Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేలు స్వామి… మడత కుర్చీ… ఇప్పుడివేనా సార్ ట్రెండింగ్ టాపిక్స్…

April 5, 2024 by M S R

నా పేరు వేలు స్వామి అంటూ బిత్తిరి సత్తి ఓ పేరడీ వేషంతో వేణుస్వామిని అనుకరిస్తూ కనిపించాడు జీతెలుగు వాళ్లు ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమోలో… ఇదయితే మరీ 5 నిమిషాల ప్రోమో… సరే, వేణుస్వామిని ఏదో డ్యామేజీ చేస్తున్నట్టుగా, కించపరిచినట్టు అభ్యంతరకరంగా ఏమీ లేదు కానీ నెగెటివ్, పాజిటివ్ ఏదయినా సరే, వివాదాలు ఏమున్నా సరే, తన ఉనికిని అందరూ ఏదోరకంగా గుర్తించక తప్పని స్థితి… ఏదో ఓ రకంగా తనను ప్రచారంలో ఉంచుతున్నారు… తనకు అదే ఆనందం కావచ్చు బహుశా…

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… గుంటూరుకారం అనే సినిమాలో కుర్చీ మడతబెట్టి అనబడే ఓ వెగటు పాట తెలుసు కదా… అది అచ్చంగా ఓ బూతు… దానికి తగినట్టు ఓ వేశ్య తన విటుడిని ఉద్దేశించి పాడే పాట… మన దరిద్రం ఏమిటంటే…? ఇప్పుడది జాతి గీతంగా మారిపోయింది… రీల్స్, షార్ట్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి… ఆ పాటకు డాన్స్ చేస్తూ రీల్ చేయకపోతే ఏదో తప్పుచేసినట్టుగా రెచ్చిపోతున్నారు కొందరు మహిళలు… ఇంకా దరిద్రం ఏమిటంటే..? ఇళ్లల్లో పిల్లలకు జోలపాటలకు బదులు ఈ ట్యూన్ బాగుంది కదాని దీన్నే వినిపిస్తుండటం… ఖర్మ…

ఇప్పుడు ‘ఉగాది ఉమ్మడి కుటుంబం’ పేరిట జీతెలుగు తీసుకొస్తున్న ఈ స్పెషల్‌లోనూ ఆ మడత కుర్చీ పాట, డైలాగులు బోలెడు… సో, వేణుస్వామినీ, మడతకుర్చీనీ ఇగ్నోర్ చేయలేని ట్రెండింగ్ టాపిక్స్ అన్నమాట.,. సరే, ఇక్కడే మరో విషయం… ఇప్పుడు సినిమాల ప్రమోషన్ ఎంత స్టార్ హీరో అయినా, హీరోయిన్ అయినా, దర్శకుడు అయినా సినిమా టీమ్స్ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే… టీవీ ప్రోగ్రాముల్లో దర్శనమివ్వాల్సిందే… ఈటీవీ సుమ అడ్డా ప్రోగ్రాం అయితే మొత్తం పెయిడ్ ప్రమోషన్లే… అఫ్‌కోర్స్, అన్ని ప్రోగ్రాములను సినిమా టీమ్స్ వాడేసుకుంటున్నయ్…

Ads

ఈ జీతెలుగు ఉగాది స్పెషల్‌ను ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్‌కు ఫుల్లు వాడేసుకున్నారు… ఏకంగా హీరో విజయ్ దేవరకొండ, దిల్‌‌రాజు, మృణాల్ ఠాకూర్ కనిపిస్తున్నారు… జీతెలుగు ఆస్థాన సీరియల్ నటీనటులతోపాటు కస్తూరి, రాశి, వితిక, వరుణ్ సందేశ్, ఆలీ, అనన్య తదితరులతో ప్రోగ్రాం కాస్త ఇంట్రస్టింగుగానే కనిపిస్తోంది… ఈటీవీ ఊరుకోదు కదా… ఈసారి పండుగ మనదే అంటూ అదీ ఓ స్పెషల్ చేసింది, రెండు ప్రోమోలు రిలీజ్ చేసింది…

సుడిగాలి సుధీర్ హంగామా కనిపిస్తోంది చాన్నాళ్ల తరువాత… రౌడీ స్టార్, ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్, దిల్ రాజు ఈ ప్రోగ్రాములో కూడా పార్టిసిపేట్ చేసి, దీన్ని కూడా భలే వాడేసుకున్నారు… మరి స్టార్ మా ఉగాదికి ఏమీ చేయడం లేదా..? ఎందుకు లేదు..? మా ఇంటి పండుగ అంటూ వస్తోంది… దీంట్లో కూడా సేమ్ దిల్ రాజు… కాకపోతే తన రియల్ ఫ్యామిలీతో… ఇందులో శ్రీముఖి హడావుడి… మాటీవీ ఆస్థాన టీవీ సీరియళ్ల నటీనటులతోపాటు విజయ్ దేవరకొండ మళ్లీ ఇక్కడ కూడా… మొత్తానికి సినిమా ప్రమోషన్లతో మూడు టీవీ చానెళ్లు పండుగ చేసుకున్నాయిపో…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions