. ఎస్, నిజమే… ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీటిన దాంతో పూర్తిగా ఏకీభవిద్దాం… ‘‘కొందరు సెలబ్రెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు… కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు… ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు… కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు […]
రజనీకాంత్ తెలివైన వ్యాపారి… ఇదో రకం ప్రమోషన్..!
rajnikanth knows how to prompote his movies
ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!
రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]
ఫాఫం… అంతటి రజినీకాంత్ సినిమా మీదా ఆసక్తి చూపని ప్రేక్షకజనం…
ఒక హిందీ జాకీష్రాఫ్, ఒక కన్నడ శివరాజకుమార్, ఒక మలయాళ మోహన్‌లాల్… వీళ్లకు తోడుగా తమిళ సునీల్… హీరో రజినీకాంత్… కథంతా తన చుట్టే గిరగిరా… రా రా రావాలయ్యా కావాలయ్యా అంటూ నడుమూపుళ్ల తమన్నా… పాన్ ఇండియా లుక్కు… సో కాల్డ్ మాస్ కమర్షియల్ వాసనలు… అదే… జైలర్ సినిమా… వందల కోట్లు వసూలు చేసినట్టు తెల్లారి లేస్తే బోలెడు అంకెలు… రికార్డుల ప్రకటనలు… కానీ ఏం జరిగింది..? టీవీల్లో ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్స్ […]
రజినీ మాట్లాడిందే సొల్లు… ఆ స్పాట్ కవరేజీలో కూడా ఎవడి బాకా వాడిదే…
మీడియా అంటే… తాము ఎవరి పల్లకీ మోస్తున్నారో, వారికి అనుగుణంగా వార్తల్ని మలుచుకుని, ప్రజల్లోకి ఆ పైత్యాన్ని ప్రసారం చేయడం… ప్రచారం చేయడం… జనం బుర్రల్లోకి ఎక్కించడం…! ఇంతకుమించి మీడియా ఏదో చేస్తుందనీ, సొసైటీ బాగుకు ఉపయోగపడుతుందనీ, సమాచార దీపికలు అనీ ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది… ప్రత్యేకించి తెలుగు దినపత్రికల సంగతి కొంత తెలుసు కదా… నమస్తే తెలంగాణ కేసీయార్ డప్పు… సాక్షి జగన్ చిడుత… ఆంధ్రజ్యోతి, ఈనాడు చంద్రబాబుకు మృదంగాలు… వెలుగు మోడీ […]
ఓహో… సెలబ్రిటీలకు ప్రత్యేక హక్కులా..? హబ్బ.., ఏం చెప్పావు బ్రదర్..?!
రజినీకాంత్కు మస్తు కోపమొచ్చింది… ఒరేయ్, నా అనుమతి లేకుండా, నాకు డబ్బు ఇవ్వకుండా నా పేరు వాడుకుని కమర్షియల్ ప్రచారాలు చేసుకుంటారా..? ఎంత ధైర్యం..? అంటూ ఊగిపోయాడు… బులావ్ లాయర్… తక్షణం లాయర్ సుబ్బయ్య ఎలంబర్తి ఆయన దగ్గర వాలిపోయాడు… ముందుగా పబ్లిక్ నోటీస్ ఇద్దాం సార్ మీ పేరిట… తరువాత వినకపోతే పర్టిక్యులర్ వ్యక్తులు, సంస్థల మీద యాక్షన్ తీసుకుందాం అన్నాడు లాయర్… సరేలే అన్నాడు రజినీకాంత్… ఇంకేముంది..? ఓ జనరల్ పబ్లిక్ నోటీసు జారీ […]