Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంబానీని మించిన ఐశ్వర్యవంతుడు… ధనం, ఆస్తుల లెక్కల్లో కాదు సుమా…

December 29, 2020 by M S R

తెల్లారిలేస్తే ముఖేష్ అంబానీ సంపద ఇంత పెరిగింది, అంత తగ్గింది అని మీడియా లెక్కలు… ప్రపంచ ధనికుల్లో తన నంబర్ పెరిగిందా, తగ్గిందా అని ప్రత్యేక వ్యాసాలు… మాట్లాడితే ఆదానీలు, అంబానీల ముచ్చట్లే… కానీ ఒకప్పుడు అంబానీ ఏమిటి..? పొనీ, ఇప్పుడు తన తమ్ముడి స్థితి ఏమిటి..? అవన్నీ ఎందుకులే గానీ… ఒక్కసారి ఎవ్వరైనా టాటాలతో పోల్చారా..? కొన్ని విలువలతో… ఈ దేశ పారిశ్రామిక ప్రగతి చిత్రాన్ని రచించింది, రచిస్తున్నది టాటా గ్రూపు… విలువలు, విరాళాలు, ప్రమాణాలు… మిత్రుడు Jagannadh Goud ఏం చెబుతున్నాడో చదవండి ఓసారి…

 

ratan tata
టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా… జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా… రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తిని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు… నావల్ టాటా కొడుకు రతన్ టాటా…

టెక్నికల్ గా టాటాల వారసుడు రతన్ టాటానే, కానీ నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు… రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంబం.., 4 యేండ్ల వయస్సులోనే అతని తండ్రి చనిపోతే, తల్లి కుట్టు మిషిన్ తో వచ్చేదానితో పోషించలేక ఒక అనాధాశ్రమంలో చేర్పించారు నావల్ ని… పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్ ని దత్తత తీసుకోవటం వలన నావల్ టాటా అయ్యాడు…

నావల్ టాటా సోను అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు… ఇదీ ఆయన కథ…

రతన్ టాటా జీవితంలో మెలోడ్రామా లేదు, గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు అనుకుంటాం. స్పేస్ క్రియేట్ చేసి మెలోడ్రామా సృష్టించటం కరక్ట్ కాదు. కానీ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు, తను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు, తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమనేవాడు. చివరికి రతన్ జంషెట్ టాటా (టెక్నికల్ గా తాత) ని ఒప్పించి అమెరికాలోని కార్నె యూనివర్శిటీలో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఇండియా చైనా యుద్ధం జరుగుతుండటంతో రతన్ టాటాని చేసుకోటానికి ఆ అమ్మాయి ఇండియా రాలేదు, వేరే వాళ్ళని చేసుకుంది. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా పెండ్లి చేసుకోలేదు (బ్రహ్మచారి)…

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా కజిన్ బ్రదర్ కొడుకు JRD టాటా (JRD టాటాకి భారతరత్న కూడా వచ్చింది). రతన్ టాటా ఇండియా వచ్చిన సమయంలో JRD టాటానే టాటా గ్రూపు వ్యాపారాలని చూసుకునేవాడు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగిలాగే టాటా గ్రూపులో జాయిన్ అయ్యాడు. JRD టాటా ఆరోగ్యం బాగాలేని స్థితిలో రతన్ టాటాకి టాటా గ్రూపు పగ్గాలు అప్పగించాడు…

tata

అప్పటిదాకా కుటుంబ వ్యాపారంలాగా ఉన్న టాటా సంస్థని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దాడు రతన్ టాటా. ఇండియాలో ఉన్న కార్లు, విమానాలు అన్నిటినీ కొనగలడు కానీ ఇప్పటికీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళతాడు రతన్ టాటా… తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారుని చెక్ చేపించుకుంటాడు.

రిలయన్స్, బిర్లా, బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూపు సంపద ఎక్కువ. కానీ అంబానీలలాగా ఇండియాలో కానీ, ప్రపంచంలో కానీ టాప్ లో లేడు రతన్ టాటా… కారణం ఆయన సంపదలో 60% ఎప్పుడూ దానధర్మాలకి వినియోగిస్తుంటాడు రతన్ టాటా.

ఆసియా లో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ (ఆ తర్వాత ఎయిర్ ఇండియా అయ్యింది) వరకు టాటాలే ప్రారంభించారు. టీ పొడి, ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు టాటాలు లేని వ్యాపారం లేదు; సిగరెట్స్ & ఆల్కహాల్ వ్యాపారం తప్ప. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ వరకు టాటాలే నంబర్ వన్…

టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి… ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి, ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన “జాగ్వార్”, “లాండ్ రోవర్” ని కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా…

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో ఇండియాలో మొట్టమొదట 5/5 రేటింగ్ సాధించిన కార్ టాటా వాళ్ళదే (టాటా నెక్సాన్). ఈ కార్ సృష్టికర్త రతన్ టాటా గారే. ఇండియాలో రిలయన్స్ తర్వాత 100 బిలియన్స్ రూపాయలు సాధించిన సంస్థ కూడా టాటా వాళ్ళ TCS నే (మార్కెట్ క్యాపిటలైజేషన్- mcap ప్రకారం). ఇలాంటివెన్నో ఉన్నాయి రతన్ టాటా గారి ఖాతాలో…

ఇండియాకి ఏ కష్టం వచ్చినా సంపదని అంతా ఇచ్చేవాళ్ళలో రతన్ టాటా ముందు ఉంటాడు… అంబానీలు ధనవంతులు కానీ రతన్ టాటా ఐశ్వర్యవంతుడు… కష్టపడితే అందరూ అంబానీలు అవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ రతన్ టాటాలాగా ఐశ్వర్యవంతుడు అవ్వొచ్చు… రతన్ టాటా అంటే నమ్మకం, రతన్ టాటా అంటే నిజాయతీ, రతన్ టాటా అంటే నిలువెత్తు భారతం. One of my inspiring persons Ratan Tata 🙏 – జగన్

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…
  • ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!
  • ఫేస్‌బుక్ వేదికగా ఈ కలెక్టర్‌కు వేలాది మంది విభిన్న వీడ్కోలు..!
  • 2021లో మహావిపత్తులు..? డోన్ట్ వర్రీ..! ఆ రాతలన్నీ చదివి నవ్వుకొండి..!
  • చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!
  • సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
  • KCR వేస్ట్, వేస్టున్నర… సరే… కానీ అది తేల్చాల్సింది ఈ దరిద్రపు సర్వేనా..?!
  • కంగనా భలే ఎంపిక..! ఆమె ఆ క్వీన్ కేరక్టరే ఎందుకు తీస్తున్నదంటే..?
  • కరోనా అనువాద వాణిజ్య ప్రకటనల్లో హాస్యం బాగా పండును…!
  • ‘చిన్నమ్మ పథకం’… సమయానికి జగన్‌ను గోమాతలా ఆదుకుంది…!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now