.
జనసేన పార్టీ నుంచి ఒక ప్రకటన… సింపుల్‌గా పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని..! అంతే, పవన్ కల్యాణ్ మాత్రం స్పందించలేదు, సారీ చెప్పింది లేదు… చివరకు పార్టీ నుంచి కూడా ఆ ధోరణి కనిపించలేదు… సింపుల్… ఏం చేసుకుంటారో చేసుకొండి అనే ధోరణి కనిపిస్తోంది..!
ఎస్, తెలంగాణ ఏర్పడినప్పుడు… వారం పది రోజులు నిద్రాహారాలు మాని బాధపడిన తెలంగాణ వ్యతిరేకి… తెలంగాణ ఏర్పడి పుష్కరకాలం దాటిపోయినా సరే, ఈరోజుకూ అదే పోకడ… ఇంకా బీజేపీ, టీడీపీలతో కలిసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణను ఉద్దరించడానికి ఎన్‌డీఏ కూటమిగా వస్తాడట…
Ads

పవన్ కల్యాణ్ మాటల్ని వక్రీకరించారు అనగానే మాఫ్ అయిపోయినట్టేనా..? పవన్ కల్యాణ్ ఏమన్నాడో, ఏ ధోరణితో మాట్లాడాడో అర్థం చేసుకోలేనంత అజ్ఞానులా తెలంగాణజనం మీ దృష్టిలో… ఎవరో కాంగ్రెస్ నేతలు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయగానే… ఎవరెవరో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు…
ఏం, తెలంగాణ మీ జాగీరా అని..! ఎస్, తెలంగాణ ప్రేమికులదే ఈ తెలంగాణ జాగీర్… తెలంగాణ ద్వేషులది కాదు, కానేకాదు… ఇదేదో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సెంటిమెంట్‌ను మళ్లీ రాజేయడానికి చాన్స్ దొరికినట్టే ఉంది అనుకుని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వంటి నాయకులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించారు… గుడ్…
(తెల్లారిలేస్తే లక్ష విషయాలపై స్పందించే హరీష్ రావు, కేటీయార్ ఇప్పుడు మాత్రం స్పందించరు… తెలంగాణ ఆత్మాభిమాన ప్రతీకగా చెప్పుకోబడే కేసీయార్ ను డిస్టర్బ్ చేయకండి, దొరవారు యోగనిద్రలో ఉన్నారు…)
లేటుగానైనా సరే… ఇదేదో బీఆర్ఎస్‌కు ఉపయోగపడుతుందేమో అనే సందేహంతో కాంగ్రెస్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ స్పందించి, పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి తెలంగాణ జనానికి అని డిమాండ్ చేశారు… అందులో కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా… నీ సినిమాల్ని తెలంగాణ జనం బహిష్కరిస్తారు సుమా అని సీరియస్ కామెంట్స్ చేశాడు కోమటిరెడ్డి…
సరే, కోమటిరెడ్డి అనగానే నిజంగానే తెలంగాణ ప్రభుత్వం పవన్ కల్యాణ్ తెలంగాణ వ్యతిరేక ధోరణులు, వ్యాఖ్యల మీద ఏరకంగా వ్యవహరించనుందో వేచి చూడాల్సిందే… సినిమాటోగ్రఫీ అసలు మంత్రులు దిల్ రాజు, రోహిణ్ రెడ్డి ఏమంటారో చూడాలి… మరీ రేవంత్ రెడ్డి దాకా అక్కర్లేదు…
- ఇదంతా సరే… తెలంగాణ బీజేపీ ఎందుకు స్పందించడం లేదు..? పవన్ కల్యాణ్ మీద ఉన్న ప్రేమ, కూటమి సెన్సిటివిటీ ముందు తెలంగాణతనం ఓడిపోయిందా..? వీగిపోయిందా..? తెలంగాణ అభిమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారా ఓ సినిమా హీరో పాదాల మీద..!?
- బెనిఫిట్ షోలు, ప్రిరిలీజ్ ఫంక్షన్లు, టికెట్ రేట్ల పెంపు వంటి అంశాల మీద యూటర్న్ తీసుకున్నట్టే… నాలుగు రోజులాగి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు సైలంట్ అయిపోతారా..? ఈ దిష్టి యవ్వారం దిష్టి తీయడానికి కమిటై ఉంటారా..?
సదరు పవన్ కల్యాణ్ అనబడే భారత జాతి ఆశాకిరణం దిష్టి వ్యాఖ్యలపై ముచ్చట ఫస్ట్ ప్రచురించిన కథనం ఇదుగో లింక్…
ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
అవునూ, తెలంగాణ మేధావిత్వం ఇంకా నిద్ర నుంచి మేలుకోలేదా..?

Share this Article