Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… ఇదంతా సిరి ప్లానింగేనా..? ఇప్పుడిక ‘బ్రహ్మ’తో సహజీవనమా…!!

January 2, 2022 by M S R

ఇంత పెద్ద తెలుగు సినిమా, టీవీ, వెబ్ వీడియోల ప్రపంచంలో ఒక దీప్తి, ఒక సిరి, ఒక శ్రీహాన్, ఒక షణ్ముఖ్ చాలా చిన్న చేపలే కావచ్చుగాక… కానీ చెప్పుకోవాలి… వర్తమాన కలల ప్రపంచంలో, గ్లామర్ ఫీల్డులో ప్రేమ బంధాలు ఎంత చంచలమో, వాటిని ప్రేమబంధాలు అనాలో లేదో, జీవితాల్ని ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చెప్పుకోవాడానికి… ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్పుకోవాలి… చైతూ, సమంత జీవితాలే కాదు, ఇవీ ఉదాహరణలే… విషయం ఏమిటంటే..? దీప్తి షణ్నూ అనబడే ఓ మెంటల్ కేసుకు బ్రేకప్ చెప్పేసింది… సంక్షోభంలో పడిన బంధం మెల్లిమెల్లిగా చక్కబడుతుందేమో అని ఎదురుచూసింది…

కానీ ఏం జరిగింది..? బిగ్‌బాస్ ఫినాలే తరువాత దీప్తిని చూడటానికి రాలేదు… కలవలేదు… ఇద్దరి ఇళ్ల నడుమ అర కిలోమీటర్… ఐనా మొహం చాటేశాడు… ఆమెకు విషయం అర్థమైంది… ఛీకొట్టేసింది, తప్పలేదు… నమ్మకూడని వ్యక్తిని నమ్మాను అనే బాధతో ఆమె రోజూ ఏడుస్తోంది… మరి నాగార్జున బ్రహ్మ బ్రహ్మ అని నెత్తిన మోసిన సదరు షణ్నూ అనే కేరక్టర్ ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న దీప్తిని ఎందుకు ఇగ్నోర్ చేశాడు..? ఇక ఆమె అక్కర్లేదు కాబట్టి… సిరి ప్లానింగ్ మాయలో నిండా మునిగిపోయాడు కాబట్టి… బిగ్‌బాస్ హౌజులోనే ఒకే బెడ్ మీద, ఒకే దుప్పట్లో దూరి ప్లాన్లు వేసుకుని, అమలు చేయడానికి సిద్ధమైపోయారు కాబట్టి… ఈ రెండు ప్రేమకథల్లో అసలు విలన్ సిరియే కాబట్టి… ప్లానింగ్ అంతా తనదే కాబట్టి…

‘‘ఒసేయ్, ఆ ముద్దులేమిటి..? ఆ హగ్గులేమిటే సిగ్గులేనిదానా’’ అంటూ సాక్షాత్తూ సిరి తల్లి హౌజులోకి వచ్చి బుద్దిచెప్పింది… ఐనాసరే, ఆరోజు రాత్రే ‘‘పర్లేదు, అమ్మ అర్థం చేసుకుంటుందిలే’’ అంటూ షణ్నూతో ఒకే బెడ్ మీద దుప్పట్లోకి దూరిపోయిన సిరి మెంటాలిటీ అర్థమైంది కదా… నిజానికి షణ్నూ పేరొందిన యూట్యూబరే… ఈ సిరి కూడా తనతో కలిసి నటించిందే… కానీ అప్పటికే శ్రీహాన్‌‌తో సిరి బంధం, షణ్నూతో దీప్తి బంధం బయట నడుస్తూనే ఉన్నయ్… ఐనా ఏమిటీ రోగం అంటారా..? దటీజ్ సిరి…

Ads

నిజానికి షణ్నూ కోసం దీప్తి బోలెడంత ఖర్చు పెట్టింది… చివరకు హౌజులో ఉండటం కోసం బ్రాండెడ్ షర్టులు కూడా కొనిచ్చింది దీప్తే… తీరా ఆ షర్టులు సిరి వేసుకుని తిరిగేది… పైగా ప్రేక్షకులు ఛీకొడుతున్నా సరే, వెగటు వేషాలకు దిగారు… ఆ హౌజులోనే ప్లాన్ వేశారు… కలిసి ఉందామని బాసలు చేసుకున్నారు… ఇంకేముంది..? బయటికి వచ్చాక దీప్తికి, శ్రీహాన్‌కు అర్థమైంది… శ్రీహాన్‌కు సిరి దూరంగా ఉంటోంది… దీప్తికి షణ్నూ దూరంగా ఉంటున్నాడు… అంతేకాదు, వైజాగ్ వెళ్లి షణ్నూ సిరితో ఉంటున్నాడని వార్తలు… ఇక దీప్తికి తప్పేదేముంది..? ఫోఫోరా అని ఇన్‌స్టా విడాకులు ఇచ్చేసింది… ఇంకా శ్రీహాన్ స్పందించడం లేదు…

సో, ఏతావాతా అర్థమయ్యేది ఏమిటి..? ఈ గ్లామర్ రంగుల ప్రపంచంలో ఉన్నన్నిరోజులు జీవితాలు, బంధాలు, స్థిరమైన భవిష్యత్తు, ప్రేమల్లో నమ్మకాలు, విశ్వాసాన్ని కాపాడుకునే ప్రయత్నాలు… ఇవన్నీ ఏమీ లేవు… ఉండవు… ఈ రెండు జంటల కథ చెప్పేది కూడా అదే… తరచి చూస్తే ఇండస్ట్రీలో బోలెడు మంది బ్రేకప్పులు, ఒంటరి జీవితాలు… తీరా ఓ వయస్సు దాటాక ఏడుపులు… వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రేమలు తడారిన ఎడారులు… ప్రేమ, పెళ్లి గొప్ప విషయాలు కావు… వాటిని కాపాడుకోవడమే అసలు పరీక్ష… అదుగో, అందులోనే చాలామందికి పాస్ మార్కులు కూడా రావడం లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!
  • హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!
  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions