నిజమే… నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సొంత ఆస్తి… తను పబ్లిష్ చేసే కాగితాలే కాబట్టి తన కీర్తనలు, తన భజనలే ఉంటాయి… సహజం, వేరే వాళ్లను మెచ్చుకుంటే అది తనకుమాలిన ధర్మం అవుతుంది కదా… అందుకని పత్రికకన్నా కరపత్రికగానే నడిపిస్తారు దాన్ని… చదివేవాడికీ అదే క్లారిటీ ఉంది… పైగా కేసీయార్ కీర్తికాంత ప్రియుడు కాబట్టి కీర్తనలను మహా ఇష్టపడతాడు… బీఆర్ఎస్ శ్రేణులు చేసే పాలాభిషేకాల దగ్గర్నుంచి స్తుతిస్తోత్రాల దాకా ఎంజాయ్ చేస్తాడు… సరే, అదంతా ఆయనిష్టం… […]
ఇలేకరుల ఇజ్జత్ తీసుడు తప్పితే ఏం ఒరగబెట్టినవో చెప్పు..!?
Shankar Rao Shenkesi………. ఏం జేసినవో చెప్పు!? ‘బక్క పల్సటి ప్యాదోన్ని..’ అంటూ నువ్వు బహిరంగ సభలల్ల మాట్లాడుతుంటే మా అసంటోనివేనని మస్తు ఖుష్ అయ్యేటోళ్లం ‘తెలంగాణ వచ్చుడో.. నేను సచ్చుడో..’ అని నువ్వు స్టేజీలపైన గర్జిస్తాంటే గొంతు కలుపుతూ బిగి పిడికిళ్లను గాలిలోకి ఎత్తెటోళ్లం నువ్వు లేసి ఉర్కినప్పుడు కలాలు చేబూని నీ యెంట ఉరికొచ్చినం నువ్వు కారణం చెప్పకుండా పన్నప్పుడు ఎప్పుడు లేస్తవోనని కన్నార్పకుండా ఎదురుచూసినం ఉద్యమంల హీరోగ ఎత్తిపట్టినం ప్రజలల్ల పల్సన కాకుండా […]
అవసరానికి మరఠ్వాడా మీడియా… ‘అవసరం లేని’ హైదరాబాద్ మీడియా…
మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్‌ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చే రూ.5 కోట్లు హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు చేయడానికే రూ.5 లక్షల కేటాయింపు మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లోనూ భారీగా యాడ్స్ మరఠ్వాడాలో హాట్‌టాపిక్‌గా గులాబీసభలు ……… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ… పైన ఉన్న డెక్స్ చదివితేనే అర్థమైపోయిందిగా స్టోరీ సారాంశం ఏమిటో… మరఠ్వాడా ఏరియాలో సభల […]
ముగ్గురు సీఎంలూ గౌహతి జైలుకే… ఆంధ్రజ్యోతి వార్తల్లోని తీవ్రతతో షాక్…
ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… […]
ఏ ఆంధ్రుల మీద ద్వేషపు సెగల్ని రాజేశామో… వాళ్లనే ఉద్దరిద్దాం రండి అర్జెంటుగా…
రోజురోజుకూ కేసీయార్ వ్యవహారశైలి, ఆలోచనలు అన్నీ దారితప్పుతున్నయ్… తెలంగాణ స్పూర్తిని దాటేసి, పక్కదోవలు పడుతున్నయ్… తెలంగాణ ప్రేమికులకు చిరాకు తెప్పిస్తున్నయ్… విశాఖ ఉక్కు ప్లాంటుపై కేసీయార్ తాజా ఆలోచనల బాట కూడా అదే… నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలా… విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం సంకల్పించిన విషయం తెలుసు కదా… ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలిచింది… అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఆసక్తిని అధికారికంగా సబ్మిట్ చేయడం… తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనాలని ఆలోచిస్తోంది అనేది […]
కేసీయార్ దగ్గర అంత భారీ ధనం ఉందా..? రాజదీప్ వ్యాఖ్యలతో ప్రబలే ప్రచారమేంటి..?
ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… మోడీ వర్సెస్ ఆల్ అనే […]
నమస్తే ఆంధ్రప్రదేశ్..! నాటి తెలంగాణ ఉద్యమనేత పెట్టే ఆంధ్రా పత్రిక..!!
ఒక పత్రిక, ఒక టీవీ చానెల్ వోట్లు సంపాదించి పెట్టగలదా..? ప్రొఫెషనల్‌గా నడిపిస్తూనే, ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గుజూపితే ఏమో గానీ, పూర్తిగా పార్టీ రంగు పూసి, జనంలోకి వదిలితే, డంప్ చేస్తే ఆ పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందా..? పోనీ, ప్రత్యర్థుల దుష్ప్రచారానికి కౌంటర్ సమర్థంగా ఇవ్వగలరా..? కేవలం ఓ పార్టీ వాయిస్‌గా మిగిలిపోతుందా..? నమస్తే తెలంగాణకు పత్రికకు అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీ, అనగా కేసీయార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఓ దినపత్రికను స్టార్ట్ […]
పెద్ద పత్రికల ‘ఆత్మ’హత్య… వీసమెత్తు ప్రొఫెషనలిజం కూడా కరువైంది…
పాలక స్థానంలో ఉన్న వ్యక్తి నోటి వెంట ఏ మాట వచ్చినా… దానికి ఓ సాధికారత ఉండాలి, విలువ ఉండాలి, అదొక డాక్యుమెంట్‌లా ఉండాలి, మళ్లీ పదే పదే మారకుండా ఉండాలి, అన్నింటికీ మించి అది నిజమై ఉండాలి… ఇదే కేసీయార్‌కు నచ్చనిది… ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, కరోనా- పారాసెటమాల్ వైద్యంలాగా..! మామూలు జనానికి అర్థం కాకపోవచ్చుగాక, కానీ చదువుకున్నవాళ్లకు, ఆలోచించగలిగేవాళ్లకు ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది… తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవ్… అని మొన్న ఎక్కడో […]
ఆంధ్రజ్యోతి చింతించింది సరే… అర్థం కానిది తప్పెలా జరిగిందని…
నిజానికి ఆంధ్రజ్యోతి రూట్ వేరు… తప్పు దొర్లితే దొర్లనీ… పొరపాటు జరిగితే జరగనీ… పాత్రికేయం అంటే అదేమైనా కంప్యూటర్ ప్రోగ్రామా..? నిర్దేశిత మార్గంలో వెళ్లడానికి..? హ్యూమన్ ఎర్రర్స్, అనగా మానవతప్పిదాలు ఉంటయ్… సహజం అన్నట్టుగా ఉంటుంది దాని వైఖరి… నిజానికి పత్రికలో ఏవైనా తప్పులు దొర్లితే, కాదు, పొరపాట్లు చోటుచేసుకుంటే హుందాగా పాఠకులను క్షమించమని అడగడం, చింతిస్తున్నామని చెప్పడం మంచి లక్షణం… కానీ… ఇప్పుడు పత్రికల అవసరాలు వేరు… తాము కొమ్ము కాసే పార్టీలు, నాయకుల కోసం […]