Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!

June 3, 2025 by M S R

revanth

. ఎస్, విమర్శించాల్సిందే రేవంత్ రెడ్డిని… కవిత గానీ, హరీష్ గానీ, కేటీయార్ గానీ, నమస్తే తెలంగాణ గానీ… కేసీయార్ ఎలాగూ బయటికి రావడం లేదు, యాక్టివ్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి ఆయన్ని కాస్త పక్కన పెడితే… తప్పకుండా రేవంత్ రెడ్డిని విమర్శించాలి… ప్రతిదీ రాజకీయం చేయడం కాదు, విమర్శ అవసరమైన చోట్ల… ప్రజలకు ఉపయోగపడాల్సిన చోట్ల.., అనాలి, అనడానికే కదా, తప్పులు ఎత్తిచూపడానికే కదా వాళ్లను ప్రతిపక్ష పాత్ర పోషించాలని జనం తీర్పు చెప్పింది… సో, […]

ఆడపిల్లలకు తీయటి స్కీమ్… కర్నాటకలో రద్దు, తెలంగాణలో స్టార్ట్…

May 29, 2025 by M S R

chikki

. చిక్కీ..! దాన్నే తెలంగాణలో పల్లీపట్టి అంటాం… అత్యంత బలవర్ధకమైన క్యాండీ… ఇప్పుడు దీని గురించి కాస్త చెప్పుకోవాలి మనం… ఎందుకంటే..? ఇందిరమ్మ అమృతం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తోంది… ఇంట్రస్టింగు… దీని ఉద్దేశం ఏమిటంటే..? రాష్ట్రంలోని 14 -18 ఏళ్ల వయస్సున్న కౌమార బాలికలకు రోజుకు ఒక చిక్కీ చొప్పున అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తారు… అబ్బే, ఏముంది ఇందులో..? ఇదొక పథకమా..? రోజుకొక చిక్కీ బాలికలు కొనుక్కోలేరా అనేది […]

వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!

March 27, 2025 by M S R

revanth

. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్‌, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]

రేవంత్ రెడ్డితో ది గ్రేట్, తోపు రాజదీప్ సర్దేశాయ్ డొల్ల ఇంటర్వ్యూ…

March 8, 2025 by M S R

rajdeep

. జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయి ఇండియాటుడే కాన్‌క్లేవ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన విధానం పేలవంగా అనిపించింది… తను సగటు యూట్యూబ్ ఇంటర్వ్యూయర్ స్థాయిలో కూడా ప్రశ్నలు వేయలేక, జవాబులు చెప్పించలేక చేతులు ఎత్తేసినట్టు అనిపించింది… రేవంత్‌రెడ్డికి ఒక్కటి కూడా ఇరుకునపెట్టగల ప్రశ్న వేయలేకపోయాడు… ఏవో కొన్ని వేయాలని ప్రయత్నించినా సరే, రేవంత్‌రెడ్డి అలవోకగా అసంబద్ధ సమాధానాలు ఇస్తూ, దాటవేస్తూ, జవాబుల్ని ఎటెటో తీసుకుపోతున్నా సరే రాజదీప్ నుంచి విలువైన అనుబంధ ప్రశ్నలే కరువయ్యాయి… ఉదాహరణకు… […]

ఫాఫం రేవంత్ సర్కారు..! పాజిటివ్ రిజల్ట్ బదులు ఉల్టా నెగెటివిటీ..!!

February 6, 2025 by M S R

telangana congress

. నిజమే… తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వవర్గాల్లోనే ఓ చర్చ సాగుతోంది… ఎలాగూ అవకతవక పాలన విధానాలతో ప్రభుత్వం మీద క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది… బీఆర్ఎస్ ప్రతి ఇష్యూను అవకాశంగా తీసుకుంటూ ముప్పేట దాడి చేస్తోంది… మీడియా, పాలిటిక్స్, ఎత్తుగడలు, గాలి పోగేసి రాద్ధాంతం, సోషల్ మీడియా, మీమ్స్, రీల్స్… వాట్ నాట్..?  ప్రభుత్వ పనితీరు, విధానాల మీద ఒక ప్రతిపక్షం ఎలా దూకుడుగా విరుచుకుపడొచ్చో హరీష్, కేటీయార్ చేసి చూపిస్తున్నారు… కేసీయార్ ఫామ్ హౌజు దాటని రాజనీతిజ్ఞరాహిత్యం […]

రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, సేఫ్ జోన్… ఏమిటీ ఎమ్మెల్యేల కేటగిరీలు..!?

