Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేబీసీ… ఏడు కోట్ల విలువైన ఆ అత్యంత గొట్టు ప్రశ్న తెలుసా మీకు..?

November 26, 2020 by M S R

ప్రస్తుత 12వ సీజన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో వరుసగా… ముగ్గురు మహిళలు వారానికొకరు కోటి రూపాయల చొప్పున గెలుచుకున్న ముచ్చట చెప్పుకున్నాం కదా… నజియా నసీం, మోహితశర్మ… నిన్న అనుప దాస్… ముగ్గురూ ఉద్యోగులే… వారిలో అనుప దాస్ టీచర్… మోహిత శర్మ ఐపీఎస్ అధికారి, నజియా నసీం ప్రైవేటు కంపెనీ కమ్యూనికేషన్స్ ఎంప్లాయీ… వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు నేపథ్యాలు…

సరే గానీ… ఈ షోలో మొదట తేలికపాటి ప్రశ్నలుంటయ్… అల్కటి ప్రశ్నలు… తరువాత ప్రైజ్ మనీ పెరిగేకొద్దీ ప్రశ్నలు టఫ్ అవుతుంటాయి… అంటే గొట్టు ప్రశ్నలు… మరీ కోటి రూపాయలు, ఏడు కోట్ల రూపాయల దగ్గరకొచ్చేసరికి ఆ ప్రశ్నలు ఎంత గొట్టుగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు… మరి అనుప దాస్‌కు కోటి రూపాయలు సంపాదించి పెట్టిన ఆ ప్రశ్న ఏమిటి..? ఇంట్రస్టింగు కదా… ఇదీ ఆ ప్రశ్న

Who was awarded the Param Vir Chakra for his bravery on November 18, 1962, at Rezang La in Ladakh?

(లడఖ్, రేజంగ్ లా వద్ద నవంబరు 18, 1962లో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను ఎవరికి పరమ వీర చక్ర పురస్కారం లభించింది..?) 

ఇదీ ప్రశ్న… ఇక ఆప్షన్లు చదవండి…

A) Major Dhan Singh Thapa B) Lt Col Addeshir Tarapore C) Subedar Joginder Singh D) Major Shaitan Singh

జవాబు : Major Shaitan Singh (మేజర్ శైతన్ సింగ్)

ఈ ప్రశ్నకు అనుప దాస్ తన చివరి లైఫ్ లైన్ వాడుకుంది… ఇక లైఫ్ లైన్లు లేవు… ఏడో ప్రశ్నను ఎదుర్కొంది, సమాధానం తెలియదు… అనివార్యంగా కోటి రూపాయల వద్ద ఆటను ఆపేయాల్సి వచ్చింది… ఆ ఏడు కోట్ల విలువైన ప్రశ్న కూడా తెలుసుకోవాలని ఉందా..? అది ఇదీ…

Q) In One Day International cricket, which team have Riaz Poonawalla and Shaukat Dukanwala represented?

(వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏ జట్టు తరఫున రియాజ్ పూనావాలా, షౌకత్ దుకాణ్‌వాలా ఆడతారు..?)

ఇవీ ఆప్షన్లు…

A) Kenya B) UAE C) Canada D) Iran

జవాబు: UAE (అరబ్ ఎమిరేట్స్)

అనుప దాస్ ఎదుర్కొన్న మరికొన్ని ప్రశ్నలు, జవాబులు ఇవీ…

Q) Which of the following places in Odisha is believed to be the site where Kalinga War was fought?

(కళింగ యుద్ధం జరిగిందని భావించే ఒడిశాలోని ప్రాంతం పేరు..?)

Answer: Dhauli

Q) According to Shiv Purana, due to whose curse did Lord Vishnu take the form of a stone and live near the Gandaki river?

(శివపురాణం మేరకు… ఎవరి శాపం వల్ల విష్ణుదేవుడు గందకి నది వద్ద శిలగా మారాడు..?)

Answer: Devi Tulsi

Q) ‘Lilaviti’s Daughters’, a book published by IAOS, Bengaluru, features about 100 essays on which of these groups of people?

(బెంగళూరు, ఐఏఓఎస్ ప్రచురించిన లీలవతి డాటర్స్ పుస్తకంలో ఎవరి గురించి వంద వ్యాసాలున్నయ్..?)

Answer: Indian women scientists

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…
  • ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!
  • కెనడాలో మాఫియా వార్… టాప్ ఎలెవన్ గ్యాంగ్‌స్టర్లలో 9 మంది పంజాబీలే…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions