Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాడు సరిగమపలో ప్రదీప్ ర్యాగింగ్… నేడు ఇండియన్ ఐడల్‌లో రాకింగ్…

March 11, 2023 by M S R

ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్‌ స్టార్టయింది కదా ఆహా ఓటీటీలో… దానికి చాలా వ్యూయర్ షిప్ ఉంది… థమన్, కార్తీక్ ప్లస్ పాయింట్స్,.. శుక్రవారం రాత్రి థర్డ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు… అమెరికా నుంచి వచ్చిన ఓ గాయని కమ్ డాక్టర్ గోల్డెన్ మైక్ పొంది టాప్ 12 జాబితాలోకి వెళ్లిపోయింది… సిద్దిపేట నుంచి వచ్చిన లాస్య కూడా బాగా పాడింది… అకస్మాత్తుగా ఓ గాయని సింగర్ కార్తీక్‌ను ఆటపట్టిస్తూ… (ఆహా టీం స్క్రిప్టు)… వేదిక మీదకు వచ్చింది… తన పేరు యుతి హర్షవర్ధన…

ఎక్కడో చూసినట్టుంది అనుకుంటుంటే తళుక్కున తట్టింది… ఆమె గతంలో జీతెలుగు సరిగమప షోలో పార్టిసిపెంట్… ఇప్పుడు ఇండియన్ ఐడల్ కంటెస్టెంటుగా వచ్చింది… ఆమెను చూస్తుంటే ఆమె పాడుతుంటే రెండేళ్ల క్రితం ‘ముచ్చట’ రాసిన కథనం గుర్తొచ్చింది… ప్రదీప్ ఆమెను ర్యాగింగ్ చేసిన తీరును ఆ కథనంలో విమర్శించాం… అప్పుడు టెన్త్ పాసై ఇంటర్‌లో చేరిన ఆమె బహుశా ఇప్పుడు ఇంటర్ పూర్తి చేసి ఉంటుందేమో, మహా అయితే పద్దెనిమిదేళ్లు… కానీ అప్పటి యుతి కాదు… అప్పటి కథనం ఇదుగో… మరోసారి… యథాతథంగా…



ఆలియా భట్… జగమెరిగిన టాప్ స్టార్… దీపిక, ప్రియాంకలకు దీటుగా పాపులారిటీ సంపాదించిన నటి… ఏజ్ తక్కువ… కానీ రేంజ్ చాలా ఎక్కువ… నటనలో ఎంత ఇరగదీసినా, తన జనరల్ నాలెడ్జి మీద మాత్రం మస్తు జోకులు… భలే సెటైర్లు నడుస్తూ ఉంటయ్… పెద్దగా చదువుకోకపోవడం, తండ్రి కూడా ప్యూర్ సినిమాల కోసమే అన్నట్టుగా పెంచడం… ఆమెకు చాలా దైనందిన వ్యవహారాలపై పెద్దగా సోయి లేదు… నిజానికి ఆమెకు అవి అవసరం లేదు… దాన్ని ఓ తప్పుగానో, లోపంగానో పరిగణించదు…

ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే… ఓ బెంగుళూరు బేస్డ్ సింగర్ ఉంది… పేరు యుతి… యుతి హర్షవర్ధన… వయస్సు పదహారేళ్లు… మొన్నీమధ్యే టెన్త్ పూర్తిచేసింది… ఇంటర్‌లో చేరింది… ఇదుగో ఈమే…

yuti1

ఎంత క్యూట్‌గా, ఎంత అమాయకంగా కనిపిస్తున్నదో కదా… అవును, ఆమె వయస్సెంతని..? ఏడెనిమిదేళ్ల వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటోంది… పాడుతోంది, సాధన చేస్తోంది… వెస్టరన్ మ్యూజిక్ అంటే కూడా ఇష్టమే… తనకు సంగీతమే లోకం… తనకో యూట్యూబ్ చానెల్… అందులో పాటలు… ఇప్పుడు జీతెలుగు వాడు ప్రసారం చేస్తున్న సరిగమప ప్రోగ్రాంలో తన లలితమైన, శ్రావ్యమైన గొంతుతో ఆలపిస్తుంటే హైలైట్ అనిపిస్తూ ఉంటుంది…

విషయం ఏమిటంటే..? ఆదివారం షోలో యాంకర్ ప్రదీప్ ఆమెతో సంభాషించిన తీరు చీప్‌గా ఉంది… అంటే తను ఆమె పట్ల ఏదో అసభ్యంగా మాట్లాడాడు అని కాదు… ప్రదీప్ అలా చేయడు… తన యాంకరింగు ఎప్పుడూ మర్యాద పరిమితులు దాటదు… కానీ ఆమెను ర్యాగింగ్ చేశాడు… ప్రదీప్ పట్ల జాలి, కోపం, సానుభూతి, అసహ్యం అన్నీ కలిగాయి ఒక్కసారిగా…

yuti

హైదరాబాద్‌లో బీచులు అనడిగాడు… నిజానికి ఆమెకు ఏమీ తెలియదు… పైగా అక్కడ ప్రదీప్, స్టేజ్, ఎదురుగా జడ్జిలు, మెంటార్లు, తోటి కంటెస్టెంట్లు… ఫాపం, ఆ భయంతో తనేం చెబుతున్నదో తనకే తెలియకుండా… నాగార్జునసాగర్ డ్యామ్ బీచ్ ఉందని బదులు చెప్పింది… ఆమె ఆ జవాబు చెబుతుంటే ఆమెను చూస్తే జాలేసింది తప్ప, ముద్దుముద్దుగా ఉంది తప్ప… ఆమెను చూసి నవ్వాలనిపించలేదు… మరి ఆ జడ్జిలు, మెంటార్లు, ప్రదీప్ ఎందుకంత పగలబడి నవ్వారు..?

ఆమె అమాయకత్వం తెలుస్తూనే ఉంది కదా… ఇంకా ఇంకా కెలికి, ఏవేవో జవాబులు చెప్పించి, వెక్కిరిస్తున్నట్టుగా నవ్వడం దేనికి..? చీప్ టేస్ట్ ప్రదీప్… పోనీ, నువ్వు చెబుతావా..? సరదాగా ఓ ప్రశ్న… డ్రంకెన్ డ్రైవ్‌లో ఎన్ని పాయింట్లు వస్తే పోలీసులు పట్టుకుపోతారు..? పోనీ, ఆమెకు ప్రవేశం ఉన్న రంగంలో బేసిక్ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా నీకు..? సరే, ప్రేక్షకులు నవ్వుకోవడం కోసం, ఫన్ కోసం, ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం అని ఓ పిచ్చి సాకు చెబుతావేమో… దానికి ఓ అమాయక ఆడపిల్లను వెక్కిరించడం అవసరమా..?

yuti2

రెండో ప్రశ్న వేశాడు… హైదరాబాదులో ఏమేం తెలుసు అని… ఈ స్టూడియో తెలుసు, నేనుండే రూం తెలుసు అన్నది ఆమె… రియల్లీ ఇంట్రస్టింగు… ఆమె హైదరాబాద్ వస్తే, తన సింగింగ్ కాంపిటీషన్ చూసుకుని వెళ్లిపోతోంది… తన జవాబులో అదే అర్థమైంది మనకు… దాంట్లో నవ్వడానికి ఏముంది..? అక్కడున్న వాళ్లంతా పడీపడీ నవ్వారు… ఎస్పీ శైలజ ఒక్కతే ఆ అమ్మాయి ఇబ్బందిని అర్థం చేసుకుని, ప్రదీప్‌ను వారించే ప్రయత్నం చేసింది… చంద్రబోస్ చీప్ లాఫింగ్…

మరో ప్రశ్న… చార్మినార్‌కు మీనార్లు ఆరా, ఎనిమిదా అని… ఈ ప్రశ్నకు కూడా ఆమె నాలుగు ఉంటయ్, ఫోటోలో అయితే అలాగే కనిపిస్తున్నయ్ అని చెప్పింది… మొన్న హైదరాబాదుకి వరదలు వచ్చాయి కదా, ఏ నదికి అనేది ఇంకో ప్రశ్న… ఈ ఇంకా అమాయకంగా గంగా నదికి అని చెప్పింది…

నిజంగా ఆ పిల్ల మెదడు స్వాతిముత్యం… అంతే తప్ప, నవ్వి, వెక్కిరించి, అందులో ఆనందాన్ని పొందడం ఖచ్చితంగా చీప్, చీపర్, చీపెస్ట్ టేస్ట్ ఆఫ్ ప్రదీప్… ఆ అమ్మాయి సమాధానాలు చెబుతున్న తీరు ప్రేక్షకులకు ఆమెపట్ల అభిమానాన్ని పెంచిందే తప్ప… కించిత్తు కూడా తేడా లేదు… చివరకు ఎడ్డోడిగా మిగిలింది ప్రదీప్… ఈషణ్మాత్రం హుందాతనం లేకుండా… పకపకా నవ్విన అక్కడి జడ్జిలు, ప్రత్యేకించి చంద్రబోస్, ఇతర మెంటార్లు…! అమాయకత్వం తప్పు కాదు… ఆమె గానప్రతిభ ముందు ఇది అసలు లెక్కలోనిదే కాదు… సారీ యుతీ… పట్టించుకోకు, ప్రదీప్‌కు ఈ నడుమ చిన్నమెదడుకు ఏదో దెబ్బతగిలి… ఇలా చేస్తున్నాడు… నువ్వూ, నీ పాట… కీప్ రాకింగ్…!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మంటల్లో మరో యూరప్ దేశం… పటిష్ట ఆర్థికదేశాలు కావు, ఉత్త డొల్ల…
  • ‘‘ఆ క్షణంలో ప్రధాని నరేంద్ర మోడీ కళ్లల్లో నేను భయం గమనించాను…’’
  • నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…
  • అది వీర బొబ్బిలి మాత్రమే కాదు… వీణ బొబ్బిలి కూడా…
  • మోడీ వ్యాఖ్యలు తప్పే… శూర్పణఖ అందగత్తె, మనోహరమైన నవ్వు… బాధితురాలు…
  • తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
  • Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
  • రాహుల్‌పై అనర్హత వేటులో మోడీ ఆశించే అసలు టార్గెట్స్ పూర్తిగా వేరు..!!
  • మధిరోపాఖ్యానం… తయారీ నుంచి రుచి తగిలేదాకా… ఇదొక వైనాలజీ…
  • రాంభట్ల కృష్ణమూర్తి అంటే ఒక పెద్ద బెల్జియం అద్దం…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions