Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెట్రోల్ రేట్ పెరిగిందని ఏడిస్తే మాత్రం నేను ఒప్పుకోనబ్బాయ్..!!

February 23, 2021 by M S R

…….. By…… Bharadwaja Rangavajhala…………….  థింక్ బిగ్ అండ్ ఎఛీవ్ బిగ్ …
పెట్రోల్ రేట్ పెరిగిందని ఏడిస్తే మాత్రం నేను ఒప్పుకోనబ్బాయ్ … అసలా మాటింటేనే నాకు కోపం నషాళానికంటుతుంది.
ఇప్పుడూ … రేట్లు తగ్గాలనడం దౌర్భాగ్యం … రేట్లు మండిపోతున్నాయ్ అని గగ్గోలు పెట్టడం దేశభక్తి లేకపోవడం … దేశ ప్రగతిని కుంటుపడేయడం… ఇవన్నీ కాదయ్యా దేశద్రోహం అంతే ఆ …
లీటర్ పెట్రోల్ కొట్టించుకుని ఓ ఫైవ్ హండ్రడ్ రూపూస్ నోట్ అలా విసిరావనుకో … ఎంత రిచ్ గా ఉంటుందో ఊహించు …
కిలో వంకాయలు అరకిలో బీరకాయలు రెండు కిలోల టమాటాలు కొనేసి ఓ రెండు వేల రూపాయల కాయితం అలా పడేశావనో .. ఎంత రిచ్ నెస్సు ..
రాజమౌళి రోజుల్లో చిత్తూరు నాగయ్య నాటి బుర్రలతో అబ్బబ్బ ఎంత విసుగ్గా ఉంటుందో … వీళ్లని చూస్తుంటే …
అన్నీ రూపాయి పావలాలోనే రావలనుకోడం కన్నా దరిద్రం దౌర్భాగ్యం ఉంటుందా? ఇట్టా రూపాయి పావలా గాళ్ల వల్లే దేశ ప్రగతి కుంటుపడిపోతుంది…. పరువు మంగళగిరి సంతకెడుతుంది …
అసలు ఈ రేట్లు పెరగడం వల్ల జనాల్లో ఓ మోటివేషన్ వచ్చి నెల ఖర్చు లక్ష రూపాయలు వస్తోంది కాబట్టి ఓ రెండు లక్షలు సంపాదించాలనుకుంటారు. అవునా కాదా?
అదే రేట్లు రూపాయి పావలా దగ్గరే ఉంటే … సంపాదించాలనే యావ చచ్చిపోయి … అరుగుల మీద కూర్చుని సోది దొబ్బుతూ ఉంటారు … రెడిక్యులస్ కదా … ఏ మాత్రం సెన్సున్నవాడన్నా తన దేశ ప్రజలు ఇలా సోదిగాళ్లైపోవడం చూసి తట్టుకోగలడా?
అందుకే ఈ వాట్సప్పుల్లో డెబ్బైలో సరుకుల పట్టీ అని పెట్టేవాళ్లను చూస్తే ఒళ్లు మండిపోతుంది … సెంటర్ చూసి పొడిచిపారేయాలనిపిస్తుంది ఒక్కొక్కణ్ణీ …
కందిపప్పు మూడు కిలోలు ఐదు రూపాయలు … మొత్తం సరుకులన్నీ కలిపి డెబ్బై రూపాయలు లాంటి యూజ్ లెస్ దేశ ప్రగతిని దారుణంగా కుంటుపడేసే లాంటి పాత కాయితాలు ఫొటోలు తీసి పెడుతున్నారు.
ముందు వీళ్లందరినీ పోలీస్టేషన్లలో వేసి థర్డ్ డిగ్రీ పెట్టి కుళ్లబొడిచేయాలి … అంటే ఏమిటీ? దేశాన్ని డెబ్బైల్లోనే ఉంచేయాలనే దిక్కుమాలిన ఆలోచన కాదుటండీ అది … ఇలాంటి వాళ్లని క్షమించతగునా?
నేనైతే క్షమించను …
petrol 100
నా చిన్నప్పుడు కిలో నెయ్యి పదహారు రూపాయలు ఉండేది … నేనే సీతారామ్ పురం దాకా నడుచుకుంటూ పోయి అక్కడ గానుగలో పదహారు రూపాయలు ఇచ్చి నెయ్యి తెచ్చేవాణ్ణి …
ఇప్పుడూ అదే రేటు ఉండాలనుకోడం ఎదుగుదల ఎట్టా అవుతుందీ అంట
… ఐదొందలు పెట్టి అమూల్ నెయ్యి కొనుక్కోని వేసుకుంటే ఎంత రాయల్ గా ఉంటుందో ఆలోచించండి …
అసలు ధరలు మండిపోతున్నాయనిగానీ .. తగ్గాలనిగానీ అన్నవాణ్ణి షూట్ చేసి పారేయాలి …
బొత్తిగా కాన్షస్నెస్సు లేని చీప్ యిడియట్స్ … మా ఊరి భాషలో మాట్లాడాల్సొస్తే అలగా జనం … వీళ్లే దేశానికి దరిద్రం …
థింక్ బిగ్ అండ్ ఎఛీవ్ బిగ్ … ఇంకోసారి ఎవరైనా పెట్రోల్ వంద అయ్యింది నా బొందయ్యిందని రాశారో …. వాళ్ల రెండు రెప్పల మధ్యా అగ్గిపుల్లలు పెట్టి రెండు రెక్కలూ కుర్చీని విరిచి కట్టి అరడజను బాలయ్యబాబు సినిమాలు నాన్ స్టాప్ గా చూపించేస్తా … జాగ్రత్త … హన్నా …
ఒకేళ ప్రభుత్వం కనుక వీళ్ల గొడవ చూసి రేట్లు తగ్గిస్తే మాత్రం నిరసనగా ఆమరణ ఆహార దీక్ష చేస్తానని వార్నింగ్ ఇస్తున్నా …

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • రెడ్ వాల్..! కణకణ మండిన ఆ రోజుల్లోకి… వేలాది మంది జ్ఞాపకాల్లోకి…
  • అక్షర..! సర్కారీ విద్యలాగే… లైన్ తప్పి, వెగటు కామెడీలో గింగరాలు..!!
  • మామాఅల్లుళ్లకు అవమానమే..! ఐతేనేం, తమ్ముళ్లకు నమ్మకం పోతోంది మరి..!!
  • బిరుదు కావాలా నాయనా..? మన మార్కెట్‌లో చౌక సరుకే ఇది…!!
  • డర్టీ కాంట్రవర్సీ..! అమెరికన్లకు చైనా గుదపరీక్షలు..! ఓ పంచాయితీ..!!
  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now