.
దీంట్లో పెద్దగా సందేహించడానికి ఏమీ లేదు… రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకునే గద్దర్ అవార్డులకు ప్రతిఘటన ఇది… టాలీవుడ్ రేవంత్ రెడ్డి పట్ల ఏమాత్రం సానుకూలంగా ఉండటానికి ఇష్టపడటం లేదు… కొత్త పంథాలో తనను ధిక్కరిస్తోంది…
టాలీవుడ్ అంటే జస్ట్, చంద్రబాబు బ్యాచ్… ఇక ఎవరు సీఎం అయినా సరే, దానికి పట్టదు, పట్టించుకోదు, అందరికీ తెలుసు… జగన్, రేవంత్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య… ఎవరైనా సరే, చివరకు రేప్పొద్దున పవన్ కల్యాణ్ సీఎం అయినా సరే టాలీవుడ్ లైట్ తీసుకుంటుంది… పక్కా.,.
Ads
అల్లు అర్జున్ మీద కేసు పెట్టి జైలులోకి పంపించాక… ఆఫ్టరాల్ ఈ సీఎం మా జోలికి వస్తాడా అనే తీవ్ర ఆగ్రహం సినిమా పెద్దల్లో మొదలైంది… బలుపు అనే పదాన్ని ఇక్కడ వాడలేం గానీ రాజకీయ అధికారాన్ని మించి మేం తోపులం అనే ఏదో సరైన తెలుగు పదం తోచని భావన వాళ్లది… అభిమానులు, అట్టహాసాలు, వైభోగాలు, అమ్మాయిలు, విలాసాలు, డబ్బు… తమను తామే దైవాంశ సంభూతులమనే మూర్ఖ భావన…
అల్లు అర్జున్ చట్టానికి అతీతుడా..? బాధ్యతారహితంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు, కేసు సబబే… కానీ టాలీవుడ్ పెద్దలు క్యూలు కట్టి మరీ వెళ్లి పరామర్శించారు… అదేదో రేవంత్ రెడ్డి కక్షకట్టి కేసు పెట్టినట్టు… సరే, తరువాత ఎంతకు, ఎక్కడ రాజీ కుదిరిందనేది వేరే విషయం… కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయ అధికారం పవర్ చూపించాడు… మబ్బుల్లో తిరిగే సోకాల్డ్ తోపు స్టార్లను నేలకు దించాడు…
అది మండుతోంది సినిమా వాళ్లకు… పైగా గద్దర్ అవార్డులు ఇస్తానని చెప్పడం కూడా వాళ్లకు రుచించడం లేదు… ఏనుగు, సింహం, నంది, నెమలి గట్రా పేర్లతో అవార్డులు వోకే… ఒక వ్యక్తి పేరిట అవార్డులు ఏమిటి..? తన నేపథ్యం ఏమిటి..? తనకూ సినిమాలకూ సంబంధం ఏమిటి…? ఎవరిని మెప్పించడానికి సినిమా వాళ్లకు ఆ పేరుతో అవార్డులు..?
ఈ భావన సినిమా వాళ్లలోనే కాదు, తెలంగాణలోని చాలా సెక్షన్ల ప్రజల్లోనూ ఉంది… కానీ బయటపడటం లేదు… సపోజ్, రేప్పొద్దున ఇంకేదో ప్రభుత్వం, పోనీ, బీజేపీ అనుకొండి, అది అధికారంలోకి వస్తుంది, గద్దర్ అనే పేరు తీసేసి, ఇంకో పేరుతో అవార్డులు అంటుంది, గద్దర్ అంటే పడదు కదా… మరి దీనికి ఎండ్ ఏమిటి..?
కేసీయార్, జగన్ హయాంలలో ఏ అవార్డులూ లేవు… కేసీయార్ అంటే భయపడినా సరే, జగన్‌ను తృణీకరించారు సినిమా పెద్దలు… తనేమో కాళ్ల దగ్గరకు రప్పించుకుని దండాలు పెట్టించుకున్నాడు… సో, ఇండస్ట్రీ పెద్దలు కుతకుత… కేసీయార్ ఏదో సింహ అవార్డులు అన్నట్టున్నాడు గానీ, తన కొడుకు కేటీయార్ వాళ్లతో రాసుకుని పూసుకుని తిరుగుతాడు గానీ కేసీయార్ పిచ్చ లైట్ తీసుకునేవాడు వాళ్లను…
ఇప్పుడిక గద్దర్ అవార్డుల విలువ తీసేయడమే సరైన మార్గమని భావించినట్టున్నారు… తామే సొంతంగా అవాార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు తెలుగు ఫిలిమ్ ఛాంబర్ పెద్దలు… గద్దర్ అవార్డుల్ని తిరస్కరించలేరు, అలా చేస్తే టికెట్ రేట్ల పెంపు గట్రా ఉండదు కదా మరి…
అందుకని ఫిబ్రవరి 6, అనగా తెలుగు సినిమా పుట్టిన రోజు అట… ఇక ప్రతిసారీ ఆ రోజున చాంబర్ తనే అవార్డులు ఇస్తుందట… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చే అవార్డులను వద్దనదు, కానీ వాటికి విలువ లేకుండా తమలో తామే అవార్డులు ఇప్పించుకునే నిర్ణయం అన్నమాట…
ప్రత్యేకంగా ప్రతి ఏటా జ్యూరీ ఏర్పాటు చేసి, అవార్డులు ప్రకటిస్తారు… అట్టహాసంగా ప్రోగ్రామ్ నిర్వహించి వాళ్లే అవార్డులు ఇచ్చుకుని, వాళ్లే చప్పట్లు కొట్టుకుంటారు… మూర్ఖాభిమానులు ఎలాగూ ఉంటారు కదా… మరి ఇండస్ట్రీని శాసించే సిండికేట్లు, బడా నిర్మాతలు ఎవరికి చెబితే వాళ్లకే అవార్డులు దక్కుతాయి కదా అంటారా..? ఎస్, నిజమే…
తెలుగు సినిమా పుట్టినరోజున థియేటర్లు, సినిమా ప్రముఖులు ఓ ప్రత్యేక జెండా ఎగరేసుకుంటారట, ఆ జెండా రూపకల్పన బాధ్యతనూ ఎవరికో అప్పగించారు… ప్రతి ఉగాదికి గద్దర్ అవార్డులు అంటున్నారు కదా, అంతుకు ముందే ఫిలిమ్ ఛాంబర్ అవార్డులు ఇస్తారన్నమాట..!! పుష్పరాజ్ తరహాలో ఇంకెవరైనా తోపులు దొరికితే ఇక రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందీ అంటే… జింతాకజితాజితా…!! ఎస్, రేవంత్ రెడ్డి అంటే అంతే..!! అప్పుడిక దిల్ రాజు రాయబేరాలు, రాజీయత్నాలు కూడా ఫలించకపోవచ్చు..!!
Share this Article