.
ఒకాయన అడిగాడు… బాలసుబ్రహ్మణ్యం వివాదం ఏమైందీ అని… నిజానికి అదంత పర్టిక్యులర్ కాదు, దానికి పెద్ద ప్రాధాన్యమూ లేదు… వేలాదివేల తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి… బాలు బొమ్మ ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? అసలు దీన్ని మించినవి చూద్దాం…
ఒకండు… అచ్చంగా తెలుగు జాతి మనోభావాలు ఇవే అంటూ తన పత్రిక, తన టీవీతో ఒక్క పార్టీకి అనుకూలంగా, ఒక్క సెక్షన్‌కు అనుకూలంగా తెలుగు జాతి ఫీలింగ్స్‌ను పొల్యూట్ చేసి, ట్యాంపరింగ్ చేసి…. తెలుగు జాతి మీద వేల కోట్ల (ఏమో, లక్షకు దాటి..?) సంపాదించిన ఓ పద్మ పురస్కార కీర్తిశేషుడి మీడియా…
Ads
ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఆ పత్రిక పేరు వాడుకోవద్దట… ఆ పత్రిక పీడీఎఫ్ ఎవడూ షేర్ చేయవద్దట… నేరమట… పేటెంట్ రైట్స్ అట… ఆల్రెడీ 30 మందిపై దాకా కేసులు వేస్తుందట, లీగల్ నోటీసులు ఇచ్చిందట… నష్టమేమిటట, నువ్వు పబ్లిక్ డొమైన్‌లో లేవా..? నీకు జరిగే నష్టం ఏమిటి..? సముద్రంలో పిట్ట రెట్ట..!! ఇప్పుడిక దానిపై, దాని ముఖ్య కార్యనిర్వాహకులపై జాలి కాదు, ఏవగింపు… ప్రత్యేకించి తెలంగాణలో…
ఒకండు లక్ష నాగళ్ల మాట విడిచి, హైదరాబాద్ ఆణిముత్యం అని సాగిలబడతాడు… మరొకండు… భయంతో, ముడుచుకుపోతాడు… తెలంగాణ ఖర్మ…
తెలంగాణ సహజ వనరుల దోపిడీ కేంద్రం అది… పక్కా ఆంధ్రా మూలాలు, అదే ఆంధ్రా పచ్చ పక్షపాతం.,. అన్నింటికీ మించి సదరు చిట్‌ఫండ్స్, సదరు డిపాజిట్ల సేకరణ కేసులు… దానికి పొరుగు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇప్పటికీ…
ఫాఫం తెలుగు జాతి… దోపిడీ చేసేవాడిదే రాజ్యం… (బాధ్యులు మాత్రం సిబ్బందిని దోపిడీ చేస్తూ మానవవనరులు, జాతి ఐక్యత, పాత్రికేయ ప్రమాణాలు అనే సొల్లు కబుర్లు చెబుతారు… ఎర్రెర్రని డొల్ల మేధావిత్వం)…
మరొకండు… తనూ విఖ్యాత పద్మపురస్కారుడు… వేల కోట్ల సంపాదన… ఆగిందీ లేదు, ఆగదు… లక్షల మద్దతుదార్లను అడ్డంగా ఓ జాతీయ పార్టీకి అమ్ముకున్నోడు… తన పేరు వాడొద్దట, నిజానికి అది తన జెనెటివ్ పేరే కాదు… అన్నయ్య, చిరంజీవి వంటి తెలుగు పదాల్నే కాజేసి… బహుపరాక్, వాడితే అంతు చూస్తా అంటున్నాడు… తనను తెలంగాణ జనం ఈరోజుకీ కీర్తిస్తుంది… ఐరనీకి పరాకాష్ట…
మరొకడున్నాడు… ఆఫ్టరాల్ ఓ చిన్న కంట్రాక్టర్… లక్షల కంట్రాక్టు, సబ్ కంట్రాక్టు దొరికితే పండుగ చేసుకున్నోడు… ఈరోజు అన్ని రంగాల్లోకి అక్టోపస్… లక్షల కోట్ల సంపాదనతో ప్రతి పార్టీకి ఎడాపెడా కమీషన్ల దాత… త్వరలో ఫోర్బ్స్ మన్నూమశానం జాబితాలు దాటేసి… ఆఫ్టరాల్ అంబానీ, ఆఫ్టరాల్ ఆదానీ అనే రేంజ్ ఎదుగుదల…
తన వార్తలు ఎవడూ రాయొద్దుట.,.. గాగ్ ఆర్డర్స్… మన న్యాయవ్యవస్థ సంగతి తెలిసిందే కదా… వెరసి ఏం అర్థమవుతోంది..? ఈ దేశంలో డెమొక్రటిక్ స్పిరిట్ లెవల్ జీరో… భావప్రకటన స్వేచ్ఛ జీరో… (ఆ పేరుతోనే మీడియా నడిపించేవాడికీ దానిపై గౌరవం లేదు, ఉండదు..)
సో, సంస్కరించాల్సింది భారత న్యాయ సంహితలు కాదు… స్థూలంగా డెమొక్రటిక్ స్పిరట్‌ను దెబ్బతీసే కుట్రల్ని, పెత్తందారీ పోకడల్ని…. సర్లే, అంత అర్థమయ్యేవాడు ఎవడున్నాడు ఇప్పుడు అంటారా..? నిజం… శ్రీమాన్ రాహుల్ గాంధీ అనబడే వారస రక్తం సాక్షిగా ఎవరూ లేరు..!!
బీఆర్ఎస్ అధినేత దాసోహం... తెలుగుదేశం అధినేత దాసోహం... ప్రస్తుత కాంగ్రెస్ సీఎం దాసోహం... అదీ తెలుగు జాతి దుర్విధి... ఐనా అమిత్ షా వెళ్లి ఆ ‘కుర్చీ’ ఎదుట మోకరిల్లిన దుస్థితి... ఇంకేం చెప్పాలి..?
Share this Article