Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తుమ్మిడిహట్టిపై రేవంత్‌రెడ్డి తెలివైన ‘ఎత్తు’గడ… బీజేపీని లాగాడు…

April 30, 2026 by M S R

.

కాళేశ్వరం సీబీఐ కేసుపై ఇప్పటికే బీజేపీని పదే పదే కార్నర్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివిగా ఇప్పుడు అదే ప్రాజెక్టుకు అనుసంధానమయ్యే తుమ్మిడిహట్టి బరాజు ఇష్యూలోకీ బీజేపీని లాగాడు… అసలే కాళేశ్వరం సీబీఐ కేసు విషయంలో బీజేపీ దగ్గర జవాబు లేదు, నీళ్లు నములుతోంది… కేసీయార్‌తో పొత్తు, రహస్య దోస్తీల వార్తల నేపథ్యంలో బీజేపీకి ఎటూ అడుగులు వేసే పరిస్థితి లేదు…

తాజాగా తుమ్మిడిహట్టిపై..! సంక్షిప్తంగా ఇదేమిటో ఓసారి చెప్పుకుందాం… వైఎస్ అప్పట్లో ఆలోచించిన బ‌ృహత్ ప్రాజెక్టు ప్రాణహిత- చేవెళ్ల… ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి, తెలంగాణకు వరప్రదాాయినిగా ఆ ప్రాజెక్టును డిజైన్ చేశారు… కేసీయార్ వచ్చాక ‘ఏటీఎం’ ఆలోచనలతో… తుమ్మిడిహట్టి ప్రణాళికల్ని బొందపెట్టేసి… మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులను కట్టి, భారీ లిఫ్టులు పెట్టి… కేంద్రం చెబుతున్నట్టే లక్ష కోట్లను గోదాట్లో పోశాడు… అవినీతి, అక్రమాలు, అపసవ్య ఆలోచనల ఆరోపణలు సరేసరి…

Ads

ఆ కాళేశ్వరం ప్రస్తుతం పఢావు పడింది… దాన్ని రిపేరు చేసుకుని, వినియోగంలోకి తెచ్చుకోవాలి రేవంత్ ప్రభుత్వం… సరే, ఆ ప్రయత్నాలేవో సాగుతున్నాయి… మరి తుమ్మిడిహట్టి..? ఎస్, అక్కడే బరాజు కట్టేసి… ఎల్లంపల్లి దాకా నేరుగా గ్రావిటీతో నీళ్లు తీసుకురావాలి లేదా ఆల్రెడీా కట్టిన సుందిళ్ల బరాజు, లిఫ్టులకు లింక్ చేయాలి… కానీ..?

కేసీయార్ ఉన్నప్పుడు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడి తుమ్మిడిహట్టిని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు… నిజానికి 152 మీటర్లు ఐడియల్ ఎత్తు… కానీ అంత ఎత్తుతో కడితే మహారాష్ట్రలో భారీ ముంపు ఉంటుంది… 148 మీటర్లకు సరేనన్నాడు ఫడ్నవీస్… ఐనాసరే కేసీయార్ తుమ్మిడిహట్టిని వదిలేసి… మిగతా నిష్ప్రయోజనకరమైన, భారీ నిర్మాణ ఖర్చు, భారీ మెయింటెనెన్స్ ఖర్చుతో మూడు బరాజుల పని నెత్తికెత్తుకున్నాడు… తెలంగాణ ఖజానా వట్టిపోయింది…

  • (నిజానికి తుమ్మిడిహట్టిని 148 మీటర్ల ఎత్తుతో కడితే… దాదాపు అదే ఎత్తుండే ఎల్లింపల్లికి గ్రావిటీతో లింక్ చేయడం అసాధ్యం… ఐనా కేసీయార్ ఆ ఎత్తుకు అంగీకరించడం ఓ విస్మయం… పైగా ఫడ్నవీస్ ఏదో పెద్ద సాయం చేసినట్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి తనను పిలిచాడు, ఫడ్నవీస్ కూడా వచ్చాడు… తెలంగాణ ప్రజలకు మహారాష్ట్ర సాయం అని భారీ డైలాగ్ కూడా వదిలాడు అప్పట్లో…)

తుమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్లకు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదేమో, 150 మీటర్ల ఎత్తుకు అనుమతి అడుగుదాం, ఆ ప్రాజెక్టును చేపడదాం, తద్వారా ఆదిలాబాద్ మెట్ల ప్రాంతాలకూ ప్రయోజనం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన… అయితే ఇప్పుడూ అక్కడ ఉన్న సీఎం అదే ఫడ్నవీస్… 2016 నాటి ఒప్పందమే ఫైనల్ అనే చాన్సుంది…

పైగా అది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడం సందేహమే… అందుకని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని లాగాడు… తను ఫడ్నవీస్‌తో మాట్లాడి, తెలంగాణకు సానుకూలంగా ఒప్పందం కుదుర్చుకునేలా చేయాలని కోరుతూ కిషన్‌రెడ్డికి ఓ లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సూచించాడు సీఎం… భేటీ వేసి చర్చించాలనీ చెప్పాడు…

5 రాష్ట్రాల ఎన్నికలైపోయాయి… ఇక తెలంగాణ మీద దృష్టి పెడుతుంది బీజేపీ… 10న మోదీ వస్తున్నాడు… ఈ రాజకీయ వాతావరణంలో రేవంత్ రెడ్డి బీజేపీని మరింతగా కార్నర్ చేసేలా ఇలా కిషన్‌రెడ్డిని ఇరికించాడు… చేయలేకపోతే బీజేపీపై విసుర్లు తప్పవు, ఎలాగూ కాళేశ్వరం సీబీఐ కేసులో ఎదుర్కుంటున్నట్టే..!

పోనీ, కిషన్ రెడ్డి చేయగలిగాడా… క్రెడిట్ ఎలాగూ తెలంగాణ ప్రభుత్వానికి, అనగా రేవంత్ రెడ్డికి వస్తుంది… పెద్ద ప్లానింగే..!! ఇంకా కిషన్ రెడ్డి స్పందించినట్టు లేడు… అవుననలేడు, కాదనలేడు, ఇంకేదో డైవర్షన్ చేయాల్సిందే తను..!! ఎలాగూ 5 రాష్ట్రాల ఎన్నికల హడావుడి వచ్చే నెల 4తో అయిపోతుంది కదా… మోదీ పర్యటనలోపే బహుశా రేవంత్ రెడ్డి తుమ్మిడిహట్టి సందర్శిస్తాడేమో..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాడటం వేరు! పద ఉచ్చారణలో భావం పండించడం వేరు!
  • అబ్బో, అహం దెబ్బ తింటే పంతమే! జానకమ్మ మరో కోణం ఇది!!
  • ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏజెన్సీ దందాలపై సర్కార్ కొరడా!
  • తెలుగు పుట్టుకే – తెలుగుకన్నా ఇతర దక్షిణ భాషలే గౌరవించాయి!!
  • అఖిల్ బాబూ, నీ లెనిన్ సీన్ పాత బాల‘కృష్ణబాబు సీన్‌కు కాపీ అట..?!
  • తప్పకుండా రైల్వే ఫిజికల్ టికెట్ వెంట ఉండాల్సిందేనా? ఏది నిజం?!
  • అప్పట్లో ఒక అల్లు అరవింద్ – ఒక జగన్ – ఇప్పుడు ఒక కేటీయార్
  • హీరో రాజేంద్రప్రసాద్‌కు దీటైన ఓ హస్తి నటన – కాసింత ఎక్కువే !!
  • Space Couple – ఈ వ్యోమగాముల జంట కథ స్పూర్తిదాయకం!
  • అక్రమార్కిణి..! మమత పార్టీ నిధుల వెనుక నానా బాగోతాలు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions