not at all credible opinions from poll strategist prasanth kishore
పీకేకు ఇప్పుడంత సీన్ లేదు… మరి చంద్రబాబు పీకే తోక ఎందుకు పట్టుకున్నట్టు..?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశాడు… తను టీడీపీ కోసం పనిచేస్తాడు… ఇవీ నేటి వార్తల సారాంశం… నిజానికి చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ నడుమ ఏ చర్చలు జరిగాయో ఎవరికీ తెలియదు… ఫలానా అంశం చర్చించి ఉంటారని ఊహించడమే… నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంత పాపులర్ వ్యూహకర్త ఏమీ కాదు… ఆశ్చర్యంగా ఉందా.,,? ఇదే నిజం… ప్రస్తుతం సక్సెస్ఫుల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు… కర్నాటకలో తను అనుసరించిన స్ట్రాటజీలు సక్సెసయ్యాక తెలంగాణ బాధ్యతలు కూడా […]
ఒక ప్రశాంత్ కిషోర్ చెడగొట్టుకున్నాడు… ఒక పాండ్యన్ నిలబెట్టుకున్నాడు…
మొన్నామధ్య మనం ఓ కథనాన్ని ముచ్చటించుకున్నాం… ఒడిశా ప్రభుత్వంలో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి, పేరు పాండ్యన్ వీఆర్ఎస్ తీసుకున్నాడు అని… దానికి నేపథ్యాన్ని కూడా చెప్పుకున్నాం… ఒకసారి ఈ పాత కథనాన్ని చదవండి, తరువాత తాజా సమాచారంలోకి వెళ్దాం… వి.కార్తికేయన్ పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఇంతకీ […]
జగన్ ట్రాపులో చంద్రబాబు..? టీడీపీ క్యాంపులో ‘వ్యూహకర్తల’ గడబిడ..!
[[ Patri Vasudevan….. ]] “తెలివిగల కుందేలు ముతరాసి వలలో పడ్డట్టు”… ఈ సామెత అందరికీ తెలిసిందే.. కాకపోతే ఇప్పుడు ఈ సామెతను చంద్రబాబు పరిస్తితికి పోల్చి మాట్లాడుతున్నారు రాజకీయ, సోషల్ మీడియా విశ్లేషకులు. చంద్రబాబు జగన్ వలలో పడ్డారా? అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ కోసం పనిచేసిన పీకే బృందంలోని ప్రధాన సభ్యుడు రాబిన్ శర్మ ప్రస్తుతం చంద్రబాబుకు వ్యూహకర్తగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. కాకపోతే అయన టీంలో జగన్ […]
PK Team :: హైదరాబాద్ టెంట్ ‘పీకే’శారు… ఈ ఇద్దరి దోస్తీ కటీఫ్…
‘‘తూచ్, ఈ దసరాకు కేసీయార్ జాతీయ రాజకీయాల ఎంట్రీ, కొత్త పార్టీ ఏర్పాటు ఉండకపోవచ్చు… బహుశా మరో రెండు నెలలు జాప్యం తప్పదు… ఢిల్లీ మద్యం స్కాం తలనొప్పి, ఈడీ-సీబీఐ యాక్టివ్ కదలికలతో పార్టీలో ఓరకమైన ఆందోళన కనిపిస్తోంది’’…. ఇది ఒక వార్త… ‘‘పీకే మీద కేసీయార్‌కు వైరాగ్యం వచ్చేసింది, లైట్ తీసుకున్నాడు, దాంతో ఆ పీకే టీం హైదరాబాద్ దుకాణం మూసేసింది, ఏపీకి తరలిపోయింది’’…. ఇది ఇంకో వార్త… ఈ రెండు వార్తల్ని ఓసారి కేసీయార్ […]
కాంగ్రెస్ పీకేను ఎందుకు వద్దనుకుంది..? పీకే వ్యాపార ప్రణాళిక తల్లకిందులు..!!
ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున అయోమయానికి, గందరగోళానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్…. ఒకేసారి అనేకానేక పడవుల మీద ప్రయాణించాలని అనుకున్నాడు… జాతీయ స్థాయిలో ఒక పార్టీకి వ్యూహకర్తగా వర్క్ చేయాలంటే చాలా కమిట్మెంట్ కావాలి, ప్రేమ కావాలి, కానీ పీకే వంటి వ్యాపారి ఒక చట్రంలో ఇమడాలని ఎందుకు అనుకుంటాడు… దీనికితోడు మాకు పనిచేయాలనుకుంటే ఇతర పార్టీలతో కటీఫ్ అయిపో అని కాంగ్రెస్ నిర్మొహమాటంగా చెప్పింది… పీకే వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో […]
రాజాధిరాజ… రాజమార్తాండ… రాజగంభీర… పీకే మహాశయా… జీ హుజూర్…
ప్రశాంత్ కిషోర్… ఓ పొలిటికల్ బ్రోకర్ అనే పదాన్ని వాడాల్సిన పనిలేదు… కానీ తను ఓ పొలిటికల్ మానిప్యులేటర్… తన ఆలోచనలు అత్యంత చంచలం… తనది వేల కోట్ల పొలిటికల్ స్ట్రాటజీ దందా… ఈ దేశ రాజకీయాల తాజా దురదృష్టం ఏమిటంటే… తను చుట్టూ తిరుగుతున్నారు సోకాల్డ్ రాజకీయ దురంధరులు… 24 గంటలూ రాజకీయ చాణక్యంలో మునిగి, తమను తాము ప్రూవ్ చేసుకున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ రాజకీయ వేత్తలు సైతం సిద్దాంతాలు, మన్నులేవు అంటూ ఓ […]
పీకే… కాంగ్రెస్ వర్క్ చేస్తే వోకే… కానీ కేసీయార్, జగన్‌లకు చికాకే…
అదేమిటో కాంగ్రెస్ క్యాంపులో చేరనున్న ప్రశాంత్ కిశోర్ అంటూ ఓ వార్త వచ్చింది… ఎవ్వడూ పట్టించుకోలేదు పెద్దగా… సోషల్ మీడియాలో చర్చ కూడా లేదు… ఆమధ్య అన్ని రాష్ట్రాల్లోనూ తన టీంలోకి వందలాది మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా వార్త వచ్చింది… అదీ ఎవ్వడూ పట్టించుకోలేదు… నిజానికి ఇది నిజమే అయితే కాస్త ఇంట్రస్టింగ్ డిబేట్ జరిగి ఉండాల్సింది… ఎందుకంటే, తన చేతిలో మంత్రదండం ఉంది, ఎవరినైనా గెలిపించగలడు అనే ఓ ఫేక్ హైప్ తన చుట్టూ క్రియేటై […]
అంతా నేనే చేశాను… నేను ఏదైనా చేసేయగలను… అబ్రకదబ్ర, అబ్రకదబ్ర…
ప్రశాంత్ కిషోర్..! వర్తమాన రాజకీయాల్లో ఆయన పేరు విననివాళ్లు లేరు… ఎన్నికల వ్యూహకర్తగా పేరు… నిజానికి తన టీం ఆపరేషన్స్ అధికంగా ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, ఫేక్ ప్రచారాలతో జనం మెదళ్లను తాత్కాలికంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం..! పార్టీల సిద్ధాంతాలు, వాటి నాణ్యత అనేవి గాలికి కొట్టుకుపోయి, ఇదుగో ఇలాంటివే ఎన్నికల్లో ప్రధానపాత్ర వహించడానికి ప్రధాన కారకుడు తను… తనను చూసి దేశమంతా బోలెడు మంది ఎన్నికల వ్యూహకర్తలు, సోషల్ టీం లీడర్లు గట్రా అర్జెంటుగా పుట్టుకొచ్చారు… […]
ఫాఫం పీకేను నమ్మిన మమత… ప్రధాని పీఠంపై అంతులేని ఆశలు…
పెద్ద పెద్ద రాజకీయ పండితులు అవసరం లేదు… మమతకు ప్రధాని పీఠంపై కన్నుపడింది, ఆశ పెరిగింది, చాన్స్ కనుచూపు మేరలో లీలగా కనిపిస్తోంది… మొన్నటి గెలుపుతో ధీమా పెరిగింది… పీకే మీద భరోసా కుదిరింది… కాంగ్రెస్ రాహుల్‌తో ఇక వేస్టని తేల్చేసుకుంది… ఇక ఆట మొదలెట్టింది… అసలు ఈ ఆట నుంచి కాంగ్రెస్‌ను డిలిట్ చేయాలని అనుకుంటోంది… శరద్ పవార్‌ను కలిసింది… కూటమి కడదాం అని చెప్పింది, తనూ సరే అన్నాడు… (ఒకవైపు కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో […]
నో నో… బీజేపీ మీద పీకే పూలేమీ చల్లలేదు… తన మాటల అసలు అర్థాలు వేరు…!
‘‘బీజేపీదే హవా… బీజేపీకి క్రేజు… ఇంకొన్ని దశాబ్దాలు అధికారం దానిదే… బీజేపీని పారద్రోలడం అసాధ్యం… రాహుల్ గాంధీ ఏవో భ్రమల్లో ఉన్నాడు, కానీ తన అంచనాలు తప్పు… బీజేపీని ఎవరూ ఏమీ చేయలేరు…..’’ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ మాటలు అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా రాస్తోంది… ఇక దానిమీద డిబేట్లు షురూ… ఎవడికి ఏది తోస్తే అది రాసేస్తున్నారు… అరె, బీజేపీ బద్ధ వ్యతిరేకి ఇలా మెచ్చుకోవడం ఏమిటి అనే డౌటనుమానాలు సరేసరి… కాంగ్రెస్‌తో […]
దుకాణం ఉంటుంది… తను వేరే దందాపై దృష్టిపెడతాడు… అదేమిటి..?!
ముందుగా ఓ చిన్న డిస్క్లయిమర్ :: ఒక పార్టీ గెలుపు, ఒక నాయకుడి గెలుపు లేదా ఓటముల వెనుక చాలా సమీకరణాలు ఉంటయ్… ఎవరో ఓ మంత్రగాడు వచ్చి అబ్రకదబ్ర అనగానే ఆ మాయ పనిచేయదు… సంక్లిష్టమైన భారతీయ రాజకీయాల్లో, ఏ ఉద్వేగమూ లేని స్థితిలో… ఓ వ్యక్తి వచ్చి, హాంఫట్ అనగానే మార్పులు రావు… కాకపోతే క్రెడిట్స్ వస్తయ్…. ప్రశాంత్ కిషోర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్’ అనే పేరు దక్కించుకోవడానికి జస్ట్, ఇదే కారణం… […]
రాజకీయ తాంత్రికుడు ప్రశాంత్ కిషోర్… మంత్రాలు మానేస్తే ఎవరొప్పుకుంటారు..?!
(ఎస్. రాము)……………. క్రూరత్వానికి, పైశాచికత్వానికి, టక్కుటమార గజకర్ణ గోకర్ణ జిత్తులకు ఆలవాలమైన ఆధునిక రాజకీయాల్లో కొన్ని సంఘటనలు అనుకోకుండా శాశ్వతత్వాన్ని సాధిస్తాయి. అలాంటిదే… కింగ్ మేకర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డిసెంబర్ 21, 2020 లో చేసిన ఒక ట్వీట్. ఒక పక్క, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను కూల్చి పాగా వేయాలని కత్తులు కటార్లు నూరుతుంటే, వంగ దేశంలో కమల వికాసం […]
చివరకు పీకే కూడా..! రూపాయి జీతం అంటేనే ప్రపంచంలోకెల్లా బిగ్గెస్ట్ జోక్…
అది అసలే కాంగ్రెస్ ప్రభుత్వం… ఏదయినా చేయగలదు… కానీ పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎన్నికల స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిశోర్ అంగీకరిస్తే మటుకు ఆయన నైతికంగా ఓ వంద మెట్లు దిగిపోయినట్టే..! విషయం ఏమిటయ్యా అంటే… గత ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం కోసం పీకే టీం పనిచేసింది కాబట్టి, పార్టీ గెలిచింది కాబట్టి, వచ్చే ఎన్నికల్లో కూడా పీకే టీంతో ‘‘ఎన్నికల పని’’కి ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం అమరీందర్‌సింగ్ నిర్ణయం తీసుకున్నారట… ఏకంగా కేబినెట్ హోదా […]
పొద్దున జగన్‌తో… సాయంత్రం కేటీయార్‌తో… అసలు కథ వేరే ఉంది…
ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ ఓనర్ ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్‌ను కలిశాడు… ఇదీ వార్త… కలిశాడు అనేదే పత్రికలకు తెలుసు, ఎందుకో తెలియదు… కాబట్టి ఏదో తోచింది వండుకోవాలి… అందుకని స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక గురించి చర్చించారని గబగబా రాసేసుకున్నాయి పత్రికలు… అలాగే జగన్ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం చర్చించారని కూడా రాసుకున్నాయి… హహహ… అసలు కథ చాలా పెద్దగా ఉంటుంది… వివరాల్లోకి వెళ్దాం… ఇది పాత ఫోటో, ఫైల్ ఫోటోయే […]