Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వీ6వెలుగు Vs బీఆర్ఎస్ ! KCR కొండపోచమ్మ నీటిమళ్లింపు రాద్ధాంతం !!

October 19, 2026 by M S R

.

పత్రికలన్నీ పార్టీల బాకాలే కదా… మీడియా సర్వం అంతే కదా… తమ బాసుల పొలిటికల్ లైన్స్‌కు అనుగుణంగా ‘వర్తమాన పాత్రికేయ పాతివ్రత్యాన్ని’ పాటించాల్సిందే కదా… నమస్తే తెలంగాణ వంటి పత్రికలైతే (?) తమ పార్టీ ముఖ్య నేతలను మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటాయి… సాక్షి సరేసరి… అది నమస్తేకు తాత…

అఫ్‌కోర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేరుకు తటస్థం… చాన్నాళ్లుగా అవీ ముసుగులు విప్పేసుకుని పచ్చంగీలు తొడుక్కుని చెలరేగుతున్నాయి కదా… సాక్షి వైసీపీ… ఈటీవీ- ఏబీఎన్ టీడీపీ… టీన్యూస్ బీఆర్ఎస్… టీవీ5, మహాన్యూస్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… ఇలా పక్కాగా పోలరైజేషన్… జనసేనకు కూడా ఏదో చానెల్ ఉన్నట్టుంది…

Ads

మరి కాంగ్రెస్ పార్టీకి..?  మంత్రి వివేక్ సొంత చానెల్ వీ6, వెలుగు పత్రిక… మరి తనకుమాలిన ధర్మం అక్కర్లేదు కదా… పార్టీ లైన్‌కు తగినట్టు… కేసీయార్ తన వందల ఎకరాల పొలాలకు ఏకంగా కాళేశ్వరం నెట్‌వర్క్‌లో భాగమైన కొండపోచమ్మ నీళ్లను మళ్లించుకున్నాడని ఓ గ్రౌండ్ రిపోర్ట్ రాసింది… సవివరంగా, గతంలో ప్రజలకు తెలియని ఫోటోలు, ఆధారాలు కూడా జతచేసింది…

వీ6లో ఇది ఇంకాస్త పవర్‌ఫుల్‌గా, అంటే ప్రభావవంతంగా ఉంది… నిజానికి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశమే ఇది… కేసీయార్ పొలాలకు ఆ రిజర్వాయర్ నీళ్లను ప్రత్యేకంగా ఓ చెరువు తవ్వి మరీ తరలిస్తున్నారని… సవాల్ కూడా చేశాడు… వీ6, వెలుగు ఫోటోలు, వీడియోలు, ఆధారాలతో సవివరంగా కవర్ చేసింది… అది ఎక్స్‌క్లూజివ్ ఎఫర్ట్…

ఈనాడుకు ఆమధ్య కేటీయార్ మరేదో అంశంలో నోటీసు పంపించేసరికి, అది చల్లబడిపోయి, దాదాపు క్షమాపణ చెప్పింది… దానికి గ్రౌండ్ రిపోర్టులు వంటివి ఎలాగూ చేతకావు… ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ పట్ల, రేవంత్ రెడ్డి పట్ల పాజిటివ్ లైన్ ఉంది తప్ప ఎక్స్‌క్లూజివ్ స్టోరీలు బ్లాస్ట్ చేసే చొరవ, ఉత్సాహం, స్టాఫ్ లేనట్టుంది… సాక్షి ఎలాగూ మరో నమస్తే తెలంగాణ…

వీ6 వెలుగు

సో, వెలుగు కవరేజీని మంత్రి వివేక పొలిటికల్ లైన్‌లోనే చూద్దాం… ఐతే బీఆర్ఎస్ లీగల్ నోటీసు జారీ చేస్తామని ఓ పత్రిక ప్రకటన జారీ చేసింది… ఎస్, పత్రిక లేదా టీవీలో అబద్ధపు వార్తలు వస్తే, తమ పరువుకు భంగం అని భావిస్తే ఖచ్చితంగా చట్టపరంగా పోరాడొచ్చు… లీగల్ నోటీసును తప్పుపట్టే పనిలేదు… ఐతే కొన్ని ప్రశ్నలు…

1)  వీ6, వెలుగు ఫోటోలు అబద్దమా, వివరాలు అబద్ధమా, ఎలా..? సవివరంగా ఖండన ఇవ్వాలి కదా, కనీసం తమ నమస్తే తెలంగాణలోనైనా వివరంగా ఓ కౌంటర్ కథనం ఇవ్వొచ్చు కదా… లేదు…

2) కేసీయార్ ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు లీగల్ బాటలో వెళ్తాం అంటున్నారు… సరే, కానీ ఏ అబద్ధాలతో ఆ ప్రతిష్ట దెబ్బతిన్నదో చెప్పాలి కదా… లేదు…

3) వీ6వెలుగు అవన్నీ నిజాలే అని చెబుతోంది… ఆధారాలు ఇవిగో అంటోంది… పొలిటికల్ లైన్ కాబట్టి ఏమీ వెనక్కి తగ్గకపోవచ్చు… లీగల్ నోటీస్‌లో పేర్కొన్న క్షమాపణలు, డిలిషన్స్ ఏమీ చేయకపోవచ్చు…

4) లీగల్ నోటీసులో ఏమేం రాశారో చూశాక, అంశాలవారీగా స్పందిస్తాం, జవాబు చెబుతాం అంటోంది ఈరోజు ఓ వార్తలో…

5) ఇంతకీ ఆ పాండవుల చెరువు దేనికి తవ్వినట్టు..? దానికి కొండపోచమ్మ నుంచి నీళ్లు తరలించడం ఒరిజినల్ కాళేశ్వరం ప్లానులో ఉందా..? ఆ చెరువులో కనిపిస్తున్న పంపులు నిజం కాదా..?

6) అవి కేసీయార్ పొలాలకు నీటిని పంప్ చేయడం లేదా..? 3 ఎకరాల బావి నిజం కాదా..? ప్రజలు వీటికి జవాబులు కోరుకుంటే అందులో తప్పేముంది..? ఆ జవాబుల్ని కేసీయార్ క్యాంపు సవివరంగా ఇస్తే తప్పేముంది..? దాచుకోవడానికి ఏముంది..? సో, మొత్తానికి వీ6వెలుగుకూ బీఆర్ఎస్ పార్టీ నడుమ ఈ ఫైట్ ఇంట్రస్టింగుగా మారింది…

7) ఇంతకీ కేసీయార్ సర్కారు భూములు కబ్జా అని ఆరోపించి సర్వే కూడా చేయించిన రేవంత్ రెడ్డి… ఈ పాండవుల చెరువు, కొండపోచమ్మ నీటి మళ్లింపు మీద ఏమైనా విచారణ ప్రారంభిస్తాడా..? తనే కదా మొదట ప్రెస్‌మీట్‌లో ఈ ఆరోపణలు చేసింది… నిజాలేమిటో జనానికి సాధికారికంగా వెల్లడిస్తాడా..? చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీతమ్మ శౌర్యం ! ఆ ఇంగ్లిష్ వెర్షన్ సీన్ ఇండియాలో ఎందుకు తీసేశారు..?!
  • ఓహ్, అదా అసలు సంగతి – స్థానిక గెలుపు బాబు ఘనత ఏమీ కాదన్నమాట..!!
  • సో కాల్డ్ హీరో మెటీరియల్ కాదు- సో వాట్, నిఖార్సయిన నటుడు..!!
  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions