వెంకటేష్ నటించిన హిట్ సినిమా దృశ్యం గుర్తుందా… ‘‘ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మనం అసలు ఊళ్లోనే లేము… అసలు ఆ సంఘటన ఏమిటో మనకు తెలియదు… మనకేమీ తెలియదు… అంతే…’’ అని కుటుంబసభ్యులకు నూరిపోస్తాడు… అవసరం అది… పర్ సపోజ్, ఆ దృశ్యాన్ని నమస్తే తెలంగాణ భాషలో చెప్పాలంటే… ‘‘అసలు ఆ అయిదు రాష్ట్రాలకు ఎన్నికలే జరగలేదు… మనకేమీ తెలియదు… అసలు ఆ ఎన్నికలేమిటో మనకు తెలియదు…’’
నమస్తే తెలంగాణ ఎన్నికల కవరేజీ తరీఖ చూస్తే ఇదే గుర్తొచ్చింది… మునుపటికి ఎవరో నా కోడి కూస్తేనే తెల్లారినట్టు అన్నాడట… ఇదీ అంతే… తనకు బీజేపీ గెలుపు నచ్చలేదు కాబట్టి, బిగ్ బాస్ బాగా హర్ట్ అయిపోయాడు కాబట్టి, ఇక ఆ ఎన్నికల వార్తలకు ప్రయారిటీ లేదా..? ఆఫ్టరాల్ యాభై వంద కాపీలు అచ్చేసుకునే చిన్న పత్రికలకు, వాట్సప్ ఎడిషన్లకు కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్ ప్రయారిటీ ఏమిటో తెలుసు..? ఎవడికైనా సరే, ఫస్ట్ లీడ్ వార్తలు ఇవి… అలాంటిది ఈ ఎన్నికల రిజల్ట్‌ను, అదీ బీజేపీ 4 రాష్ట్రాల గెలుపును భీకరంగా అండర్ ప్లే చేసి, పంజాబ్‌లో ఆప్ గెలిచింది అంటూ ఫస్ట్ పేజీలో దిగువన ఎడమవైపు రెండు కాలాలు మొక్కుబడిగా అచ్చేసింది…
ఓ దశలో అదీ వేస్ట్ అనుకుని ఉంటుంది బహుశా… లోపల పేజీల్లో ఓ సగం పేజీలో ఐదు రాష్ట్రాలనూ చుట్టేసి, మమ అనిపించేసి పేజీలు దులుపుకుంది… తనకు పత్రిక లక్షణాలు వీసమెత్తు కూడా లేవని, రావని, తనకు అవసరమే లేదని మరోసారి నిస్సిగ్గుగా ప్రకటించుకుంది… ఫాఫం, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పత్రికలు కావా..? నాలుగైదు పేజీల చొప్పున ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించాయి… అవునులే… వాటికీ నమస్తే తెలంగాణకు పోలిక ఏమిటి…
Ads
నిజానికి దేశంలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే… మినీ జనరల్ ఎలక్షన్స్‌గా అందరూ భావిస్తుంటే… అసలు ఎన్నికలే జరగలేదు అన్నంతగా వ్యవహరించడం విస్మయకరం… మీరు వార్తలు వేస్తేనే ఎన్నికలు జరిగినట్టా..? ఇదెక్కటి విడ్డూరం… పాత్రికేయంలో పాతాళస్థాయి… దాన్నలా వదిలేస్తే… ఈనాడు ప్రధాన శీర్షిక ‘కమల దుందుభి’ పెద్ద ఇంప్రెసివ్‌గా లేదు, ఉత్త పాతచింతకాయ పచ్చడి… అంతేలే… పత్రిక ముసలిదైపోయిందిగా…
సాక్షిలో ‘నరేంద్రజాలం’ రొటీన్ హెడింగ్… కానీ పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ‘ఆప్ ‘స్వీపురు’ అని పెట్టిన శీర్షిక బాగుంది… ఆంధ్రజ్యోతి అంతా డిఫరెంటు కదా… ఈమధ్య భీకరంగా హిట్టయిన పుష్ప సినిమాలోని పాపులర్ డైలాగ్… ‘ఫ్లవర్ కాదు, ఫైర్’నే యథాతథంగా పెట్టింది… ఆప్ట్‌గా ఉంది… మిగతా చిన్నాచితకా పత్రికలు సోసో… కథనాలు, విశ్లేషణలకు వస్తే మూడు ప్రధానమైన పత్రికలూ రొటీన్ ధోరణిలోనే వెళ్లాయి… ఇంట్రస్టింగ్ విశ్లేషణలు ఎందులోనూ లేవు… సాక్షి ఎడిట్ పేజీలో ఎన్నికల వాసనే లేదు… రాసేవాళ్లే దొరకడం లేనట్టుంది దానికి… ఆంధ్రజ్యోతిలో రామచంద్రగుహ వ్యాసం ఒకటి ఇంట్రస్టింగుగానే ఉంది…
Share this Article