.
గుర్తుందా మీకు..? ఆదిపురుష్ ప్రిరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగినప్పుడు… ఆ వేదిక ఎక్కడానికి కూడా ప్రభాస్ కాళ్లు సహకరించక… లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది… అందరికీ తెలిసిందే, రాసిందే…
అప్పటికే తన మోకాలి చిప్ప ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు తనను సతాయిస్తున్నాయి… ఆ తరువాత కల్కి… ఆ సినిమా జయాపజయాల్ని, వసూళ్లను వదిలేయండి… ఆ సినిమా తరువాత తను జనంలోకి వచ్చి పలకరించింది తక్కువే…
Ads
ఎక్కడో తనను నడిపించుకుంటూ తీసుకొస్తున్న ఫోటోలు కూడా కనిపించాయి… అసలు ఏమైంది ప్రభాస్‌కు..? నటుడిగానే కాదు, ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ప్రభాస్‌ను చాలామంది అభిమానిస్తారు… వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ మీద పల్లెత్తు మాట అనరు… అదీ తను సంపాదించుకున్న భారీ క్రెడిట్…
కానీ..? మోకాలి చిప్పల సర్జరీలు ఎంతకూ సెట్ కాకపోవడంతో ఇటలీలో ఓ ఇల్లు తీసుకుని, అక్కడే ఉంటూ చికిత్స పొందుతున్నాడనేది కూడా అందరికీ తెలిసిందే… ఆమధ్య జపాన్‌లో ఓ ప్రోగ్రాంకు వెళ్లాల్సి ఉన్నా, వెళ్లలేని అనారోగ్య స్థితి… (నో, నో, సర్జరీలు సక్సెస్ అనీ వార్తలు వచ్చాయి… కానీ తను ఇప్పుడు ఉన్నది ఇటలీలోనే…)
జపాన్ పోలేదు, తన కాలు బెణికింది అని ప్రభాస్ పీఆర్ టీం ఏదో నోట్ కూడా రిలీజ్ చేసింది… తన కాళ్లు, వెన్నెముక, మెడ… స్థూలంగా తను మళ్లీ మామూలు ప్రభాస్ ఎప్పుడవుతాడో, తన ఆరోగ్యం ఎప్పుడు సెట్ అవుతాయో ఎవరూ చెప్పలేని స్థితిలో… నిన్న పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తన కాలికి మరో ప్రమాదం ఏదో జరిగిందనే సమాచారం వినిపిస్తోంది… అదే నిజమైతే తన కెరీరే ప్రశ్నార్థకం అవుతుంది… ఆందోళనకరం…
అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కూడా షేకింగ్… ఎందుకంటే..? కల్కి-2, స్పిరిట్, బ్రహ్మరాక్షస, కన్నప్ప, రాజా సాబ్, ఫౌజీ, సలార్-2… ఇలా బోలెడు భారీ ప్రాజెక్టులు తన కోసం వెయిట్ చేస్తున్నాయి… హొంబలే ప్రొడక్షన్స్ వాళ్లు ఏకంగా మూడు సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చినట్టు కూడా వార్తలున్నాయి…
అంటే, ఓవరాల్‌గా కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ప్రభాస్ మీద ఆధారపడి ఉన్నాయి… ఇంత డిమాండ్ ఉన్న హీరో ప్రస్తుతానికి ప్రభాసే… సరే, కన్నప్పలో ఎలాగూ చిన్న గెస్ట్ రోలే కాబట్టి దాన్ని వదిలేస్తే మిగతావన్నీ ప్రిస్టేజియస్, భారీ వందల కోట్ల సినిమాలు… తన మార్కెట్ అంత హెవీగా ఉంది… ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్‌లో అత్యంత విలువైన వేల కోట్ల పందెం పుంజు తను…! నిజానికి ఈ భారీ మార్కెట్ ఒక తెలుగు హీరోకు దక్కడం అపూర్వం…
ఒక తెలుగు హీరో ఇంతగా ఇండియన్ సినిమాలో పాపులారిటీ, మార్కెట్ సంపాదించడం అత్యంత అరుదైన విశేషం… ఎటొచ్చీ ఇప్పుడు తన ఆరోగ్యస్థితి ఏమిటనేదే ఆందోళనకరం… ఆల్రెడీ ఉన్న సమస్యలకు తోడు తాజాగా మళ్లీ కాలికే వచ్చిన సమస్య నిజమైతే, నెలల కొద్దీ తను రెస్టుకే పరిమితమయ్యే సిట్యుయేషన్ గనుక వస్తే, అది తనకు పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది… తనకే కాదు, చాలా భారీ ప్రాజెక్టులకు..!
ఆల్రెడీ తను అప్పుల్లో ఉన్నట్టు ఫిలిమ్ సర్కిళ్లలో టాక్ ఉంది… ఇక నెలల కొద్దీ రెస్టు అనేదే నిజమైతే ఆందోళనకరమే… ఎన్ని నెలలు కాలికి పని చెప్పకుండా రెస్ట్ తీసుకోవాలో క్లారిటీ రావాలి కానీ… ప్రభాస్‌కే ఎందుకు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు..?
బ్యాడ్ లక్, జాతకదోషం… తన వ్యక్తిగత జీవనవిధానం… కారణాలు ఎవరెన్ని చెప్పినా సరే.,. ప్రభాస్ వేగంగా కోలుకొని మళ్లీ సినిమాల్లో త్వరగా దుమ్మురేపాలనే ఆశిద్దాం… తన ముద్ర అలాంటిది ఇప్పుడు ఇండియన్ సినిమా మీద..!!
Share this Article