ ట్రాక్ నడిపించింది బిగ్‌బాస్… వాడికి రేటింగ్స్ […]
ఆ పాత బిగ్‌బాస్ అల్లర్లు రిపీటయితే… ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్‌పైనే యాక్షన్..!!
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, ఇతర తలనొప్పులతో బహుశా నాగార్జున బిగ్‌బాస్ హోస్టింగ్ ఆలస్యం అవుతుందేమో… ఏమో, చెప్పలేం… అదీ ప్రధాన ఆదాయవనరు కాబట్టి (స్టూడియో లీజ్, హోస్టింగ్ ఫీజ్) వెంటనే రెడీ అవుతాడేమో కూడా… నిజానికి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, ఒప్పందాలు పూర్తయి ఉండాలి… ఐతే గతంలోలాగా వివరాలు లీక్ గాకుండా జాగ్రత్తపడుతున్నారు… ఈసారి ఎవరెవరు అనే ఆసక్తి, థ్రిల్ లాంచింగ్ నాటికి అలాగే ఉండేందుకేమో… ఈలోపు యూట్యూబర్లు, సైట్లు అన్నీ కలిసి దాదాపు రెండొందల మందిని […]
షకీలాను పంపించేశారు… సీక్రెట్ రూంకు గరుణపురాణం… పాత బేకార్ తప్పులే మళ్లీ…
బిగ్‌బాస్ ఏదో ఉల్టాపుల్టా అన్నాడు… నిజంగానే అంతా ఉల్టాపల్టా యవ్వారమే కనిపిస్తోంది… రెండు వారాలకొచ్చింది… వీసమెత్తు ఇంట్రస్ట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సీజన్ కూడా… గత సీజన్ పనిచేసిన క్రియేటివ్ టీమే పనిచేస్తున్నట్టుంది చూడబోతే… నాగార్జున రాగద్వేషాలు కూడా పనిచేస్తున్నట్టున్నయ్… వెరసి ఇప్పటికీ బిగ్‌బాస్ గాడిన పడలేదు, పట్టాలెక్కలేదు… ఈసారి ఏం చేశారు..? షకీలాను బయటికి పంపించేశారు… అబ్బే, ప్రేక్షకుల వోట్ల మేరకు అంటారేమో… అంత సీన్ లేదు… అదంతా బిగ్‌బాస్ ఇష్టారాజ్యం… పంపించాలనుకుంటే ప్రేక్షకుల వోట్లు […]
బిగ్‌బాస్ ఫిమేల్ కంటెస్టెంట్లకు ముందస్తుగానే ప్రెగ్నెన్సీ టెస్టులు..!
బిగ్‌బాస్ షోపై మొన్న హైకోర్టులో జరిగిన విచారణను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ… కాస్త ఇంట్రస్టింగ్… ఎవరో ఒకాయన వేసిన పిల్ మీద జరుగుతోంది ఈ విచారణ… అవసరమైతే మేమే ఆ షో చూస్తామని కూడా అప్పట్లో జడ్జిలు చెప్పారు… స్టే ఇవ్వలేదు… లేటైంది… ఈలోపు షో ముగిసింది… పిటిషనర్ వాదన ఏంటంటే… బిగ్‌బాస్ షో హింసాత్మకం, అశ్లీలం, అనైతికం కాబట్టి ఆ ప్రసారాలను నిలిపివేయించాలి… అశ్లీలంగా ఉంటే ఆ షో చూడకుండా ఉంటే […]





