పాక్ ఆక్రమిత కాశ్మీర్… చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ వారం రోజులుగా భారత సరిహద్దు ప్రాంతం లడాఖ్ లో తిరుగుతుంటే విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్నప్పుడు బళ్లో మ్యాప్ పాయింటింగ్ మొదలు పెట్టినప్పటినుండి మనం చూస్తున్న భారతదేశ పటం; గీస్తున్న దేశ పటం; మదిలో నాటుకుపోయిన దేశ పటం అందరికీ తెలిసిందే. లేహ్ నుండి బయలుదేరి పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ చివరి గ్రామం థంగ్ ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇక్కడికి వచ్చినవారందరూ పొలోమని వెళుతుంటే మేమూ వెళ్లాము. […]