* నేను, మా అమ్మ (నటి లక్ష్మి) గొడవపడుతూ ఉన్నామని, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంతా అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. మేము బాగానే ఉన్నాం! మేం కలిసే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లేదు కాబట్టి అలా అనుకుంటున్నారా? * అమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అందుకు కారణం కూడా ఉంది. ఒకసారి నేను, అమ్మ, మా అమ్మ భర్త (Step Father) కలిసి ఒక […]
పొన్నియిన్ సెల్వన్-2… కొనేవాడు లేడు… తెలుగులోనూ పూర్ రెస్పాన్స్…
పొన్నియిన్ సెల్వన్ సినిమాపై మొత్తం ప్రపంచవ్యాప్త తమిళజనం ప్రేమ కురిపించింది… ఓన్ చేసుకుంది… సినిమా బాలేదంటే తగాదాలు పెట్టుకుంది… కారణం, అది తమిళంలో ప్రసిద్ధిపొందిన ఓ నవలకు సినిమారూపం… మొత్తం నవలను రెండు భాగాల సినిమా నిడివికి కుదించడమే పెద్ద టాస్క్… ఆ పనిని మణిరత్నం విజయవంతంగా చేయగలిగాడు… అంతేకాదు, హిందీ మార్కెట్ కోసం ఐశ్వర్యా రాయ్‌ను తీసుకున్నాడు… (అఫ్ కోర్స్, ఐశ్వర్య పట్ల మణిరత్నానికి అభిమానం ఎక్కువ…) కార్తి, విక్రమ్, త్రిష, ఇంకో తమిళ ఐశ్వర్య […]
ఫాఫం మణిరత్నం… తెలుగు వాళ్లు ఇంత బలంగా రిజెక్ట్ చేస్తారనుకోలేదు…
గత వారం బార్క్ రేటింగ్స్ చూస్తే ఒక్క విషయంలో ఆశ్చర్యమేసింది… అది పొన్నియిన్ సెల్వన్‌కు వచ్చిన రేటింగ్స్… నిజానికి ప్రేక్షకులు టీవీల్లో సినిమాలు చూడటం గణనీయంగా తగ్గిపోయిన మాట వాస్తవం… ఆ యాడ్స్ భరిస్తూ, అదే టైంకు టీవీ ముందు కూర్చోవడం చాలామందికి నచ్చడం లేదు… అందుకే సినిమాలకు జీఆర్పీలు చాలామేరకు పడిపోయాయి… 10 జీఆర్పీలు వస్తే అది టీవీలో సూపర్ హిట్ కింద లెక్క… కానీ పొన్నియిన్ సెల్వన్‌కు వచ్చిన జీఆర్పీలు ఎంతో తెలుసా..? 2.11 […]
పొన్నియిన్ సెల్వన్-2 నిరవధిక వాయిదా… మణిరత్నంలోనే అసంతృప్తి…
ముందుగా అనుకున్నదే… పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ తమిళంలో తప్ప ఎక్కడా ఆడదని..! కారణం మణిరత్నం ఉన్నదున్నట్టుగా తమిళ ప్రైడ్ అన్నట్టుగా సినిమాను తీశాడు… ఎప్పటిలాగే ఇతర భాషల డబ్బింగ్ నాణ్యత పట్టించుకోలేదు, ఎస్, తమిళులకు అది గొప్ప చరిత్ర… అందులో కాల్పనికత కూడా ఉంది… ఫేమస్ తమిళ్ రైటర్ కల్కి కృష్ణమూర్తి పలు భాగాలుగా రాసిన పొన్నియిన్ సెల్వన్ నవలలోనే మూడునాలుగు సినిమాలకు సరిపడేంత సరుకుంది… కానీ అది ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రజలకే ఎక్కదు, […]
పొన్నియిన్ సెల్వన్ సినిమా కథ ఇదే… చదవగానే సమజైతే మీరు గొప్పోళ్లు…
పొన్నియిన్ సెల్వన్ దాదాపు రెండువేల పైచిలుకు పేజీలున్న ఐదు భాగాల నవల.అందులో ప్రదేశాలు, పాత్రల పేర్లు అరవ వాసనతో ఉంటాయి. మొదట్లో చాలా గందరగోళంగా ఉంటుంది. సెప్టెంబర్ 30న ఈ సినిమా వస్తోంది కాబట్టి ఈ కథ టూకీగా, గుట్టు విప్పకుండా చెప్పే చిన్న ప్రయత్నం ఇది… ఒక్క ముక్కలో చెప్పాలంటే చోళ సింహాసనం కోసం జరిగే కుట్ర, చోళవంశాన్ని సమూలంగా నాశనం చేసి పాండ్యరాజ్యాన్ని పునరుద్ధరించాలని చూసే ఒక వర్గం, తన పగ తీర్చుకోవడానికి చోళరాజ్యంలోనే […]
మొదటికొచ్చింది టికెట్ ధరల కథ… మళ్లీ పెంచిపారేశారు…
దిల్‌రాజు బాగా ఆశపోతు… ఈమధ్య కొన్ని సినిమాలతో దవడలు వాచిపోయాయి కదా, ఇప్పుడిక పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ఇంతకింతా తీసుకోవాలని అనుకుంటున్నాడు… అందుకే హైదరాబాద్‌లో ఈ సినిమా టికెట్ రేట్లను అడ్డగోలుగా పెంచిపారేశాడు… మొన్నమొన్నటిదాకా పలు సినిమాల నిర్మాతలు ‘‘మేం టికెట్ల ధరలు తగ్గించాం, వచ్చి చూడండి, థియేటర్లకు రండి ప్లీజ్’’ అని ప్రచారాలు చేసుకున్నారు కదా… జనం థియేటర్లకు రాకపోవడానికి టికెట్ల ధరలే ప్రధాన కారణమని విశ్లేషణలు చేశారుగా… పూర్తి కంట్రాస్టుగా ఇదీ దిల్‌రాజు యవ్వారం… […]
పెద్దత్తకు భర్తా… రాచ్చస మావయ్యా… తెలుగు ప్రేక్షకులపై ఇనుప గుగ్గిళ్ల వాన…
మనకు అలవాటైన భాషలో… బాణీకి సరిపడా అందమైన పదాల పొదగడం ఎవరైనా చేయగలరు… యూట్యూబ్ పుణ్యమాని ఊరికిద్దరు పుట్టుకొచ్చారు… ఏక్‌సేఏక్… అవీ జానపదాలు, ఆధునికాలు, మిశ్రమాలు, కాలుష్యాలు, విషాలు, కషాయాలు… నానా రకాలు… కానీ అచ్చమైన తెలుగు పదాల అల్లిక ఓ రిథమ్‌లో వినిపిస్తూ అలరిస్తాయి, రక్తికడతాయి… ఎటొచ్చీ ఏదేని పరభాష గీతానికి అనువాదం రాయడమే అతి పెద్ద పరీక్ష, ఏ గీత రచయితకైనా… ప్రత్యేకించి తమిళ గీతాలు మరీ ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం టైపు… […]
అరవంలో పొన్నియిన్ సెల్వన్ వోకే… అన్య భాషల ప్రేక్షకులు జుత్తు పీక్కోవాల్సిందే…
పొన్నియిన్ సెల్వన్… ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న సినిమా పేరు… బ్రహ్మాస్త్రంకు 400 కోట్లు పెడుతున్నారంటేనే అబ్బురపడుతున్నాం కదా… పొన్నియిన్ సినిమాకు మరో 100 కోట్లు ఎక్కువే… అన్నింటికీ మించి ఇది మణిరత్నం కలల ప్రాజెక్టు… ట్రెయిలర్లు చూస్తేనే అర్థమవుతోంది అదెంత గ్రాండియర్‌గా ఉందో… అఫ్కోర్స్, ఇప్పుడు దేశంలో ఉన్న దర్శకుల్లోకెల్లా దృశ్యచిత్రీకరణలో మణిరత్నం అంటే మణి, రత్నం… అంతే… వంక పెట్టడానికి వీల్లేదు… సహజంగానే ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది… విక్రమ్, జయం రవి, […]