Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎడమ భుజం కూడా రెడీ అయిపోయింది… ఇక ఒక్కొక్కడి దవడ పగిలిపోద్ది…

January 5, 2022 by M S R

కదిలిస్తే చాలు, ఏ సెలబ్రిటీ అయినా సరే, సోషల్ మీడియాలో ఇలా రాశారు, ఈ చెత్తా వీడియో రిలీజ్ చేశారు, బాధ్యత లేదు, నాన్సెన్స్, ట్రాష్, ఫాల్స్ అంటూ ఏడుస్తుంటారు… నాలుగురోజులు ఏదో ఒక ప్రచారం లేకపోతే కూడా వాళ్లే ఏడుస్తారు… ఏదోరకంగా ప్రచారంలోకి రావాలని చూస్తారు… ఇవ్వాళారేపు మెయిన్ స్ట్రీమ్ వార్తల్లో ఏం రాసుకున్నా, రాయకపోయినా, చూపినా, చూపకపోయినా డోన్ట్ కేర్… సోషల్ మీడియాలో స్పందనే చూస్తున్నారు… అందుకే యూట్యూబులో ఇన్ని వ్యూస్, ఇదుగో ఇలాంటి కామెంట్స్ అంటూ గ్రేటుగా చెప్పుకోవడం, మళ్లీ యూట్యూబ్ వ్యూస్ అనేది కూడా ఓ దందా… సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఓ పెయిడ్ దందాయే… పిచ్చి ఫ్యాన్స్‌కు ఇవేవీ తెలియవుగా…

సరే, అసలే బాలయ్య అంటే ముక్కు మీద కోపం… మనిషి భోళాయే గానీ ఎమోషన్ ఆపుకోలేడు… ఎవడైనా ఫ్యాన్ ఓవర్ చేస్తే అక్కడే నాలుగు తగిలిస్తాడు.., అయ్యో, వాడు నా ఫ్యాన్, కొట్టొద్దు కదా… వంటి ఫీలింగ్సేమీ ఉండవ్… ఫ్యాన్ అయితే బాధ్యత ఉండనక్కర్లేదా అనేస్తాడు… మీడియాలో తన గురించి ఏం రాశారో కూడా పెద్దగా పట్టించుకోడు… మరి సోషల్ మీడియా ట్రోలింగ్‌కు బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడు..? ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అని ఓ షో చేస్తున్నాడు కదా… ఈసారి అందులో సోషల్ మీడియా పోస్టులు, రాతల గురించి కొన్ని కామెంట్లు చేశాడు…

‘‘ప్రపంచంలో ప్రతివాడూ సోషల్ మీడియాలో ఏదంటే అది అనేస్తున్నాడు… పేరు లేని, లొకేషన్ తెలియని అడ్రెస్సులతో ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తున్నారు… రవితేజకు బాలకృష్ణకూ పడదు, బాలకృష్ణ చిరంజీవి ఫోన్‌లో మాట్లాడుకోరు, నా హీరో తోపు, నీ హీరో తోపు… హేంటివన్నీ..? లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయ్యింది… (ఈమధ్య ఏదో సర్జరీ జరిగినట్టుంది కదా…) దొరికితే దవడ పగిలిపోద్ది..’’ అని అఖండ రేంజులో కొన్ని డైలాగులు విసిరాడు… అందరూ చప్పట్లు కొట్టారు… కానీ బాలయ్య కదా… జస్ట్, మరుక్షణమే పూర్తి యూటర్న్… మరి బాలయ్య కదా… ఆ కేరక్టర్ అంతే…

Ads

‘‘కానీ మనం చేయాల్సింది ఒకటే… ఊరూ, పేరు చెప్పుకోలేని, ధైర్యం లేని, ఈ వెధవల్ని క్షమిద్దాం… మన మీద వచ్చిన విమర్శల్ని ప్రేమించినప్పుడే మనం అన్‌స్టాపబుల్ అవుతాం…’’ అన్నాడు… మళ్లీ అక్కడి జనం కేకలు వేశారు, చప్పట్లు కొట్టారు… హేమిటో ఇదంతా… దవడ పగిలిపొద్దీరోయ్ అని తిడుతూనే… సర్లే, రాసుకోనీ, క్షమించేద్దాం అంటూ ఔదార్యాన్ని ప్రదర్శించడం… హేమిటో… అఖండ సినిమాలాగే ఉన్నట్టుగా అనిపిస్తోందా..? అంతేలెండి… అలాగే ఉంది… కానీ ఒక్కటి మాత్రం క్లియర్… ఏమైనా రాసుకొండి, కొట్టను, చేయిచేసుకోను అనే భరోసా ఇచ్చాడు… హమ్మయ్య…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions