అప్పుడెప్పుడో నువ్వేకావాలి అనే సినిమా వచ్చింది ఉషాకిరణ్ మూవీస్… ఎదురెదురు ఇళ్లలో ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… కలిసి చదువుకుంటారు… అల్లరి సరేసరి… దాపరికాల్లేవు… తమ నడుమ ఉన్నది ఉత్త స్నేహం కాదనీ, అది ప్రేమేనని తెలిసి ఒక్కటయ్యే కథే సినిమా… పాటలు బాగుంటయ్, కథనం సరదాగా సాగుతుంది… తరుణ్, రిచాల జంట బాగుంటుంది… వెరసి సినిమా అప్పట్లో సూపర్ హిట్… సీన్ కట్ చేయండి… తిరు అనే సినిమా ఒకటి రిలీజైంది… ధనుష్ హీరో, నిత్యా […]
ఈ నలుగురూ… నేపథ్యాలు, సంస్కృతులు వేర్వేరు… ఇంట్రస్టింగ్ పోలికలేంటంటే..?!
రష్మిక మంథన కొత్త సినిమా సీతారామం ప్రమోషన్‌కు సంబంధించిన ఒక వీడియో చూస్తుంటే… ఆశ్చర్యం వేసింది… అచ్చం తెలుగింటి స్త్రీలాగే… ఫ్లూయెన్సీ మాత్రమే కాదు… కొన్ని పదాలు, ప్రత్యేకించి కొన్ని క్రియాపదాల్ని తెలుగువాళ్లలాగే ల్యాండ్ చేయడం వేరే భాషీయులకు కష్టం… తెలుగు నేర్చుకోవడానికి రష్మిక చూపే శ్రమ నచ్చింది… ఇంకా తడబాట్లున్నా సరే, ఇప్పుడున్న పాపులర్ హీరోయిన్లందరిలోనూ… ఎహె, ఇన్నాళ్లూ గొప్ప పేరు వెలగబెట్టిన పెద్ద పెద్ద ప్రముఖ హీరోయన్లకన్నా చాలా చాలా బెటర్… ఒక నటి […]