January 6, 2025 by M S R

revanth

. ముందుగా ఓ వార్త,… రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై థర్డ్ పార్టీ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి… సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు… రెడ్ జోన్లో ఉన్న […]

రేవంత్‌రెడ్డి పోలీసు అడ్డాలో, పోలీసు భాషలోనే క్లియర్‌గా చెప్పాడు..!!

December 28, 2024 by M S R

dil raju

. రాజు- దిల్ రాజు…… నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి… తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ… నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్ళు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజసిద్ధమైన పద్ధతిలో […]

సీఎం సెక్యూరిటీలో లోపాలు… అపరిచితులు సీఎం దాకా వచ్చేస్తున్నారు…

September 12, 2024 by M S R

revanth

రేవంత్ రెడ్డి ఎడాపెడా మీటింగుల్లో పాల్గొంటున్నాడు… జనంలో తిరుగుతున్నాడు… కానీ ఒక ముఖ్యమంత్రి చుట్టూ తప్పకుండా కనిపించాల్సిన భద్రతా వ్యూహాల్లో మాత్రం లోపాలు కనిపిస్తున్నాయి… నిర్లక్ష్యం చేయదగని లోపాలు… ఉదాహరణకు… మొన్న హైదరాబాద్‌, రవీంద్రభారతిలో ఓ పోగ్రాం… ఎన్నో ఏళ్లుగా వెయ్యి మంది జర్నలిస్టులు ఎదురుచూస్తున్న స్థలం అప్పగింత కార్యక్రమం… జర్నలిస్టు సర్కిళ్లలో రేవంత్ రెడ్డి పట్ల, మంత్రి పొంగులేటి పట్ల పాజిటివిటీని పెంచిన నిర్ణయం, చర్య… ఆ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు చాలామంది భార్యాపిల్లలతో సహా […]

ఇదుగో ఇలాంటి విషయాల్లోనే రేవంత్ సర్కారు బదనాం అయ్యేది

July 14, 2024 by M S R

pension

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓవరాక్షన్ చేసే అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తమకే రాజకీయంగా నష్టం వాటిల్లజేస్తోంది… ఇంకా దీన్ని సమీక్షించుకున్నట్టు లేదు… అసలే బీఆర్ఎస్, ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉంది… ఉన్నవీ లేనివీ రచ్చ చేసి, గాయిగత్తర లేపడంలో ఆ పార్టీ నాయకులు సిద్ధహస్తులు… కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు… మొన్న కేటీయార్ ఒక ట్వీట్ చేశాడు… పక్షపాతంతో బాధపడే ఓ 80 ఏళ్ల ముసలామె పెన్షన్‌ను రికవరీకి ప్రభుత్వం నోటీసు ఇచ్చిందని […]

వాళ్లెవరు..? ఆ అరాచక శక్తులపై రేవంత్‌రెడ్డి యాక్షన్ ఎందుకు వద్దు..?!

June 28, 2024 by M S R

revanth

నిన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ కొన్ని వివరాలు చెప్పాడు కదా… ఈరోజు ఆంధ్రజ్యోతిలో తప్ప వేరే పత్రికల్లో రిపోర్ట్ అయినట్టు కనిపించని కొన్ని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి… సరే, రాజకీయంగా బీఆర్ఎస్ నుంచి తమ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను సమర్థించుకున్నాడు… తప్పదు… అలాంటోళ్ల మీద వెంటనే అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్ఎస్ ఎంత గాయిగత్తర చేస్తున్నా ఆ ప్రయాసకు, ఆ డిమాండ్లకు అసలు విలువ లేదు… ఎందుకంటే..? నిజంగానే తెలంగాణలో మునుపెన్నడూ లేని […]

ఒక సీఎంగా గుంపు మేస్త్రీ పనెలా ఉంది..? కేసీయార్‌కు ఏమిటి భిన్నం..?

May 24, 2024 by M S R

revanth

ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చాన్నాళ్ల తరువాత అనుకోకుండా మాట్లాడుతుంటే, తను గమనిస్తున్న కొన్ని విషయాలు చెప్పాడు… ఇంట్రస్టింగ్ అనిపించాయి… కొన్ని ముఖ్యాంశాలు… ‘‘రేవంత్‌రెడ్డిని అందరూ గుంపు మేస్త్రీ అని వెక్కిరిస్తున్నారు కదా, నిజానికి ఆ పదం సీఎం పనికి కరెక్ట్ ఆప్ట్… అదే గుంపు మేస్త్రీ ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నాడో పక్కన పెట్టండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో మనకు ప్రధానం… నాకు తెలిసి ఒక దశలో కేసీయార్ దగ్గర పెండింగ్ […]

రాహుల్ సభకు ఏమిటీ పూర్ రెస్పాన్స్..? ఏదో తేడా కొడుతున్నట్టుంది..!!

May 9, 2024 by M S R

hyd

ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… హైదరాబాద్‌లో రాహుల్ సభకు జనం లేకపోవడం ఖచ్చితంగా కాంగ్రెస్ ఆత్మసమీక్ష అవసరమని తెలియజెబుతోంది… రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఏమైనా ప్రయత్నాలా..? ఈ ఎన్నికల్లో సరైన సీట్లు రాకపోతే తనను బలిపెట్టాలనే ఆలోచనలా..? సభాస్థలికి జనం రాకపోవడంతో చాలాసేపు రాహుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది… జన సమీకరణ దాకా ఎందుకు..? నగరంలోని కేడర్ సరిగ్గా హాజరైతే చాలు కదా సభాస్థలి నిండుగా కనిపించడానికి… నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ, మెదక్ ప్రాంతాల్లో […]

లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్‌ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…

April 3, 2024 by M S R

aj rk

గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]

ఆ కేసీయార్ హిస్టరీని రిపీట్ చేయడం రేవంత్‌కు ఎందుకు తప్పనిసరి..!!

March 20, 2024 by M S R

Revanth reddy

2014… కేసీయార్‌కు అత్తెసరు మెజారిటీయే… తెలుగుదేశం, కాంగ్రెస్ ఏవో కుట్రలు పన్ని, తెలంగాణ ఏర్పాటుకు ఓ విఫల ప్రయోగంగా చేస్తాయనే భయం కూడా ఉండింది… కేసీయార్ గేట్లు ఎత్తాడు… నిలబెట్టి ఒక్కొక్కరికి ఏం కావాలో అడిగి మరీ అప్పటి టీఆర్‌ఎస్‌లోకి లాగేసిండు… ఒక్క కాంగ్రెసో, ఒక్క తెలుగుదేశమో కాదు… టీడీపీ 12, కాంగ్రెస్ 5, వైసీపీ 3, సీపీఐ ఒకటి, బీఎస్పీ ఇద్దరు… గేట్లు దాటి జంప్… ఎందుకు..? ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడం… ఎలాగూ ప్రజెంట్ రాజకీయాల్లో […]

హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!

March 19, 2024 by M S R

modi

1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]

మళ్లీ కొత్తగా అదే ప్రొసీజర్…? ఆ ఇద్దరికే ఎమ్మెల్సీలుగా మళ్లీ చాన్స్..!

March 8, 2024 by M S R

mlc

కోదండరాం‌ను రేవంత్ కావాలనే బకరా చేశాడనే పిచ్చి విమర్శ ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది… తప్పు… హైకోర్టులో ఉన్న కేసు తీర్పు ఎలా వస్తుందో రేవంత్ ప్రభుత్వ ముఖ్యులకు ఆల్రెడీ ఓ ఐడియా ఉంది… గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆమె కేబినెట్ నిర్ణయాలను తప్పకుండా ఆమోదిస్తుందనే నమ్మకం, అనుభవమూ ఉన్నాయి… సో, కోదండరాంతోపాటు జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలనే నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించింది ప్రభుత్వం… ఆమె వెంటనే ఆమోదముద్ర […]

నాడు తొడలు గొట్టి సవాల్ విసిరాడు… ఇప్పుడు ఆ తొడలే విరిగిపోతూ కాళ్లబేరం..!!

March 7, 2024 by M S R

mallareddy

మల్లారెడ్డి… ఈ పేరు తెలియని వాళ్లు లేరు, ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు… పాలమ్మి, పూలమ్మి వేల కోట్లు, ఎంత ఆస్తి ఉందో తనకే తెలియనంత సంపద పోగేసిన పేరు… నిజం చెప్పాలంటే జస్ట్, అలా పాలు అమ్మి, పూలు అమ్మి ఇంత డబ్బు గడించిన కథ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సక్సెస్ స్టోరీ అవుతుందేమో… తన చరిత్ర తవ్వుతూ పోతే ఎన్ని పెంకాసులో, ఎన్ని రత్నాలో సంక్షిప్త వివరణ అసాధ్యం గానీ… విజ్ఞత, పరిణతి, హుందాతనం వంటి […]

జర్నలిస్టులు స్వేచ్ఛ అనుభవించారట… హరీష్‌రావు వింత విమర్శలు…

March 6, 2024 by M S R

రేవంత్

ప్రజా పాలనలో పెన్నులు గన్నులు ఐయ్యాయి… మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా… అన్ని ఫ్లోర్ లు స్వేచ్చ గా తిరిగేవారు జర్నలిస్ట్ లు… విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదు సచివాలయంలోకి……. ఈ మాట అన్నది మాజీ మంత్రి, కేసీయార్ కుటుంబసభ్యుడు, బీఆర్ఎస్ ప్రధాన నేత హరీష్ రావు… కొంతమేరకు ఆచితూచి, కాస్త మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని పేరున్న హరీష్‌ను కూడా ఓరకమైన ఫ్రస్ట్రేషన్ ఆవరిస్తున్నట్టుంది… నిజంగా తన విమర్శ చూసి జర్నలిస్టులందరూ నవ్వుకునేలా ఉంది… పెన్నులు-గన్నులు అనే వ్యాఖ్యను నవ్వుకుని […]

పీఎంగా మోడీ వేరు… బీజేపీ మోడీ వేరు… రేవంత్ గీసుకున్న ఓ విభజన రేఖ…

March 4, 2024 by M S R

revanth

రేవంత్ మంచి స్ట్రాటజిస్టు..! వేదిక మీద మోడీకి అభివాదం చేసి, తన ప్రసంగంలో కూడా నాలుగు సానుకూల వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద సోషల్ మీడియాలో కనిపించిన ఓ వ్యాఖ్య ఇది… ‘మోడీతో సత్సంబంధాలు’ అనే కోణంలో రేవంత్‌రెడ్డి ధోరణి ఏమిటనే ప్రశ్నకు ఎవరి బాష్యాలు వారికి ఉండవచ్చుగాక… కానీ ఒక్కసారి స్థూలంగా పరిశీలిద్దాం… రేవంత్‌రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి… నరేంద్రమోడీ ఈ దేశానికి ప్రధాని… ప్రధానిని ముఖ్యమంత్రులు కలవాలి, అడగాలి, సాధించాలి,.. కేంద్రం- […]

అంత స్పీడ్ రియాక్షనా… సీఎం రేవంత్ వీడియో బిట్ ఒకటి వైరల్…

December 11, 2023 by M S R

revanth

ఒక టీవీ స్క్రోలింగ్ చాలా ఆశ్చర్యపరిచింది… కేసీయార్‌ను నేడో రేపో డిశ్చార్జ్ చేస్తారని ఆ వార్త… హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ జరిగాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు రెస్ట్ అవసరం… కాకపోతే సర్జరీ జరిగాక 12 గంటల తరువాత వాకింగ్ చేయిస్తారనేది కరెక్టే కావచ్చు… కానీ మూణ్నాలుగు రోజుల్లోనే డిశ్చార్జా..? వాళ్ల యశోద హాస్పిటల్ వర్గాలే 6- 8 వారాల రెస్ట్ అని తమ మెడికల్ బులెటిన్‌లో పేర్కొన్నాయి కదా, మరి ఇదెలా..? మిరకిల్..!! అంతేకాదు… […]

  • 1
  • 2
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions