.
ఒక మెంటల్ కేసు మణికంఠ తనంతట తానే వెళ్లిపోయాడు… గుడ్… పెద్ద రిలాక్స్… అంతకుముందే అభయ్ నవీన్‌ను బిగ్‌బాస్ వదిలించుకున్నాడు… గుడ్…
మరో మెంటల్ కేసు పృథ్వి ఎట్టకేలకు వెళ్లిపోయాడు మొన్న… వెరీ గుడ్… ముందే చెప్పుకున్నాం కదా ఈసారి బిగ్‌బాస్ హౌజ్ ఎర్రగడ్డ హాస్పిటల్‌లాగే అనిపిస్తోందని…
Ads
ఆ ముగ్గురూ సరిపోరని వైల్డ్ కార్డు ఎంట్రీగా గౌతమ్ వచ్చాడు… ఇది మరీ మెంటల్ కేసు… విచిత్రంగా అందరూ వోట్లేస్తున్నారు… పోనీ, విజేతగా నిలిచినా సరే, మరో పల్లవి ప్రశాంత్ అనుకోవచ్చు… కానీ పక్కా రిజెక్ట్ చేయాల్సిన కేరక్టర్…
అప్పుడే ఫీలింగ్స్ ఉన్నాయంటాడు, ఆమె ఫోఫోరా అనేసరికి అక్కా అని వెటకారంగా పిలుస్తాడు… ఇంకెవరినో బేబీ అంటాడు… మగాళ్లను బాబూ అన్నట్టే ఆడాళ్లను బేబీ అంటారట… వాడి చదువు, వాడి సంస్కారం అది… అక్కా అంటే తెలంగాణ యాస అట… కాస్త నోర్మూయరా నాయనా…
నాకు హౌజులో అందరూ అక్కలే అంటాడు మరోసారి… అందరి మీదకూ దూకుడుగా వెళ్తాడు, పరుషంగా మాట్లాడతాడు… అశ్వత్థామ అంటే సహించేది లేదని ఓసారి కొట్లాటకు వస్తాడు, మళ్లీ తనే అశ్వత్థామ 3.0 అంటాడు… పక్కా మెంటల్ కేసు… ఎప్పుడూ ఏదో ఒకటి కూస్తూనే ఉన్నాడు…
ఇప్పుడూ అంతే… నిఖిల్‌తో గొడవ… నువ్వు యష్మిని వాడుకున్నావు అంటాడు… చిల్లర విమర్శ… ఆ టోన్, ఆ మీనింగ్ నీచంగా ఉంది… కూల్‌గా కనిపించే నిఖిల్ కూడా రెచ్చిపోయాడు… మళ్లీ ఆ మాటంటే మర్యాద దక్కదు అన్నాడు గానీ నాలుగు తగిలిస్తే అయిపోయేది…
ఒకవైపు నిఖిల్ ఎమోషనల్‌గా డౌన్‌లో ఉన్నాడు… కావ్యతో బ్రేకప్పు… ఆమె అపార్థాలు… బయట నిఖిల్ మీద కామెంట్లు పెడుతోంది సోషల్ మీడియాలో… తాజాగా నిఖిల్‌తో చేసిన రీల్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డిలిట్ కొట్టేసింది… వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతోంది…
సరే, అది వాళ్లిద్దరి కథ… ఒకసారి బ్రేకప్ అయ్యాక ఆమె పిచ్చి పిచ్చిగా రియాక్ట్ కావడం శుద్ధ దండుగ… నిఖిల్‌తో కట్ అనుకున్నాక ఇక వదిలేయాలి… మళ్లీ మళ్లీ గోకడం దేనికి..? నిఖిల్ తన బ్రేకప్ పట్ల తనదే తప్పు అని ఎమోషనల్‌గా ఫీలవుతున్నాడు… అదంతా వదిలేస్తే…
గౌతమ్ అనేవాడు నువ్వు యష్మిని వాడుకున్నావు అని నిఖిల్ మీద చిల్లర కామెంట్ చేయడం ఏమిటి..? ఆమె నిజంగానే నిఖిల్ మీద మనసు పారేసుకుంది సరే, కావ్య మీద తన ప్రేమ తగ్గలేదని తెలిశాక నిఖిల్ మీద ఆశల్ని వదిలేసుకుంది… నడుమ గౌతమ్‌కు వచ్చిన నొప్పి ఏమిటో…
ఇవన్నీ ఆడటం సరిగ్గా చేతకాని వేషాలు… కాకపోతే వాళ్లకే వోట్లు రావడం అదొక ఐరనీ… అఫ్‌కోర్స్, నాగార్జున ఆప్యాయంగా అలుముకుని ట్రోఫీ తనకే ఇచ్చినా సరే… ఈ గౌతమ్ అనే కేరక్టర్ ఈ బిగ్‌బాస్ సీజన్‌కు ఓ మరక..!!
Share this Article