Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మో… అమ్మే…!! అసలు నీది కదా అమ్మ ప్రేమంటే… గొప్ప తల్లివి…!!

January 8, 2022 by M S R

నాకెందుకో తెలుగు టీవీ సీరియల్‌లో అత్త పాత్ర యాదికొచ్చింది… ఈమెను అమ్మ అనాలంటే కాలి వేళ్ల నుంచి తల వెంట్రుకల దాకా ఏవగింపు జరజరా పాకిపోతోంది… ఈమె అమ్మ అట… తల్లి కడుపట… వనమా రాఘవ అనే కాలకేయుడు శుద్ధపూస అని చెబుతోంది… అన్యాయంగా తనను ఇరికిస్తున్నారని కన్నీటిపాలవుతోంది… అవ్వా, అసలు నీది కదా కడుపంటే… నువ్వు కదా అమ్మవు అంటే… మొత్తం అమ్మలందరూ సిగ్గుతో తలదించుకునేట్టు చేస్తున్నవ్…

ది గ్రేట్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అద్భుతమైన నాయకత్వం, అంతకుమించి పరమాద్భుతమైన ఆయన కొడుకు గారి సత్ప్రవర్తన… ఫాఫం, ఈయన గారి మంచితనాన్ని అర్థం చేసుకోలేక నాగరామకృష్ణ అనే పిచ్చోడు పిల్లల్ని, పెళ్లాల్ని కూడా కలుపుకుని సూసైడ్ చేసుకున్న ఉదంతం విన్నాం, చూశాం, చదివాం కదా… ప్చ్, ఈ తల్లి అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు ఫాఫం… ఎంత పెద్ద అమ్మ మనస్సు ఆమెది… అమ్మా… తల్లీ… నీలాంటోళ్లు చరిత్రలో నిలిచిపోవాలి మాతా…

vanama

Ads

ఆస్తి కోసం కొడుకు ఇబ్బందులు పెట్టాడట, చాలా పెద్దమనిషి, మర్యాదరామన్న, ధర్మరాజు వంటి వనమా రాఘవ అనే ఓ ఆదర్శపురుషుడి దగ్గరకు న్యాయం కోసం వెళ్లిందట… ” ఒరేయ్, నీ పెళ్లాన్ని తీసుకుని రా ” అని రాఘవ చెప్పాడు అంటే, ఆమెకు చీర, సారే పెట్టడం కోసమే అని కూడా చెప్పకపోయావా…!!? ఏం అక్క…? ఏం అమ్మ…? సదరు రాఘవుడు కూడా ధర్మనిరతుడై న్యాయం చెప్పాడట… కానీ అనవసరంగా కొడుకు సూసైడ్ చేసుకున్నాడట..!! ఒసేయ్ డర్టీ మదర్ ఆఫ్ ఇండియా… నీది కూడా ఓ కడుపేనా అని తిట్టాలని ఉందా..? కనిపిస్తే ఏం చేద్దామని ఉంది… కూల్, కూల్… అలాంటి తల్లులు చాలామంది కనిపిస్తున్నారు ఈమధ్య…

అవసరమైతే ఇకపై రాఘవే నా కొడుకు అనేట్టుగా కూడా ఉంది ఈ మహాతల్లి… ఈ సూర్యావతి కన్నీటిపర్యంతమైందట, రాసిన విలేకరి కూడా బాగా కనెక్టయిపోయి, చాలా సానుభూతితో రాశాడు పాపం… అసలు ట్విస్ట్ చివరలో కనిపించింది… తన భర్త నక్సల్స్ పేల్చిన మందుపాతరలో హరీ అన్నాడట… ‘‘బతికిపోయాడు’’… అవును, ఇంతకీ ఈమె మొగుడు గారు ఏం కొలువు చేసేవారో… ఆ క్లారిటీ సదరు విలేకరి గారు ఇవ్వలేదు, ఇది రాసేసరికే కన్నీటితో గుండె బరువెక్కి, కలం కదిలి ఉండదు…

సో, ఏతావాతా చెప్పేదేమిటయ్యా అంటే… ఆస్తులే అంతిమం… ఈ కడుపుతీపి, పేగుబంధం, అమ్మప్రేమ అంతా హంబగ్… అవసరమైతే కీచకులను కూడా అపర ధర్మావతారం అని సర్టిఫికెట్టు ఇవ్వగలరు… కరెన్సీ నోట్ల ముందు, కన్నపేగు అనేది నాన్సెన్స్… ఉండాలమ్మా, నీలాంటోళ్లు ఉండాలి లోకంలో… అమ్మ కడుపు తీపి, అమ్మ ప్రేమ అనే పదాలు ఉత్త అబ్సర్డ్ పదాలు అనే చేదునిజాలు జనానికి తెలియాలంటే… ఆ పదాల చుట్టూ ఇన్నాళ్లూ పిచ్చి సామాజికవేత్తలు, రచయితలు అల్లిన పదాలన్నీ ఉత్త భ్రమపదార్థాలే అని తేల్చేయడానికి నీలాంటోళ్లు అవసరం… అవసరం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions