Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు… తుమ్మడిహెట్టికి ప్లాన్-బి… ఇలా..!!

June 9, 2026 by M S R

.
తుమ్మిడిహెట్టి మళ్లీ తెరపైకి... మహారాష్ట్ర ‘సైలెన్స్’కు తెలంగాణ కొత్త ప్లాన్! … గోదావరి జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాజకీయ నాయకులు ఎంతగా మాట్లాడినా, చివరికి నిర్ణయాత్మక అడ్డంకి మాత్రం పొరుగు రాష్ట్రాల సహకారమే. అందుకే ఏళ్లుగా చర్చల్లో ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి కేవలం ఆనకట్ట ఎత్తు పెంపు డిమాండ్ మాత్రమే కాదు, దానికి ప్రత్యామ్నాయంగా మరింత వ్యూహాత్మకమైన ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది…

అసలు సమస్య ఏంటి? … తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ లేదా ఆనకట్ట నిర్మాణానికి సంబంధించి తెలంగాణ చాలా కాలంగా 150 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ (Full Reservoir Level) అనుమతిని కోరుతోంది. కేసీయార్ తన కమీషన్ల కాళేశ్వరం ఆలోచనతో… ఫడ్నవీస్‌తో 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించాడు, ఐనా దాన్ని వదిలేశాడు… రేవంత్ రెడ్డి 152 మీటర్లు అడుగుతూ, కనీసం 150 మీటర్లకైనా అనుమతి ఇప్పించేందుకు చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డికి సూచించాడు.,. నో రిజల్ట్…

కిషన్‌రెడ్డికి తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యం తప్ప, తెలంగాణ ప్రయోజనాలు కనిపించడం లేదు… ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజీ రావద్దని ఆలోచన… అందుకే ఫడ్నవీస్‌తో మాట్లాడడు, అపాయింట్‌మెంట్ కూడా ఇప్పించడు… తెలంగాణ బీజేపీ నేతల ఆలోచనలకు తగినట్టు ఫడ్నవీస్ కూడా సైలెంట్…

Ads

తుమ్మిడిహెట్టి ఎత్తును 150 మీటర్లకు అనుమతిస్తే, ముంపు పెరుగుతుంది, ఐనా ప్రతి ఎకరానికీ కోరిన పరిహారం ఇస్తామని చెబుతున్నాడు రేవంత్ రెడ్డి… కానీ ఇక్కడ కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే ఫడ్నవీస్ సైలెంటుగా ఉండిపోయాడు… రాజకీయ సమీకరణాలు మన ప్రజల ప్రయోజనాలకు నష్టదాయకం అని తెలిసీ కిషన్‌రెడ్డి కిమ్మనడు…

ప్రాణహిత

రాజకీయాలు పక్కన పెడితే... నదులు, నీరు, సాగు ప్రాజెక్టులు అసలు రాజకీయాల అంశాలు కాకూడదు. అవి ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలు. కానీ భారతదేశంలో అంతర్రాష్ట్ర జల వివాదాల చరిత్ర చూస్తే, రాజకీయ ప్రయోజనాలు చాలాసార్లు ప్రజా ప్రయోజనాలపై పైచేయి సాధించాయి. తుమ్మిడిహెట్టి వ్యవహారం కూడా అదే కోవ…

అందుకే ప్రత్యామ్నాయ మార్గం! … తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తు పెంపు సాధ్యం కాకపోతే, దానికి ఎగువన వార్దా, వెయిన్‌గంగా నదులు కలిసే ప్రాంతంలో ఒక “కంబైన్డ్ బ్యారేజ్” నిర్మాణం సాధ్యాసాధ్యాలను తెలంగాణ పరిశీలిస్తున్నది… మరి ఇది కూడా మహారాష్ట్ర అనుమతించాల్సిందే కదా అంటారా..? ఎస్, అందుకే 148 మీటర్ల నుంచి 152 మీటర్ల వరకు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేశారు…

తుమ్మిడిహెట్టి దగ్గర ఎలాగూ 148 మీటర్ల బరాజ్‌కు మహారాష్ట్ర అనుమతించింది కదా… సో, దానికి ఎగువన గనుక ఈ కొత్త ప్రపోజల్‌కు మహారాష్ట్ర అంగీకరించకపోతే, అవే రాజకీయాలు ప్రదర్శిస్తే..? అందుకని ఆ బరాజ్ నుంచి సుందిళ్లకు నీటిని తీసుకుపోయే కాలువలు, సొరంగాల కెపాసిటీ పెంచడం..!

  • (రేవంత్ తుమ్మడిహెట్టి కడితే మైలేజీ, అది రావడం కేసీయార్‌కు ఇష్టం ఉండదు, కేసీయార్‌కు ఇష్టం లేకపోతే సహజంగానే తన శ్రేయోభిలాషి కిషన్‌రెడ్డికీ ఇష్టం ఉండదు, అందుకే ఫడ్నవీస్‌తో మాట్లాడడు… అదీ అసలు కథ…)

ప్లాన్- బి ప్రకారం…  సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ ఎలాగూ ఉంది, ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం నెట్‌వర్క్ కూడా ఉంది, మేడిగడ్డ, అన్నారం కేసీయార్ పుణ్యమాని పనికిరాకుండా పోయినా సరే, ప్రాణహిత (వార్దా- వెయిన్ గంగ) ఆదుకుంటుంది…

వార్దా వెయిన్ గంగ

రేవంత్ రెడ్డి ఆలోచన అభినందనీయం... రాజకీయ కారణాలతో కిషన్ రెడ్డి, ఫడ్నవీస్, వారి వెనుక మోడీ గనుక సహాయ నిరాకరణ మార్గంలోనే ఉంటే… వాళ్లకు తెలంగాణ జనప్రయోజనాలు పట్టని పక్షంలో, ఏ ప్రత్యామ్నాయాలతో రేవంత్ రెడ్డి సాధించుకొస్తాడనేది కీలక ప్రశ్న… ఈ మొత్తం వ్యవహారంలో అడ్డగోలుగా బదనాం అవుతున్నది మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పిరికి మోదీ- భయపడ్డాడు – దాసోహం- అసాంఘిక శక్తులదే గెలుపు !!
  • మోదీ అర్థరాత్రి వీడియోల స్ట్రాటజీ ఏమిటో తెలుసా..? ఇదుగో !!
  • … ఇప్పుడిక సాయిపల్లవి గిరజాల జుట్టుపై పడ్డారు !! What Next ?
  • ఇంట్రస్టింగు! జననాయకుడు శ్రీలీలకు మంచి పేరు తెచ్చిపెట్టాడు!
  • బంగ్లాదేశ్‌లో మళ్లీ దుమారం! అధ్యక్షుడి రాజీనామా వెనుక అసలు కథేంటి?
  • మోదీ అంటే గజగజ- రేవంత్‌పై రుసరుస- ఫాఫం కేటీయార్!!
  • ‘నా భార్య సగం ఇండియన్ – కొడుక్కి ఇండియన్ సైంటిస్ట్ పేరు’
  • నెట్ లేకున్నా… ఏ టెక్నాలజీని ఢిల్లీ విద్యార్థులు వాడుతున్నారు?!
  • అప్పట్లో మామకు బీవీ మోహన్‌రెడ్డి! ఇప్పుడు అల్లుడు బాబుకు జయరామిరెడ్డి?
  • శబరిమల అయ్యప్ప గుడి – ‘బంగారం దొంగలు’ దొరికిపోతున్నారు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions