Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… బీసీ కృష్ణయ్య ఎంపిక వెనుక అంత రహస్య ప్రణాళిక ఉందా..?!

May 22, 2022 by M S R

‘‘…. .అదేమిటోగానీ జగన్‌ రెడ్డికి తెలంగాణ పట్ల నిగూఢమైన ప్రేమ ఉంది. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందేందుకు తన వంతుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని చంపేశారు… ముఖ్యమంత్రి జగన్‌కు హైదరాబాద్‌లో లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉండటం వల్లనే వాటి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తుంటారని, తెలంగాణకు చెందిన వారిని సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా నియమించుకుంటారన్న అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది….’’ ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉవాచ…

ప్చ్… బీసీ కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు ఎందుకు పంపిస్తున్నాడో అర్థం గాక, అంతుపట్టక, జుత్తు పీక్కుని, తెగ ఆలోచించి, ఇక ఉసూరుమంటూ తలలవంచుకున్నారు పెద్ద పెద్ద రాజకీయ పండితులు… ఏ కోణం నుంచి ఆలోచించినా ఈ ఎంపిక ప్రాతిపదిక ఏమిటో రెండు రాష్ట్రాల్లోని నరమానవుడికి కూడా బోధపడటం లేదు… ఫాఫం, ప్రతిచోటా స్పయింగ్ కెమెరాలు, ఇయర్ బగ్స్ పెట్టేసి, అన్నీ అలా అలా మొత్తం తెలుసుకునే రాధాకృష్ణ కూడా ఫెయిల్… అందుకే ఏమీ చెప్పలేక, జగన్‌ను వెక్కిరిస్తున్నట్టుగా ఏవో నాలుగు హాస్యాస్పద వాక్యాలు రాసేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు…

జగన్‌కు హైదరాబాద్‌లో లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉన్నందున… వాటి రక్షణ కోసం తెలంగాణ వారిని సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా నియమించుకుంటారట… వావ్… ఇది ఓ డిఫరెంట్ స్టాండప్ కామెడీ…! జగన్ బినామీ ఆస్తులకు రక్షణ కోసం కృష్ణయ్య ఎలా ఉపయోగపడగలడు స్వామీ..? నిజానికి ఆర్కేకు అంతుపట్టలేదు సరే… ‘‘నీకు రాజ్యసభ చాన్స్ ఎందుకు ఇస్తున్నాడు జగన్’’ అని నేరుగా కృష్ణయ్యనే అడిగితే జవాబు రాకపోవచ్చు… తనకైనా ఈ స్ట్రాటజీ ఏమిటో తెలుసా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్… జగన్ నిర్ణయాలు కొన్ని మిస్టరీలు… కృష్ణయ్యదీ అలాంటి మిస్టరీ అనుకుని వదిలేస్తే… షర్మిల పార్టీలాగే ఈ మిస్టరీని కాలమే చేధిస్తుందిలే అనుకుని విస్మరిస్తే… ఏమాటకామాట.., రాధాకృష్ణ కొన్ని విలువైన ప్రశ్నలు సంధించాడు ఇద్దరు ముఖ్యమంత్రులకు…

aj

ఇక్కడ ఆర్థిక పరిస్థితే అంతంతమాత్రంగా ఉంది… అప్పుల కోసం అధికారులు ఢిల్లీలో తిష్టవేశారు… మింగ మెతుకు లేదు గానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా నార్త్ రైతుల కుటుంబాలకు పరిహారాలు, గల్వాన్ జవాన్ల కుటుంబాలకు పరిహారాల పంపిణీ ఏమిటి అనడిగాడు… అంతేకాదు, ప్రతిసారీ కేసీయార్ ఢిల్లీ పర్యటన ఓ మిస్టరీయే… అసలు పదే పదే ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నావు..? రాష్ట్రాలు చుట్టేస్తానంటూ సతీసమేతంగా ఢిల్లీకి వెళ్లడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు… అంతేకాదు, అప్పట్లో ఎన్టీయార్, ఆమధ్య చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏదో ఉద్దరిస్తామని బొక్కబోర్లా పడ్డారు… నువ్వు కూడా జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తున్నాడు…

సేమ్, ఇలాంటి ప్రశ్నను జగన్‌కూ సంధించాడు… రీజనబుల్ క్వశ్చన్… ‘‘పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’’ సదస్సుల్లో పాల్గొనడానికి చంద్రబాబు తన అధికారగణంలో దావోస్ వెళ్తే నానారకాలుగా వెక్కిరించారు వైసీపీ నేతలు… కానీ జగన్ చేసిందేమిటి..? ఓ అధికార బృందం కూడా తోడు లేకుండా… ఓ ప్రత్యేక విమానం తీసుకుని, సతీసమేతంగా వెళ్లి… లండన్‌లో ఆగి, కూతుళ్లతోసహా పర్యటిస్తూ సాధించేదేమిటి..? ఇదేం మిస్టరీ..?’’ అనడిగాడు… హహహ… అటు జగన్, ఇటు కేసీయార్… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎవరికీ అంతుపట్టరు… తామెవరికీ జవాబులు చెప్పే పనిలేదు అన్నట్టుగానే వ్యవహరిస్తారు… కొన్నిసార్లు జనం ఏమనుకుంటేనేం అన్నట్టుగా కూడా ఉంటారు… ఎవరికితోచిన బాష్యం వాళ్లు చెప్పుకోవాలి… అంతే…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఉక్రెయిన్ సంక్షోభం..! రష్యాలో మన రిటెయిలర్లకు భలే చాన్సు..!!
  • గుప్తగామిని..! 18 ఏళ్ల క్రితమే పవిత్ర హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టేది… ఎందుకు..?!
  • ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…
  • హబ్బ… మక్కీకిమక్కీ ఆ కథ మొత్తం ఏం కొట్టేశావు బాసూ…
  • నక్సలైట్ల గురించి తెలియకుండా ఈ సినిమాలు ఏమిట్రా నాయనా..?!
  • మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!
  • ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?
  • నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!
  • ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!
  • అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!

Archives

Copyright © 2022 · Muchata.com · Technology Support by CultNerds IT Solutions